Post: #1
UltraISO ను ఉపయోగించి సాఫ్ట్ వేర్ ఇమేజ్ లు తయారుచేసుకుని సిడి లేకుండా ఇన్స్టాల్ చేయడమెలా?

మనం సాధారణంగా యాంటి వైరస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి సాఫ్ట్ వేర్ లను వాటి సిడి లు ఇన్సర్ట్ చేసి ఉపయోగిస్తుంటాము. అలాంటి అనేక సాఫ్ట్ వేర్ సిడి లను విండోస్ సిడి/డివిడి తో పాటుగా తీసుకువెళ్ళి ఎవరి కంప్యూటర్ లోనైనా ఇన్స్టాల్ చేస్తుంటాము. ఈ రోజుల్లో మనకు మిని డివిడి (1.4జిబి సామర్ధ్యం కలవి) లు లభిస్తున్నాయి. వీటిలో UltraISO, 7-zip, WinRAR వంటి ప్రాధమికంగా అవసరమయ్యే సాఫ్ట్ వేర్ లతొ విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి ని Slipstream చేసుకుని అట్టిపెట్టుకోవచ్చు. ఇకపోతే మిగిలిన సాఫ్ట్ వేర్ లు అన్నీ బూటబుల్ అవసరం లేదు కాబట్టి ఈ రోజుల్లో అత్యంత కెపాసిటి కలిగిన పెన్ డ్రైవ్ లు లేదా SDHC కార్డ్ లు దొరుకుతున్నాయి. వీటిలొ 16జిబి సామర్ధ్యం కలిగిన ఉత్పత్తిని కొనుక్కుని దానిలొ వీలైనన్ని సాఫ్ట్ వేర్ లు ఇమేజ్ ల రూపంలో ఉంచుకుని ఎంచక్కా రెండూ (మిని డివిడి మరియు 16జిబి సామర్ధ్యం కలిగిన పెన్ డ్రైవ్ లేదా SDHC కార్డ్ ) జేబులో వేసుకుని వెళ్ళి దాదాపు గా ఎలాంటి అవసరాలున్న యూజర్ సిస్టం నైనా పూర్తి స్థాయిలో ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ క్రమంలో మనం అత్యంత సమర్ధవంతమైన UltraISO సాఫ్ట్ వేర్ ద్వారా ఒక సిడి ఇమేజ్ ను ఎలా తయారుచేసుకోవాలి, తదుపరి ఆ ఇమేజ్ ని ఉపయోగించి ఆ సాఫ్ట్ వేర్ ని ఎలా వినియోగించాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. UltraISO లో మరిన్ని సమర్ధవంతమైన ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఈ పోస్ట్ లో వివరించటం లేదు.

ముందుగా మనం You are not allowed to view links. Register or Login to view. ను ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇమేజ్ గా చేయాలనుకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచాలి. ఇపుడు UltraISO ను రన్ చేయాలి.

[Image: 1-6.jpg]

మెయిన్ విండోలోని Tools మెనూలొ Make CD/DVD Image ను ఎంచుకోవాలి. క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా ఆప్షన్స్ ను ఎంచుకోవాలి. దానిలొ మన సిడి లేదా డివిడి డ్రైవ్ లొ మనం ఎంచుకున్న సిడి లేదా డివిడి కనపడుతుంది. ఈ ఉదాహరణ లో నేను నా సిస్టం మదర్ బోర్డ్ (Intel DG45ID) యొక్క డివిడి ని ఇమేజ్ గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆప్షన్స్ అన్నీ సరిచూసుకున్న తర్వాత OK బటన్ క్లిక్ చేయాలి. Output FileName అని ఉన్నచోట ఇమేజ్ ని సేవ్ చేయాల్సిన పాత్ ను ఎంచుకోవాలి.

[Image: 2-6.jpg]

అపుడు క్రింది విధంగా జరిగే ప్రాసెస్ యొక్క ప్రోగ్రెస్ ను చూపిస్తుంది. ఆ తర్వాత దానిని ఓపెన్ చేయమంటారా అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది క్రింది విధంగా. దానిలొ Yes కాని No కాని మీ అవసరాన్ని బట్టి క్లిక్ చేయండి.

[Image: 3-3.gif]
[Image: 4-4.jpg]

Yes అనేది క్లిక్ చేసినపుడు ఆ ఇమేజ్ లోని కాంటెంట్స్ క్రింది విధంగా కనపడతాయి. ఇంతటితో మనం ఇమేజ్ ని తయారుచేసుకోవటం పూర్తయిపోయినట్లే.

[Image: 5-3.jpg]

ఆ ఇమేజ్ ని మన పెన్ డ్రైవ్ లేదా SDHC కార్డ్ లొకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు అవసరమైతే. ఇపుడు మనం ఆ ఇమేజ్ లోని సాఫ్ట్ వేర్ ని UltraISO ఉపయోగించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం UltraISO ను రన్ చేయాలి. దానిలొని Tools మెనూలోని Mount to Virtual Drive అనేదానిని ఎంచుకొవాలి. అపుడు వర్చ్యువల్ డ్రైవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిలొ 1. ఇమేజ్ ఫైల్ అని ఉన్నచోట మనం తయారుచేసుకున్న ఇమేజ్ ఫైల్ పాత్ ను ఇవ్వాలి బ్రౌజ్ బటన్ ద్వారా. 2. తర్వాత Mount అనే బటన్ ను క్లిక్ చేయాలి. 3. అపుడు మనకు ఒక Virtual CD/DVD Drive ఏర్పడి దానిలొ డ్రైవ్ లెటర్ మరియు మన ఇమేజ్ ఫైల్ లోడ్ అయినట్లు గా ఇంతకు ముందు Ejected అని ఉన్న చోట Loded అని కనపడుతుంది. దాని తిన్నగా ఉన్న బటన్ Autoplay కు సంబంధించినది. దానిని క్లిక్ చేయగానే మన ఇమేజ్ ఆటొప్లే అవుతుంది. ఇమేజ్ చేయబడిన ఒరిజినల్ సిడి లేదా డివిడి ఆటొప్లే గా సెట్ చేయబడకపోయినట్లైతే అది ఓపెన్ అవుతుంది.

[Image: 6-2.jpg]

నేను ఆటో ప్లే బటన్ క్లిక్ చేయగానే Intel Installer క్రింది విధంగా ఓపెన్ అయ్యింది చూడండి. ఇక దానిలో ఆప్షన్స్ ను మనం మామూలు సిడి ని ఉపయోగించినపుడు ఎలా చేస్తామో ఇపుడు కూడా అలానే చేయవచ్చు.

ఇలాంటి అనేక వర్చ్యువల్ డ్రైవ్ లను మనం ఏర్పరచుకోవచ్చు. క్రింది ఇమేజ్ చూడండి

[Image: 9-1.gif]

ఈ విధంగా కాక మరో విధంగా కూడా తదుపరి మనం ఈ లోడ్ చేయబడిన ఇమేజ్ ని ఆటోప్లే చేయవచ్చు. అదెలాగంటే My Computer ని ఒపెన్ చేసినట్లైతే మన సిస్టం లో ఉన్న డ్రైవ్ ల తో పాటు ఈ వర్చ్యువల్ డ్రైవ్ కూడా కనపడుతుంది. దానిపై రైట్ క్లిక్ చేస్తే క్రింది విధంగా మెనూ కనపడుతుంది. దానిలొ UltraISO కు పొడిగింపుగా వచ్చిన ఆప్షన్స్ లో మనకు ఆటో ప్లే కనపడుతుంది. దానిని క్లిక్ చేస్తే సరిపోతుంది.

[Image: 8-2.jpg]
Quote this message in a replyReply

Post: #2
^ నమస్కారం మాస్టారూ.....!! మా...స్టారూ....
మీరు చెప్పిన సాంకేతిక విషయాన్ని సదా జ్ఞప్తిలో ఉంచుకుంటాం.
మీకు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. అయినా సరే...
కృతజ్ఞతలు.
Quote this message in a replyReply

Post: #3
Meeru ee screen shots ki ye software vupayogincharo cheptara???
Quote this message in a replyReply

Post: #4
సాయి కృష్ణ గారు
నమస్కారం

బేసికల్ గా నేను ఇందులో ఉపయోగించిన స్క్రీన్ షాట్స్ కొరకు You are not allowed to view links. Register or Login to view. సాఫ్ట్ వేర్ ఉపయోగించాను. వాటిని మరింత అర్ధవంతంగా చేసేందుకు You are not allowed to view links. Register or Login to view. మరియు Anu Script Manager v.7.0 ద్వారా You are not allowed to view links. Register or Login to view. ఉపయోగించాను. ఇక వీటిని .gif ఫైల్ గా తయారుచేసి యానిమేట్ చేయడానికి You are not allowed to view links. Register or Login to view. ఉపయోగించాను. అయితే వీటన్నింటి లొ నేను బేసిక్ ఆప్షన్స్ మాత్రమే అప్లై చేశాను, వీటన్నింటిలో మరింత అద్భుతమైన ఆప్షన్స్ మరెన్నో ఉన్నాయి.



SnagIt v9.1.2

[Image: 10.jpg]

SnagIt పెయిడ్ వెర్షన్. ఉచిత వర్షన్ లో అనేక ఆప్షన్లతో అత్యుత్తమంగా పనిచేసేది You are not allowed to view links. Register or Login to view.. క్రింది ఇమేజ్ చూడండి.

[Image: 22-1.jpg]

Adobe Photoshop v7.0

[Image: 13.png]

Anu Script Manager v7.0

[Image: 12-1.jpg]

Easy GIF Animator v4.7

[Image: 11-2.jpg]
Quote this message in a replyReply

Post: #5
[Image: 25f12rb.gif]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)