Post: #1
[Image: wifi.gif]

You are not allowed to view links. Register or Login to view. సమాచారం ప్రకారం Wi-Fi కు సంబంధించిన కొత్త ప్రామాణికం పూర్తికావచ్చినట్లు, అది 600mbps వరకు వేగాన్ని అందించగలదని తెలుస్తుంది.

[Image: wifi.jpg]

దాదాపు 5 సంవత్సరాల పరిశ్రమ అనంతరం ఈ అభివృద్ధి సాధ్యమయ్యింది. ఈ కోత్త ప్రామాణికమైన '802.11n'ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు నాటికి విడుదల అవుతుంది. తరచుగా 'Wireless N' గా పిలవబడే ఈ ప్రామాణికం 600mbps transfer rate ను ఇవ్వగలగటమే కాకుండా ఒకేసారి 4 ప్రవాహాల హై-డెఫినిషన్ వీడియో, వాయిస్ మరియూ డాటా ను కూడా గృహావసరాలకు లభ్యత కల్పించగల సామర్ధ్యం కలిగి ఉంది.

ప్రస్తుత ప్రామాణిక మైన '802.11g' కేవలం 54mbps వరకు మాత్రమే వేగాన్ని అందించగల సామర్ధ్యం కలిగి ఉంది. రాబోయే కొద్ది సంవత్సరాలలోనే networking technology ఉత్పత్తిదారులు ఈ ప్రామాణికం యొక్క మూలాధారంతొ తమ ఉత్పత్తులను అందించగలరని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వాటిలో 2 లేక 3 ఛాన్నెల్స్ ను మాత్రమే పొందుపరచగలరని అంచనా. అలా జరిగితే ఈ కొత్త ప్రామాణికమైన '802.11n' యొక్క పూర్తి సామర్ధ్య వినియోగానికి కొంత అవరోధం ఏర్పడవచ్చు. కాబట్టి '802.11n' యొక్క పూర్తి సామర్ధ్యమైన 600mbps transfer rate లో కొంత రాజి పడక తప్పదు.

ఈ కొత్త Wi-Fi Standard ద్వారా కొత్తగా మనకు ఆశ్చర్యకరమైన డాటా స్పీడ్స్ ను అందగల సౌలభ్యం కల్పించబడింది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)