Post: #1
జీవితంలో విసిగి వేసారిపోయి
అన్నింటిలో ఓడిపోయి
డబ్బు సంపాదించలేక
గుడ్డి తల్లి బాధను చూడలేక
ఆత్మహత్య చేస్కోబోయి
ధైర్యం రాక
భయం వేసి
వెంటనే శంకర్ దాదా ప్రత్యక్షమై
"నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు లేదు"
అని మాయమైతే
అప్పుడెప్పుడో దొరికితే జేబులో పెట్టుకున్న
చిన్న అద్దాన్ని జేబులోనుంచి తీసి
తన ముఖం కేసి తనే జాలితో చూస్తుంటే
తనెప్పుడో చూసిన పాత సినిమాలో
వరం కోసం వంద సంవత్సరాలు తపస్సు చేసిన
సాధువు ఫేస్ లా
గడ్డం పెరిగి, జుట్టు పెరిగి
"ఓహ్!"
వెంటనే మన సుబ్బారావు మదిలో
తళుక్కుమని మెరుపులాంటి ఆలోచన
"ఈ హా హ్హ! నేను కూడా తపస్సు చేసి, వరాలు పొంది నా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్కుంటా"
రైల్వేస్టేషన్ దగ్గర ఒక గుడిసె ముందు బకెట్ లో ఉన్న ఒక ఇత్తడి చెంబును
దొంగతనం చేసి,
పరుగెట్టీ, పరుగెట్టీ
ఓ పేద్ద కొండ మీద కు వెళ్లి
ఒక చెట్టుకొమ్మను విరిసి
హ్యాండ్ లూమ్ కమండలం ఒకటి తయారు చేస్కొని
ఇత్తడి చెంబుతో, కమండలంతో
కుడుతున్న దోమలను తిడుతూ
ఇంట్రెస్ట్ గా తపస్సు చేయడం మొదలెట్టాడు..
దోమలు కుట్టీ కుట్టీ
ముక్కు మిచ్చర్ పొట్లంలా (కేసీఆర్ ముక్కులా) మారిపోయిన తర్వాత
దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
ఆల్రెడీ ప్రిపేర్డ్ సుబ్బారావ్ ఒక్క లైన్ లో తన కోరికలు చెప్పేశాడు
"తళ్లికి కళ్లు రావాలి, పెళ్లాం పిల్లలు కావాలి, బాగా డబ్బుకావాలి."
"నాయనా! సుబ్బారావ్!మామూలుగా అయితే నీ మూడు కోర్కెలు తీర్చేవాడ్నే. కానీ తపస్సు కోసం సొంత డబ్బునుపయోగించకుండా, ఇత్తడి చెంబు దొంగతనం చేసినందకుగాను, ఒక్క కోరికనైతే తీర్చగలను..కావాలంటే మిగిలన కోరికలకు, ఒక్కో కోరికకు మళ్లీ ఒక్కోసారి తపస్సు చేయాల్సి ఉంటుంది. ఏమంటావ్"
మిగిలిన కోర్కెలకు మళ్లీ తపస్సు చేయాలా? అని మిచ్చర్ పొట్లం లాంటి తన ముక్కు కేసి చూస్కుంటూ, భయం వేసి
"దేవుడా! నాకు ఒక్క కోరిక చాలు. నాక్కొంచెం టైం ఇవ్వండి" అని అడిగాడు
"ఓకే సుబ్బారావ్! నాక్కుడా పని ఉంది చూస్కొనొస్తాను..ఒక గంటలోపు నిర్ణయించుకో"
"అలాగే దేవుడా"
వెంటనే సుబ్బారావ్ రకరకాలు గా ఆలోచించాడు.
ఎలాగైనా సరే ఈ ఒక్క కోరికలోనే, తల్లికళ్లు-భార్య,పిల్లలు-ధనం వచ్చేయాలని.
వెంటనే అతను ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లి తను చూసిన పాత దేవుళ్ల సినిమాలన్ని గిర గిరా కళ్ల ముందు తిప్పాడు.
అతను అనుకున్న మూడూ కలిపే కోరిక ఒక సినిమాలో దొరికింది.
ఆనందంతో పొంగిపోయిన సుబ్బారావ్ సినిమాలు ఇలా కూడా ఉపయోగపడతాయా? అని ఆలోచించుకుంటూ
దేవుడు రాగానే, ఒక్క కోరికతో మూడు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్కున్నాడు.
ఇంతకీ ఆ కోరిక ఏంటా అని ఆలోచిస్తున్నారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా...
మీరు చెప్తే నేను వింటాను. ఆలోచించండి మరి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
సుబ్బిగాడి పెళ్ళి ఇంకేదో ఐనట్లు..

మిచ్చర్ పొట్లం సుబ్రావ్ బహుషా
పెళ్ళాం పిల్లలు అమ్మతో కల్సి బెంజి కార్లో సంవత్సరానికి పదిసార్లు చొప్పున
కొండకొచ్చి దేవుడిని కళ్ళార ధర్శించుకునేలా వరమియమనుంటాడు.

మరి సుబ్బిగాడ మజాకా ??ఏమో ఇది కాక పోవచ్చు కూడా .

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Yes.... u r right Mr. Dubai Srinu.
Quote this message in a replyReply

Post: #4
ఇంకొంచెం డీప్ గా ఆలోచించండి శ్రీను రాగి గారు

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
ఒక్క ఇత్తడీ చెంబును దొంగిలించినందుకు గాను ఒక్క కోరిక తీరుస్తానన్నాడుకదా దేవుడు.
ఇచ్చిన 1 గంటలో మళ్ళీ వెనక్కి రైల్వే స్టేషన్ వెళ్ళి ఇంకో రెండు దొంగిలించుకొచ్చాడా అని నా అనుమానం కాని ఒకే కోరిక కదా అడగాల్సింది. ( ఇది నాకు తట్టిన రెండొ ఆలోచన సుమి )


ఇంకో ఆప్షన్ నాకు కనబడుతుంది అదేంటంటే...
నేనేది కోరుకుంటె అది జరిగేలా వరమివ్వమని అడిగుంటాడూ మన సుబ్రావ్ ..అప్పుడు తల్లి కళ్ళు-పెళ్ళాం-పిల్లలూ-డబ్బు అన్ని కోరుకోవచ్చు కదా.


బాబ్బాబు కొంచం ఆ సుబ్రావ్ అడ్రస్ చెప్పండి
Shy

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)