Post: #1
Dear Friends...


[Image: 11j905k.jpg]

మిత్రులందరికీ నమస్కారం.

ఏదైనా విజయానికి కారణభూతమయ్యేవి చాలా కారణాలు ఉంటాయి. కష్టేఫలి. శ్రమయేవ జయతే. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు....మహా పురుషులౌతారు అనేవి విశ్వజనీన సార్వత్రిక మూల సూత్రాలు.
చెప్పొచ్చేమిటంటే....ఈ ఫోరం మీది. (ఖచ్చితంగా చెపుతున్నాం ఇది మన మహీ గారిది అనుకుంటున్నారా...కాదు. కాదు. మీది. ఇందులో అణువంతైనా సందేహం లేదు.)

అహోరాత్రాలు శ్రమించి ఈ ఫోరం రూపు రేఖలకు, కంటెంట్ రిఫరెన్స్ కు పాటుపడుతున్న గౌరవనీయులైన సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.


[Image: 30axumf.jpg]మీ అందరి సహాయ సహకారాల వలన విత్తుగా ఉండి మొలకెత్తుతున్న ఈ పరిణామ దశలో మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే....

చాలా మంది సభ్యులు తమ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ ఇస్తూ...మంచిగా తీర్చిదిద్దటానికి దోహదపడుతున్నారు. అయితే మెజారిటీ దృష్ట్యా....ఇంకా చాలా మంది స్తభ్దుగా ఉండిపోతున్నారు. ఈ నిశ్శబ్ధాన్ని ఛేదిద్దాం....మనందరం ఐకమత్యంగా సాంకేతిక ప్రగతి వైపు ప్రయాణం చేద్దాం. మన సుదూర తీరాల గమ్యాన్ని చేరుకునేందుకు ప్రయాణిద్దాం. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగు తోనే ప్రారంభం కాబట్టి.... అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకొని అనుమానంతో సంశయిస్తూ ఉండే కంటే...ముందుగా ఒకడుగు వేద్దాం...అదే గమ్యాన్ని చేరుస్తుంది.


ఫోరం కేవలం ఒక వ్యక్తిది అనుకుంటున్నారా...? కాదు. ఇది మనందరిది. సమిష్టిగతంగా పాటుపడదాం. అందులోనూ మల్టీమీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో ముందుకు వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి ఏర్పడిన ఫోరం అంటే సామూహిక వేదిక లాంటిది. ఇందులో సభ్యులు తమ తమ పరిధిలో విజ్ఞానాన్ని అందించే విలువైన సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి ఇచ్చట పోస్ట్ రూపంలో పొందు పరచవచ్చు. అందుకు మీరు ముందుకు కదలి రండి. ఉప్పెనలా...గోదావరి చిరుగాలి అలలా...


[Image: 2qkszth.jpg]శ్రీశైల పర్వత సానువుల్లో ఉద్భవించి యావత్ప్రపంచాన్ని ఉర్రూతలూగించటానికి ఉద్భవించిన ఒకానొక విజ్ఞాన వీచిక....ఈ మహి గ్రాఫిక్స్ ఫోరం.

ఇందులో నిరంతరం సమాచార విస్తరణ, సేకరణ, క్రోడీకరణ అనే ప్రక్రియలు అందరి కోసం జరుగుతూంటూంది. ఇది కేవలం ఏ ఒక్కరికోసమో కాదు. ఇది మనందరిది. ఖచ్చితంగా చెప్పాలంటే...మీది.

మీకున్న అనుభవ సారాన్ని రంగరించి....మీకు తెలిసిన విజ్ఞాన విషయాలను అందరికీ తెలియజేయాలంటే చక్కని వేదిక ఈ మహి గ్రాఫిక్స్ ఫోరం.

ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పాటుపడుతున్న వేదిక ఇది. నిఝం చెప్పవలెనంటే... ఉదాహరణకు ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో పుట్టాడనుకుందాం. షుమారుగా ఆయుర్ధాయం 100 సంవత్సరాలు అనుకుందాం. అయితే ఒక్క లాజిక్ ఆలోచించండి. అతను 1999 సంవత్సరం...ఆ సంవత్సరంలో జరిగిన వింతలు, విశేషాలు చూడలేడు. అలాగే 2100 వ సంవత్సరం తరువాత జరగబోయే సంఘటనలను చూడలేడు. వినలేడు. ఎందుకని....2000 వ సంవత్సరం ముందు అతను పుట్టలేదు కనుక. 2100 సంవత్సరం తరువాత తను బ్రతికి ఉండడు గనుక.

అయితే ఒక్కటి చెప్పండి మాకు....? ఏమిటంటే...అతను 2000 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు బ్రతికే 100 సంవత్సరాలలో అతను ఏం చేయగలడు. ఒక 25 సంవత్సరాలు విద్యాభ్యాసం...తదుపరి గృహస్థాశ్రమ ధర్మంగా వివాహం....తరువాత కేర్ కేర్ మంటూ పిల్లలు, తదుపరి ఉద్యోగ నిర్వహణ...సంపాదన...ప్రమోషన్...ఆర్జనాపరమైన ఆలోచనలు...కుటుంబ నిర్వహణ ఇతరత్రా ఇలా...తదుపరి నడి వయసు దాటిన తరువాత ఏమిటి...వచ్చేది వార్థక్యమే కదా...వార్ధక్యంలో ఎదురయ్యే ఇబ్బందులు...సమస్యలు..సమస్యల వలయాలు నుంచి తప్పుకునే క్రమంలో సమస్యలతో పోరాటం చేస్తూ....కాలం గడపటం...(సాధారణంగా మానవ జీవితపరిణామ క్రమంలో ఎదురయ్యే విధానాన్ని క్లుప్త రూపంలో తెలియజేయటం జరిగిందని గౌరవ సభ్యులు గ్రహించాలని కోరుకుంటున్నాం) చివరికి మిగిలేది మహా ప్రస్థానం.

ఈ అనంత కాల పరిణామ చక్రంలో ఏదో పుట్టాం...ఎదిగాం...గిట్టాం...అనే సిద్ధాంతం తప్పేనా...ఒప్పేనా అని అంత: పరిశీలన చేసేముందు కొంచెం...వివరాలలోకి వెళ్దాం.

మనం సంఘం కోసం ఏం చేశాం. మనమేదో సంఘ సంస్కర్తలం కాదు. మన జీవితాన్నే ఉద్ధరించుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు , ఆపసోపాలు పడుతున్నాం. కనుక అందరూ ఒకే విధమైన జీవితాన్ని గడుపుతున్నారు అని అనుకోకండి. కానీ మనదంటూ ఒక ముద్ర, ఒక లైఫ్ స్టైల్, ఒక చెరగని జీవిత ముద్ర ఉండాలి కదా. కీర్తి ప్రతిష్టలు ఊరకనే రావు కదా. శ్రమించి సాగితేనే కదా. ఇంకొక్క విషయం....ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అనేది చాలా అరుదైన లక్షణం. ఈ లక్షణం అందరికీ అలవడాలనేది మా సమిష్టిగత అభిప్రాయం.

మన వయస్సు పెరిగిన కొద్దీ మానవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా...ఆహా నేను ఎదుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ రోజు గడిచేకొద్దీ...తరుగుతున్నది ఆయుష్షు అని గ్రహించలేకపోతున్నాడు. అయితే....

తరిగే వయస్సుతో పెరిగేది విజ్ఞానం

రోజు రోజుకూ పెరిగే విజ్ఞానాన్ని అందరితో పంచుకుని అందరికీ కాకపోయినా కొందరికైనా మార్గదర్శకత్వం వహించి దారి చూపించటం...కూడా మంచి వ్యక్తుల లక్షణం.

కొందరిలో విజ్ఞాన సేకరణ, లేదా వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటివారు సమాజ హితాన్ని కోరి చాలా విధాలుగా వ్యక్తం చేస్తుంటారు. తోటి వారికి సహాయపడుతూ ఉంటారు. అయితే అందరూ ఒక్కలా ఉండలేరు కాబట్టి. వారి వారి పరిధిలో తోచిన సాంకేతిక విజ్ఞానాన్ని, సాంకేతిక వీచికలను యధేచ్చగా వీచనివ్వండి.
రండి ఎలాంటి అరమరికలు లేకుండా భాగస్వాములు కండి. సందేహం ఎందుకు...? ఇందులో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా ఇబ్బందుల పాల్జేస్తున్న సమస్యల నుండి తగిన పరిష్కారం,...పరిష్కార మార్గాలు దొరుకుతాయి. సందేహించవలసిన పని లేదు.
స్వార్థంతో నిండిపోయిన నేటి ప్రపంచంలో కొంత మంది యువకులు ముందు తరం దూతలు. జీవన నవజీవన బృందావన నిర్ణేతలు. సాంకేతిక ప్రగతి రహదారులు నిర్మించే నిరంతర శ్రామికులు. సాంకేతిక ప్రగతి పథం వైపు పయనించటానిక వీలైన సౌకర్యాలు సమకూర్చే సారధులు...మిత్రులు ఉన్నారు. వారు సంఘానికి ఏదో కొంత సేవ చేయాలని పూనుకున్నప్పుడు మన వంతుగా మనం ఏం చేయాలి...? మనమేం జేయాలి....????
ఇందుకోసం బుర్ర బ్రద్ధలు కొట్టుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం బుర్రకు పదును పెట్టి....అందులో నిక్షిప్తమై ఉన్న సమాచార గనిని, ఖనిని త్రవ్వి వెలికి తీసి, మీ నిర్వహణా సామర్థ్యంతో పదిమందితో పంచుకోండి. అనుబంధాలను పెంచుకోండి.
మీకంటూ ఒక అనుబంధ బాంధవ్యాలు ఎలా ఏర్పడతాయి. పుట్టుక రీత్యా అమ్మ, నాన్న, అక్క , అన్న, చెల్లి, తమ్ముడు, బంధుగణం.....జనం.
అయితే మిత్రులు.....?????
ప్రపంచం మొత్తం నిన్ను వీడిపోతున్న దశలోగానీ, నిన్నువీడిపోయిన దశలో గానీ నీకంటూ అండగా నిలబడినవాడే నిజమైన మిత్రుడు.
రక్తసంబంధీకులం కాము. కానీ సాంకేతిక ప్రగతి కాముకులం. స్వార్థరహితంగా, సేవార్థం సేవాలభ్యతతో మనకున్న విజ్ఞానాన్ని అందరితో పంచుకోవాలనే అభిలాష కలిగిన వ్యక్తుల సమూహం మనం. సంఘజీవులం. ఏదో కొంత సమాజానికి చేద్దాం.


[Image: 20ued6p.jpg]


మహా నిర్వాణం అనంతరం మనకు లభించేది మన కీర్తి కాంతలు ఏమిటో తెలుసా....మనం చేసిన మంచి పనులు.
అయితే విజ్ఞాన వీచికలను ప్రసరింపజేయటం అంత తేలికైన పని కాదు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. లేదా ప్రయత్నిస్తున్నప్పుడు సమస్యలు ఎదురవ్వవచ్చు. అయితే ఎవరికైతే తగిన విధంగా పోస్ట్ లు చేయటం కుదరని వారు ముందు తప్పో ఒప్పో యధ్యేచ్ఛగా పోస్ట్ లు చేయండి. అయితే ఒక్క షరతు. అది అంరికీ ఆమోద యోగ్యంగా ఉండే.....బహుళ ప్రయోజనార్థం...విశ్వ...సార్వజనీన హితార్థం ఉండేది అయి ఉంటే. స్వాగతం. లేనియెడల తొలగించబడును. (తొలగించబడటం అనేది ఉండదు కానీ సరైన రీతిలో వ్యక్తపరచని వ్యక్తులకు మొదట తెలియజేయటం జరుగుతుంది. అప్పటికీ వినని యెడల రెండు మూడు సార్లు చూసి తదుపరి బోర్డు సభ్యుల అనుమతితో తొలగించటం జరుగుతుంది.) ఈ విషయం కేవలం అవగాహన కోసం తెలియజేయటం జరిగిందే తప్ప....ఎవ్వరినీ బహిష్కరించటం..వారి వారి రాకను ఆటంకపర్చటం...అడ్ఢు తగలటం వంటి చేష్టలు నిషేధించడమైనది.
ఏదేమైనా ఒక స్థాయిలో మనకు మనం రక్షణ కవచాలను ఏర్పరచుకొని ఉండటం తప్పని సరేమో అనిపిస్తుంటుంది (ప్రస్తుత కాలంలో...సాధారణ విషయాన్ని జాతీయంగా తెలియజేయటం జరిగింది. అన్యధా భావించొద్దని సభ్యులకు మనవి.)
ఊరకనే ఊకదంపుడు ఉపన్యాస ధోరణితో...అనవసరపు, వ్యర్థ ప్రసంగాలతో...కుహనా రాజకీయ విశ్లేషణలతో....కాలం పొద్దు పుచ్చేకంటే....మంచి మంచి సాంకేతిక విషయాలను గూర్చి చర్చించటం చాలా ఉత్తమమైన పని అని మెజారిటీ వ్యక్తుల అభిప్రాయం. నిజమే కదా.
దయచేసి ఈ సాంకేతిక యజ్ఞంలో భాగస్వాములు కండి.
మీ అందరికీ స్వాగతం....సుస్వాగతం.
Quote this message in a replyReply

Post: #2
యస్వీగారితో నేను ఏకీభవిస్తున్నాను!!

ఈ యఘ్ణం లో అందరు భాగాస్వాములమవుదాం ఒక మంచిని మన తరువాతి తరాలకు పంచుదాం .

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
ఇది చదవడానికి నాకు పట్టిన సమయం కేవలం పది నిముషాలు. కాని ఇక్కడ సుమని వెంకట్ గారు తన మనసులోని మాటలని కీ బోర్డు పెట్టడానికి చాలా సమయం కేటాయించి ఉంటారు. మనం ఖచ్చితంగా చదివి అర్ధం చేసుకుని నలుగురితో చదివించి మన ఫోరంలో మరికొందరిని చేర్పించి వారి వారి సాహిత్య, సాంకేతిక Etc.... సేవలు మరియు సలహాలు పొందడానికి ప్రయత్నిద్దాం. నాకు ఇంత కంటే ఎక్కువగా కీ బోర్డు పై పెట్టడానికి రావడం లేదు. ఎవైనా తప్పులు ఉంటే క్షమించండి.
Quote this message in a replyReply

Post: #4
yes yes its correct,
i will walk accordingly.
urs,
R
A
M
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)