Post: #1
పూర్వం శ్రీశైల శిఖరాన ఉన్న కోనేటి దగ్గర ఒక శివ భక్తుడుండేవాడు. అతను ప్రతీ రోజు పూలతో శివునికి పూజ చేయనిది పచ్చి మంచినీళ్లైనా ముట్టేవాడు కాదు. అంతే కాకుండా శివుని గుడి ప్రక్కే ఉన్న మరో రెండు చిన్న దేవాలయాలలో ఉన్న విగ్రహాలకు కూడా పూలు సమర్పించి మొక్కుకునేవాడు. అలా అతను ప్రతీ రోజు పూజకోసం అక్కడ ఉన్న పూల వనంలోపూలనన్నింటినీ కోసేశాడు. ఆ రోజు పూలకోసం వనంలో కి వస్తే కొన్ని పూలే కనిపించాయి. అవి శివునికి, ప్రక్కనే ఉన్న దేవాలయాలకు పూజకోసం ఉపయోగించాలి. కానీ ప్రతీ రోజు ఒక్కొక్క దేవాలయంలో సరిసమానంగా ఒక లెక్క ప్రకారం పూలను ఉంచేవాడు. ఈ రోజు లెక్క సరిపోయేటట్లు లేదు. వెంటనే అతనికి ఒక ఐడియా వచ్చింది. అక్కడే ప్రక్కన ఉన్న కోనేటి లో ఒక పువ్వువేస్తే రెండుపూలు రావటం గుర్తుకు వచ్చింది. వెంటనే పూలవనంలో ఉన్న కొద్ది పూలను కోసి కోనేటి దగ్గరికి వెళ్లి ఆ పూలను అందులో వేశాడు రెట్టింపు అయ్యాయి. వెంటనే శివుని దగ్గరకు వచ్చి రోజు లెక్క ప్రకారం కొన్ని పూలను శివపూజకుపయోగించాడు. మిగిలిన పూలకేసి చూశాడు. అవి రెండవ దేవాలయానికి సరిపోవు. మళ్లీ వచ్చి మిగిలన పూలను కోనేటిలో వేసి రెట్టింపు చేశాడు. వాటిని తీస్కొచ్చి రెండవ దేవాలయంలో లెక్క ప్రకారం పూజకుపయోగించాడు. కానీ ఈ సారి కూడా మిగిలిన పూలు మూడవ దేవాలయానికి సరిపోవు. మళ్లీ వచ్చి మిగిలన పూలను కోనేటిలో వేసి రెట్టింపు చేశాడు. ఈ సారి ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. చివరగా తన దగ్గర ఉన్న పూలు మూడవ దేవాలయానికి కరెక్ట్ గా సరిపోయాయి. ఒక్క పూవు కూడా మిగలలేదు. తగ్గలేదు. మరి ఈ లెక్కేంటో మీరు తేల్చగలరా? సింపుల్ గా చెప్పాలంటే మూడు దేవాలయాలకు పూలను సమానంగా పంచాలి. కానీ ఉన్న పూలను కోనేటి ద్వారా 3 సార్లు రెట్టింపు చేసి పంచాలి. కానీ చివరి దేవాలయంలో పూజ అయిపోగానే ఒక్కటి కూడా మిగలకూడదు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మహీ గారు,

పూజారి 7 పూలు కోసాడు.మొదటిసారి కోనేట్లో ముంచగా 14 అయ్యాయి,మొదటి గుడిలో 8 పూలు పెట్టాడు.6 మిగిలాయి.రెండవసారి కోనేట్లో ముంచగా 12 అయ్యాయి.రెండవ గుడిలో 8 పూలు పెట్టాడు.4 పూలు మిగిలాయి.మూడవసారి కోనేట్లో ముంచగా 8 అయ్యాయి.మూడవ గుడిలో 8 పూలు పెట్టాడు.దీంతో పూజారి దగ్గర పూలన్నీ అయిపోయాయి.మూడు గుళ్ళో సమానంగా పంచాడు.నా answer కరక్టేనా?

థాంక్యూ..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)