Post: #1

ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఫోరమ్ ను అత్యాధునికంగా ఎంత ముందుకు తీసుకు వెళ్ళవచ్చో....at the same time....అలాగే సామాన్య ప్రజానీకానికి కూడా సులభంగా అర్థం అయ్యే విధంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో....తెలియజేయాల్సిన ఆవశ్యకతను గూర్చి మంచి కాన్సెప్ట్ తో.... విజ్ఞాన వీచికలను ఎటువంటి రీతిలో ప్రసరింపజేయాలో తెలియజేస్తూ....ఎవరైనా సరే మంచి కాన్సెప్ట్ తయారు చేయండి. వ్యక్తిగతంగా నేను....సమిష్టిగతంగా అందరం సంతోషిస్తాము. సరేనా...ఇది చాలా లోతైన భావన కాబట్టి. చాలా వేవ్ లెంగ్త్ భావనతో ఆలోచించండి. మనం తరచూ సమావేశం అవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు....????
ఈ ఫోరమ్ గూర్చి ఎవరికీ....ఎటువంటి సందేహాలు వద్దు. మల్టీమీడియా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో తనకు తానుగా....ముందుకు వచ్చి....అందరికీ సులభశైలిలో అర్ధమవ్వాలనే...సదాశయంతో ప్రారంభించబడిన ఫోరమ్.... తద్వారా మల్టీమీడియా ను స్వయంగా నేర్చుకొని....తమ కాళ్ళమీద నిలబడగలిగేలా సాంకేతిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఈ ఫోరమ్ ను ఇంకా ఎటువంటి సాంకేతిక విషయాలు కావాలో....అడిగి తెలుసుకోండి. ప్రశ్నలు వేధిస్తూనే..శోధిస్తాయి. మల్లెలు మాలతోనే శోభిస్తాయి. చివరకు రెండూ ప్రకాశిస్తాయి. శోధించటం..సాధించటం..ధీరగుణం. అది అరుదైన వ్యక్తిత్త్వం. You are the Creator of your Destiny. అందివచ్చిన అవకాశాన్ని చేజారకుండా సద్వినియోగించుకోండి. ‘‘వెనకపడితే వెనకేనోయ్ అన్నది ఆర్యోక్తి’’. కానీ నేడు ప్రపంచ తీరు తెన్నులను చూస్తుంటే...సాంకేతికత ఎంత వేగంగా మార్పుచెందుతోంది. మారే కాలంతో పాటు తగిన విధంగా నూతనత్వాన్ని సంతరించుకొంటూ....మన జీవన గమనాన్ని కూడా మార్చుకొని....ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని....ఆ గమ్యాన్ని చేరుకోవడంలో పొందే ఆనందం అంతా....ఇంతా కాదు. మనం ఎందుకు జన్మించామో తెలుసా....పరహితం కోసమే. ముందు పరహితం కోరిన తరువాతే...స్వహితం....ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య అంతులేని అగాధాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో...."మేము ఉన్నా"మంటూ కొంతమంది యువకులు...ముందు తరం దూతలు.....సంఘటిత శక్తులు అయిన....మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన మిత్రులు కంప్యూటర్ ఎరా ఫోరమ్ ఎడిటర్ అయిన శ్రీధర్ గారు....మరియు మహిగ్రాఫిక్స్ అధినేత మహేష్ రెడ్డి గారు....ఇరువురూ మాకు మార్గదర్శకులే. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. ఆదర్శమే తమ పథంగా....పరహితమే లక్ష్యంగా పనిచేస్తూ....సంఘంలో ఆదరణ పొందుతున్న మీ తీరు బహుధా ప్రశంసనీయం. ఇతరులకు మార్గదర్శకం. మా మిత్రులు మహిగారు తలపెట్టిన విజ్ఞాన భాండాగారం....మహిగ్రాఫిక్స్ ఫోరం సాంకేతిక ముందు చూపుకు మరియు అనేక విధాలుగా ఉపయోగపడేవిధంగా తీర్చి దిద్దుతున్నందుకు.... తెలుగుజాతి ప్రజలు ఎంతో గర్వపడాలి. వినయంతో కూడిన గర్వమే కావాలి....మఱ్ఱి విత్తనం నుంచి మహా శాఖోపశాఖలుగా విజ్ఞాన ఫలాలు అందరికీ అందాలి. సభ్యులుగా మేం కోరుకునేది ఇవే. ఒదగడంలో గడ్డిమొక్కలాగా....వినయంతో, సంస్కారంతో ఒదగాలి. అనేక మార్పులు నిరంతరం చెందుతున్నా...కూడా ఇందులో ప్రధానాంశమైన సాంకేతిక విషయాలను ‘‘షేరింగ్ అండ్ కేరింగ్’’ అనే విషయాలకే పెద్ద పీట వేయాలి. ఇందులో ముఖ్యంగా సేవాదృక్పధమే ప్రధానంగా కనపడాలి. ఆచరణలో నిరూపించాలి. [/color] ఎవరికి ఎవరు ఏమీ కాకున్న....చివరకు మిగిలేది ఏమిటి...? మనం చేసిన మంచి పనులే కదా....అందుకే గౌతమ బుద్ధుడు సర్వజన హితాయ....బహుజన సుఖాయ....సంఘం శరణం గచ్ఛామి...అన్నారు. శాశ్వతమైన సుఖాలను కోరుకునే వారు అశాశ్వతమైన దు:ఖాలను త్యజించాలని బోధన చేశారు. అందువల్ల.... ప్రతి ఒక్కరినీ ఈ ఫోరమ్ లోనికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొంత మంది యువకులు ముందు తరం దూతలు....నవజీవన బృందావన నిర్మాతలు....నిర్ణేతలు.
మా మిత్రులు మహిగారికి శుభాకాంక్షలు తెలుపుతూ....ఒక కఠోర బాధ్యతను గుర్తు చేస్తున్నాము. శ్రీకృష్ణదేవరాయలకు మహామంత్రి తిమ్మరుసులాగా....మీనుంచి వచ్చే విజ్ఞాన వీచికలు....అందరికీ అందాలి. ఎటువంటి భేదభావాలు లేకుండా....అందరికీ సమానంగా అందాలి. అంతే. అధికారంతో పాటు బాధ్యతను కూడా తీసుకునే ముందు....సుఖపడే ముందు కష్టపడితే ఆ తరువాత వచ్చే ఫలితం ఎంత మధురంగా ఉంటుందో తెలుసా....? అందుకే మహామంత్రి తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలను కంటికి రెప్పలాగా కాపాడారు. తనకు హాని చేసినా పెద్దమనసుతో క్షమించేశారు. ఈ సందర్భంలో మరొక ముఖ్య విషయం చెప్పాలి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ....పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ....అనేది ఎట్టి పరిస్ఠితుల్లో మరువ వద్దని నా మనవి. విజ్ఞాపన. మా ఆశీర్వచనాలు. మా విమర్శలు....ప్రశంసలు....(అన్నిరకాలు).
మా మిత్రులకు శుభాభినందనలు....
12 Months of Happiness 52 weeks of Fun 365 Days of Laughter 8760 Hours of Good Luck 52600 Minutes of Joy 31536000 Seconds of Success..... ..........In All Aspects. Go a Head.
మహి....మహిమా....న్విత...మాన్విత హృదయుడవు. సాగిపో నీ గమ్య తీరాలవైపు..... ఆదర్శప్రాయంబు....నీ ముందు చూపు....


Post: #2
సుమణి వెంకట్ గారు

మీ అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.

కంప్యూటర్ ఎరా ఫోరం ద్వారా శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు తలపెట్టిన అనన్యసామాన్యమైన యజ్ఞానికి తోడు మహేష్ గారు ఈ ఫోరం ను ఏర్పాటు చేయటం చాలా ఉపయోగమే కాకుండా ఆనందించదగ్గ పరిణామం. మహేష్ గారు తలపెట్టిన ఈ నాలెడ్జ్ షేరింగ్ ఈ రోజు అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉంది.

హాట్సాఫ్ టు మహేష్ గారు.

Post: #3
Dear Sir

Thank you for your valuable feed back regarding in this issue. Thanks a lot Sir....

Bheesma kurupithamahulaina meelanti peddala aasseessulu....sadaa maa paina vundalani....korukune vallallo pradhamgaa vundedi nene.

Mee aasseessulu andinchinanduku dhanyavaadamulu.

Post: #4
sir mee abhipryamtho nenu ekibhavistunnanu sir your posting very nice sir.

Post: #5
మహిగ్రఫిక్స్ మరియు మిత్రులందరికీ నమస్కారం
పాత మిత్రులు...చాల మందిని ఇక్కడ చూస్తున్నందుకు సంతోషం.
గౌరవనీయులు ప్రసాద్ గారు నమస్కరం సర్.
ఈ ఫోరం ని ముందుతీసుకు వెళ్తున్న అందరికి పేరు పేరున నా హృదయ పూర్వక అభినందనలు.

డా.పవన్

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)