Post: #1
స్వైన్ ప్లూ మృత్యుహేళ వల్ల స్వైన్ రొగుల సంగతి ఎమో కాని మా జీవితాలు మాత్రం గోరంగా తయారయ్యాయి. బస్సులలొ తిరగకూడదు, హోటళ్లలొ తినకూడదు, పబ్లిక్ ప్లెసెస్ ( గార్డన్స్, రైల్వే స్టెషన్స్, బస్సు లలొ ) లకు పూర్తిగా వెళ్ళకూడదు లాంటి నియమాల వల్ల బాచిలర్స్ జీవితాలు అపిసులకు, రూములకు పరిమితం అయ్యాయి. ఇక వంట కూడ పూర్తిగా ఇంట్లోనె చెసుకొవాల్సి వస్తుంది. సిటి కి పూర్తిగా విస్తరించకుండా వైరస్ వున్న కొన్ని రిజియన్లకు మాత్రమె దీన్ని పరిమితం చేయటానికి అదికారులు ఎన్నొ చర్యలు తీసుకుంటున్నారు. అందులొ భాగంగానె సినిమా హాళ్లకు, స్కూళ్ళకు, కాలేజిలకు 7 రొజుల అత్యవసర సెలవులను ప్రబుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఈ మహమ్మారి మాత్రం తన విజృంబణను ఆపట్లేదు.


ప్రభుత్వ చర్యలు మాత్రం సంతృప్తి కరంగానె వున్నాయి. ప్రబుత్వ అస్పత్రిలలొ విటమిన్ ‘C’ మాత్రలను పంచుతున్నారు. ఇక్కడి జంట నగరాల కార్పొరెషన్లు ( PMC మరియు PCMC లు) హోర్డింగులతొ, జీపుల పై ప్రచారాలతొ ప్రజలకు రొగానికి సంబందించిన సమాచారాన్ని కల్పిస్తున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు ఇవ్వన్ని ఇస్తూనె నిమ్మ కాయలు, నిలగిరి ఆయిల్, చేతి రూమాళ్లను పంచుతున్నారు. ఇప్పటివరకు ( సోమవారం రాత్రి వరకు ) పూణే లొ 5 గురు ఈ వ్యాధితొ మరణించారు. రాష్ట్రం మెత్తం కలిపి ఆరు. ఇంకా చాల మంది రొగుల పరిస్థితి ససూన్ హస్పిటల్లొ అశాజనకంగా లెదని అనధికార వార్తల వినికిడి.


ఇక వార్త పత్రికల్లొ ఎక్కడ చూసిన పూణే సమచారమె. బయటికి వెళ్ళి చూస్తె అందరి మొహాలకు మాస్కులు. ఇక వ్యాపురులు మాత్రం ఇదే చాన్సని దొబ్బుకుంటున్నారు. 10 రుపాయల మాస్కు రూ .40 నుండి 50 కి అమ్ముతున్నారు. మాస్కు కూడ 4 నుండి 5 గంటలు మాత్రమే వాడాలి.

ఇదండి పూణే లొ అప్రకటిత యుద్ద పరిస్థితి. ఏలాగు అగస్టు 13, 14, 15 సెలవులు కాబట్టి హైదరబాదు వచ్చి ఒక పదిరొజులు వుండి వెళ్ళాలనుకుంటున్నాను.

ఇక పూణే స్వైనప్లూ వార్తలు చదవండి

You are not allowed to view links. Register or Login to view.
and
You are not allowed to view links. Register or Login to view.

1. You are not allowed to view links. Register or Login to view.
2. You are not allowed to view links. Register or Login to view.
3. You are not allowed to view links. Register or Login to view.
4. You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకోవడమే మనం చేయగలిగినది . పూణేలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది .
క్రమ క్రమంగా ఇతర భారతీయ నగరాల్లోనూ , పల్లెల్లోనూ విస్తరించే ప్రమాదం ఉంది . ఇక ఇతర
దేశాల్లోనూ ఇదే పరిస్థితి . తగిన పరిష్కారం కోసం సంబంధిత శాస్త్రవేతలు కృషి చేస్తున్నారు .
వారి పరిశోధనలు సఫలం అయి త్వరలో దీని నివారణోపాయం లబిస్తుందని మనం ఆశిద్దాము .

[center]సర్వేషాం స్వస్తి: భవతు
సర్వేషాం శాంతి: భవతు
సర్వేషాం పూర్ణం భవతు
సర్వేషాం మంగళం భవతు
[/center]
Quote this message in a replyReply

Post: #3
^ నమస్కారం mn 48 గారూ....
సర్వహిత ప్రయోజనార్థం
మంగళకరమైన శ్లోకాన్ని
ఇక్కడ ఉటంకించడం
చాలా బాగుందండీ.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)