Post: #1
అవయవాలు కృంగి
అచేతనంగ ఉన్నాను

అవసరాలు స్వైర విహారం
చేస్తూ అసహాయత్వాన్ని చూస్తూ
వికటట్టహాసం చేస్తూ
కర్కశంగా నా నిస్సహాయ స్థితిని
ముక్కలు ముక్కలుగా చేస్తూ....
ప్రపంచం నన్ను దూరం చేస్తే
నాలోని మనిషిని చంపి, వికృతంగా
ఆ రక్తం తో పండగ చేసుకుంటుంటే

ఇంకిపోయిన కళ్ళు
ముసకబారి-దారి కనబడక
చావు వైపు అడుగులేసిన నన్ను

ఆర్తిగా ఒక హస్తం అక్కున జేర్చుకుంది

ద్వేష రహిత వాక్బాణాలు
నన్ను మామూలు మనిషిని చేశాయి!!

ఎదురుగా నవ్వుతూ చల్లని
కల్మషం లేని ఆ చూపు..

అది చాలు నా జీవితానికి..

మిత్రమా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ..??



చావుకు దగ్గరగా వెల్లిన నన్ను మామూలు మనిషిని చేసిన నా మిత్రుడికి అంకితం

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
చేసిన సహాయాన్ని మరవని మీ స్నేహం...
స్నేహానికి విలువిచ్చి మిమ్మల్ని ఆదుకున్న మీ మిత్రుడు...
మీరు అంకితమిచ్చిన మీ నిజమైన కవిత...
ఈ మూడూ చాలా గొప్పవి...

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
ముందుగా మిత్రులందరికి FRIENDSHIP DAY శుభాకాంక్షలు!

sreenuragi గారు
అలాంటి నిజమైన స్నేహ హస్తం దొరకటం కన్నా జీవితంలొ మరింకేం కావాలి అనిపిస్తుంది. మీరు నిజమైన అదృష్టవంతులలొ ఒకరు.

మీ కవిత, భావావేశ వ్యక్తీకరణ చాలా బాగున్నాయి. ధన్యవాదాలు
Quote this message in a replyReply

Post: #4
మహీ గారు నేను ఏ ఉద్దేశ్యం తో రాసానొ మీరు ఆ పాయింట్స్ ను నోటిస్ చేయడం నాకు ఆనందంగా ఉంది
ధన్యవాదాలు !


================================================
ప్రసాద్ గారు నమస్తే సార్ ,

మీ పోస్టుల ద్వారా నాకు మీరు చాలా రోజులుగా పరిచయమే సార్.
మీ లాంటి వాళ్ళ అభినందనలు నాకు కొత్త శక్తిని ఇస్తాయి ప్రసాద్ గారు !
ధన్యవాదాలు!

అన్నట్లు మీ వాయిస్ నాకు తెలుసు డవున్లోడ్ చేసుకుని విన్నాను ..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)