Post: #1
అంతులేని అలల సమాహారం
పాలనురగల సమ్మేళనం
నీలిరంగుకు నిర్వచనం
ధీరగంభీరమైన సంద్రం

కోటికలలకు నిలువుటద్దం
గత చరిత్రకు మూలకారణం
అన్యులకు అర్దమవని స్వేచ్చావిహంగం
ఆడదాని హృదయం

కడలి గర్భంలో ఎన్నో సంపదలు
ముదిత మనసులో వేల ఆలోచనలు

సుడిగుండాలు సహజం సాగరాన
సుఖ దుఃఖాలనేకం సుదతి జీవితాన

ఎగిరి పడే అలకు తీరమే గమ్యం
అదిరిపడే అతివకు భాగస్వామే బలం

ఎన్నో జీవుల జీవం సాగర గర్భం
వంశాకుర బందం స్త్రీ గర్భం

సూర్యోదయాన కడలి సౌందర్యం
సిగ్గు మొగ్గైనప్పుడు ప్రమద అందం
ఏ కవి వర్ణన కు సాధ్యం?

సౌందర్యం, సంపద లభ్యమయ్యే సముద్రాన్ని
చేస్తున్నాం మన పాద స్పర్శతో మలినం

అందం, లక్ష్మీకళతో కలగలిసిన ముగ్ద మనోహరం
ఆక్షేపణలతో, కట్టుబాట్లతో అణచేస్తుంది సమాజం

పుడమి భారానికి పెనుభూతం భూకంపం
జలధి వికటాట్టహాసం త్సునామి తాండవం

కరుణాతప్త హృదయం కోల్పోతే కరుణారసం
జరిగే విలయ తాండవం కన్నుల జ్వాలాతోరణం
జగతంతా ఆ జ్వాలకి ఆహుతవ్వడం ఖాయం.
Quote this message in a replyReply

Post: #2
సూర్యోదయాన కడలి సౌందర్యం
సిగ్గు మొగ్గైనప్పుడు ప్రమద అందం
ఏ కవి వర్ణన కు సాధ్యం?


========================================================

చాలా బాగుంది మీ కవిత జాహ్నవి గారు.

కీప్ ఇట్ అప్ ..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
జాహ్నవి గారు,
మాటలకందని అద్భుతమైన మీ కావ్యానికి జోహార్లు..
మీ కలం అంచులనుండి జాలువారే కవిత్వాలకు అభిమానినయ్యాను....


థాంక్యూ...
Quote this message in a replyReply

Post: #4
Thank U Sreenu Gaaru, Srinath Gaaru.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)