|
User(s) browsing this thread » 1 Guest(s) |
|
14-01-2011, 08:22 PM
Post: #1
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
Windows 7 లో Bitlocker feature యొక్క ఉపయోగము మరియు అది ఎలా ఉపయోగించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం! సాధారణంగా మన సిస్టం లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్ లేదా ఫోల్డర్ ని ఇతరులు ఓపెన్ చేయకుండా folderlocker లేదా మరేదైనా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి లాక్ చేస్తుంటాం. Windows 7 లో Bitlocker అనే ఫీచర్ ద్వారా ఒక డ్రైవ్ లేదా పార్టీషన్ ను పాస్వర్డ్ ద్వారా encrypt చేసి ఇతరులనుండి ప్రొటెక్ట్ చేయొచ్చు.దానివలన ఆ డ్రైవ్ లో ఫైల్స్ లాస్ అవడం లేదా హ్యక్ అవడం జరగదు. *ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం! 1.మీరు ఏ డ్రైవ్ లాక్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turn on Bitlocker ను క్లిక్ చేయండి లేదా start>controlpanel>system and security>Bitlocker drive encryption ద్వారా కూడా చేయొచ్చు. ![]() 2.ఆ తరువాత వచ్చిన విండోలో Use a password to unlock the drive ను టిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేశాక next క్లిక్ చేయండి. ![]() 3.నెక్స్ట్ విండోలో save the recovery key to a file ను క్లిక్ చేసి next కొట్టండి.ఫైల్ ను సిస్టం లో ఎక్కడైన సేవ్ చేయండి. ![]() ![]() ![]() 4.ఆ తరువాత విండోలో startencrypting ను క్లిక్ చేయండి.డ్రైవ్ పూర్తిగా encrypt అయ్యాక ఆటోమేటిక్ గా మీ డ్రైవ్ లాక్ చేయబడుతుంది. ![]() ![]() ఎప్పుడైనా డ్రైవ్ ను ఓపెన్ చేయాలంటే మొదట మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ ఫీచర్ ను మీరు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కు మాత్రమే కాకుండా USB storage drives కు కూడా ఉపయోగించొచ్చు. *ఈ ఫీచర్ ను డిసేబుల్ చేయండం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం! 1.start>controlpanel>system and security>Bitlocker drive encryption లోకి వెళ్ళి ఈ క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turnoff bitlocker ను క్లిక్ చేయండి. ![]() ![]() ![]() ![]() 2.ఆ తరువాత వచ్చిన విండొలో Decrypt drive ను క్లిక్ చేయండి. ![]() ![]() ![]() 3.Decrypting పూర్తయ్యాక మీ డ్రైవ్ unlock అవుతుంది. |
|||||||||||||||||||||||||||
|
14-01-2011, 09:42 PM
Post: #2
|
|||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||
|
విండోస్ 7 లో అంతర్గతంగా ఉన్న Bitlocker ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో చాలా వివరంగా ఉపయోగకరమైన పోస్టు చేశారు. ధన్యవాదములు. ![]() |
|||||||||||||||||||||||||||
|
« Next Oldest | Next Newest »
|
Possibly Related Threads...

![[Image: 69526887.jpg]](http://img826.imageshack.us/img826/106/69526887.jpg)
![[Image: 79027138.jpg]](http://img715.imageshack.us/img715/5779/79027138.jpg)
![[Image: 35029836.jpg]](http://img412.imageshack.us/img412/3116/35029836.jpg)
![[Image: 11187086.jpg]](http://img143.imageshack.us/img143/1120/11187086.jpg)
![[Image: 74905201.jpg]](http://img822.imageshack.us/img822/7676/74905201.jpg)
![[Image: 56271847.jpg]](http://img189.imageshack.us/img189/804/56271847.jpg)
![[Image: 59653881.jpg]](http://img696.imageshack.us/img696/6840/59653881.jpg)
![[Image: 24318887.jpg]](http://img338.imageshack.us/img338/8781/24318887.jpg)
![[Image: 63257921.jpg]](http://img198.imageshack.us/img198/7167/63257921.jpg)
![[Image: 80127985.jpg]](http://img836.imageshack.us/img836/7378/80127985.jpg)
![[Image: 73288789.jpg]](http://img833.imageshack.us/img833/6098/73288789.jpg)
![[Image: 24958234.jpg]](http://img249.imageshack.us/img249/3943/24958234.jpg)
![[Image: 97504092.jpg]](http://img109.imageshack.us/img109/7656/97504092.jpg)
![[Image: 75026312.jpg]](http://img441.imageshack.us/img441/6111/75026312.jpg)


![[Image: mahi_sig.jpg]](http://www.mahigrafix.com/images/mahi_sig.jpg)



