Post: #1
విండోస్ xp స్టార్టప్ లో వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలను సాల్వ్ చేయడం ఎలా?
తరచుగా వచ్చే ఫైల్ మిస్సింగ్ సమస్యలు:

1. Windows could not start because the following file is missing or corrupt:
\system32\config\system
-------------------------------------------------------------------------------------------------
2. Windows could not start because the following file is missing or corrupt:
\system32\ntoskrnl.exe
Please re-install a copy of the above file.
-------------------------------------------------------------------------------------------------
3. Windows could not start because the following file is missing or corrupt:
\system32\HAL.dll
--------------------------------------------------------------------------------------------------
4. NTLDR is Missing
Press any - to restart
---------------------------------


పై 4 ప్రాబ్లమ్స్ లో మీ కంప్యూటర్లో ఏ ప్రాబ్లం వచ్చినా విండోస్ రికవరీ కన్సోల్ ద్వారా క్రింది కమాండ్స్ ను ఉపయోగించి సులభంగా xp ని రికవర్ చేయవచ్చు.

విండోస్ రికవరీ కోసం ఉపయోగించే కమాండ్స్:

1. cd ..
2. attrib -h c:\boot.ini
3. attrib -s c:\boot.ini
4. attrib -r c:\boot.ini
5. del boot.ini
6. bootcfg /rebuild
7. chkdsk /r /f
8. fixboot



పై కమాండ్స్ లో bootcfg /rebuild అనే కమాండ్ కంప్లీట్ డయాగ్నస్టిక్ టూల్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కమాండ్ ద్వారా విండోస్ స్టార్టప్ లో మనల్ని విసిగించే మిస్/కరప్టడ్ సిస్టమ్ ఫైల్స్ ను రిమూవ్/రిప్లేస్/రిపేర్ చేయవచ్చు.

విండోస్ రికవరీ కన్సోల్ ద్వారా మిస్డ్ మరియు కరప్టడ్ సిస్టం ఫైల్స్ ను రికవర్ చేయడం స్టెప్ వైజ్ గా:


1. సీడీ డ్రైవ్లో విండోస్ xp (బూటబుల్) సీడీని ఇన్ సెర్ట్ చేసి, బయాస్ లో 1st bootable device గా cd-rom ను సెట్ చేసి సేవ్ చేసి రీస్టార్ట్ చేయండి.


2. సీడీ నుండి బూట్ అయి స్క్రీన్ మీద ఈ క్రింది విధంగా మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాత 2వ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్ లో R ను ప్రెస్ చేయండి.

[Image: 01qf0.gif]

3.ఈ క్రింది స్క్రీన్ ను ఫాలో అవుతూ మొదట 1 ని నొక్కండి. తర్వాత మీ కంప్యూటర్ పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ లేకపోతే డైరెక్ట్ గా ఎంటర్ ను ప్రెస్ చేయండి.

[Image: 02dr2.gif]

4.c:\windows నుండి c:\ డ్రైవ్ లోకి రావడానికి cd .. కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి

[Image: 03oj8.gif]

5.ఈ క్రింది స్క్రీన్ లో వలె C:>ATTRIB -H C:BOOT.INI AND ENTER C:>ATTRIB -R C:BOOT.INI AND ENTER C:>ATTRIB -S C:BOOT.INI AND ENTER కమాండ్స్ ఉపయోగించండి.

[Image: 04nb7.gif]


6. ఇపుడు మనము BOOT.INI ఫైల్ యొక్క సులభంగా ఎడిట్ చేయవచ్చు. ఈ క్రింది స్క్రీన్ లో వలె c:\>del boot.ini కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి

[Image: 05hu3.gif]

7.ఈ క్రింది స్క్రీన్ లో వలె bootcfg /rebuild కమాండ్ ను టైప్ చేసి enter ను ప్రెస్ చేయండి తర్వాత y and enter తర్వాత windows xp professional edition తర్వాత /fastdetect /noexecute=option లను వరుసగా ఎంటర్ చేయండి.

[Image: 06yw6.gif]

8.ఫైనల్ గా CHKDSK /R ను C:\>వద్ద టైప్ చేసి ఎంటర్ చేయండి. చెక్ డిస్క్ ప్రాసెస్ దాదాపు 30 నిముషాల దాకా అవుతుంది అంతవరకు వైయిట్ చేసి EXIT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు సిస్టమ్ రీస్టార్ట్ అయి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ ఓపెన్ అవుతుంది.
Reply With Quote

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)