Post: #1
ఈ మధ్య నా SONY DRU-170c DVD writer తో Dvd లను burn చేస్తుంటే powercalibration error అని display అవుతూ burning process మధ్యలోనే ఆగిపోతుంది. Burn అవుతూ ఆగిపోతుండటం వలన dvdలు మరలా write చేసుకోవడానికి కూడా పనికిరావడంలేదు. Firmware update చేద్దామన్నా ఈ model కి sony home page లో updtae ఇవ్వలేదు. How can I troubleshoot this problem?

Post: #2
మీరు ఏ స్పీడ్ లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు, మరియు మీ కంప్యూటర్ smps wattage output ఎంత? ఒక బర్నింగ్ సాఫ్ట్వేర్లో రైట్ చేసి చూశారా? తదితర వివరాలను తెలియచేయగలరు.

[Image: mahi_sig.jpg]

Post: #3
పవర్ కాలిబ్రేషన్ ఎర్రర్ కు క్రింది వి కారణాలు కావచ్చు.

1. Outdated ASPI drivers
2. CD Writer firmware
3. Dirty laser Unit
4. Incompatibility with Nero fix
5. Electrical (SMPS) Problems

ఈ సమస్య ను అధిగమించేందుకు ముందుగా మీ డ్రైవ్ ఫర్మ్ వేర్ ను అప్డేట్ చేసుకోవటం, మీ SMPS సరైన విధంగా పవర్ ను మీ డ్రైవ్ కు అందిస్తుందో లేదో చెక్ చేయించండి, లేజర్ యూనిట్ ను DVD cleaning media తో క్లీన్ చేసుకోవటం చేయండి,

ముందుగా క్రింది వీడియో లో చూపిన సెట్టింగ్స్ చేసి చూడండి. మీ సమస్య పరిష్కారం కాకపోతే పైన చెప్పినవన్నీ ఒక్కొక్కటి గా చేసి చూడండి



Post: #4
మహి గారు,
నేను first 18x speed తో dvds write చేసేవాడిని. తరువాత burning speed option ని automatic నుండి minimum కి సెట్ చేసాను. నేను burning కోసం Dvd shrink మరియు Nero softwares use చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా writer, 'sony' dvd లను ఎటువంటి errors లేకుండా burn చేస్తుంది
ప్రసాద్ గారూ, నేను ఇంతకుముందే cd cleaner తో lens clean చేసాను. ASPI Drivers మరియు firmware update ఎలా చెయ్యాలో తెలుపగలరు

Post: #5
మీరు పైన ప్రసాద్ గారు చెప్పినట్లు చేసి చూశారా? అప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే అది ఖచ్చితంగా లెన్స్ అలైన్ మెంట్ ప్రాబ్లమ్, లేదా లెన్స్ క్లీనింగ్ ప్రాబ్లమ్ ఉండవచ్చు. మీరు హైద్రాబాద్ లో నివసిస్తున్నట్లయితే ప్యారడైజ్ దగ్గర గల చెనాయ్ ట్రేడ్ సెంటర్స్ లో ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి మంచి సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీరే చేయగలరనుకుంటే ఒక సారి డీవీడీ రైటర్ ను ఓపెన్ చేసి వైట్ పెట్రోల్ తో లెన్స్ ను క్లీన్ చేయండి అది కూడా సుతిమెత్తని క్లాత్ తో. ఇంకో విషయం రికార్డింగ్ కి 8x కి మించి స్పీడ్ ఉపయోగించకండి. బర్నింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యి అటు లెన్స్ లైఫ్, ఇటు రికార్డింగ్ చేసిన డీవీడీ లైఫ్ రెండూ తగ్గుతాయి.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)