Post: #1
[Image: 2hmfolk.jpg]

జీమెయిల్ లో అన్నీ మెయిల్స్ డైరెక్ట్ గా Inbox లోకి వెళ్లకుండా, మనము సొంతంగా క్రియేట్ చేస్కున్న లేబుల్స్ (ఫోల్డర్స్) లోకి ఆటోమేటిక్ గా వెళ్లేటట్లుగా సెట్టింగ్స్ ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. ఉదా:కు మనకు ఆర్కట్ నుండి వచ్చే మెసేజ్ లన్నీ ఆర్కట్ మెసేజెస్ అనే లేబుల్ లోకి ఆటోమేటిక్ గా వెళ్లడం. ఇలాంటి సెట్టింగ్స్ చేయడం వలన భవిష్యత్తులో మీకు కావలసిన మెయిల్ ను సులభంగా పొందగలరు. ఇలా కేటగిరీ వైజ్ గా లేబుల్స్ ను క్రియేట్ చేస్కొని వచ్చిన మెయిల్స్ వాటి వివరాలను బట్టి ఆయా లేబుల్స్ లోకి ఆటోమేటిక్ గా చేరడానికి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.




[Image: 1z6xu74.jpg]
1). మొదట Inbox లోకి వచ్చిన మెయిల్ ను ఓపెన్ చేసి show details ను క్లిక్ చేసి ఆ మెయిల్ యొక్క వివరాలను గమనించండి. అలాంటి అన్నీ మెయిల్స్ కు ఏ పేరుతో లేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి.




[Image: 29kpa3p.jpg]
2).ఇక్కడ చూపిన విధంగా Create New Label ను క్లిక్ చేయండి.



[Image: rhu7vt.jpg]
3).మీరు క్రియేట్ చేయాలనుకున్న లేబుల్ నేమ్ ను టైప్ చేసి ఓకే బటన్ ను ప్రెస్ చేయండి. నేను ఇక్కడ telugupeople అనే లేబుల్ క్రియేట్ చేశాను.




[Image: x29zyd.jpg]
4).మీరు క్రియేట్ చేసిన లేబుల్ లేబుల్స్ లిస్టులో ఇలా కనపడుతుంది.




[Image: 5fn3gk.jpg]
5).ఇపుడు Inbox ను క్లిక్ చేసి, ఏ మెయిల్ కు మీరు ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ను ఓపెన్ చేయండి. తర్వాత ప్రక్కన చూపిన విధంగా Filter messages like these ను క్లిక్ చేయండి.



[Image: 295rfxv.jpg]
6).Next Step బటన్ ను క్లిక్ చేయండి.

.
[Image: npm4qo.jpg]
7).ప్రక్కన చూపిన విధంగా సెట్టింగ్స్ చేసి Create Filter బటన్ ను క్లిక్ చేయండి. ఇక నుంచీ మీకు వచ్చే మెయిల్స్ లో ఇపుడు ఫిల్టర్ అప్లై చేసిన అడ్రస్ నుండి వచ్చే ప్రతి మెయిల్, ఇపుడు క్రియేట్ చేయబడిన లేబుల్ లోకి ఆటోమేటిక్ గా చేరుతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good Info.
Memu....same ilage chestunnamu....
manaku vacche files nirvahana paramga....chala sulabham gaa vuntundi....
Okka sari ee paddathi ki alavatu padithe....marala settings meeru maarcha leru.
Idi maa personal opinion.

Thank you very much mahi (admin) garu...so kind of you....nice tip for all.
Quote this message in a replyReply

Post: #3
మహిగారు,

మీ పోస్టులొ క్రోత్త్ దనం ఉంటుంది
Quote this message in a replyReply

Post: #4
Thank q very much for nice info
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)