Post: #1
మిత్రులారా...
కాలం మారుతోంది. నవీన కాలంలో...ఉత్తరాల స్థానంలో ఈ మెయిల్స్ ఆక్రమించుకున్నాయి కదా...(ఈ దృశ్యం కూడా మారుతోంది) అయితే...
అందరికీ తెలిసిన విషయమే అయినా చెప్పదలచుకున్నాము.
మెయిల్ పంపేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
1. ఇ-మెయిల్ మెసేజ్ తయారు చేసేటప్పుడు సబ్జెక్టు బార్ (subject bar) లో విషయాన్ని గూర్చి తెలియజేసే విషయ వస్తువును గూర్చి తప్పకుండా క్లుప్తంగా వ్రాయండి. subject bar ను ఖాళీగా వదలకండి. ఒకవేళ హడావుడిగా కంపోజ్ చేసేసి send అని కొడితే...ఎలాగూ కంప్యూటర్ మనకు తెలియజేస్తుందనుకోండి.
2. మెసేజ్ టైప్ చేసేటప్పుడు Upper Case Letter అనగా Capital Letter (CAPITAL LETTERS) వాడకండి. ఎందుకంటే...అప్పర్ కేస్ లెటర్స్ వాడితే పెద్ద గొంతుతో అరిచినట్లుగా భావిస్తారు. (ఇది అమర్యాదగా భావించటం వలన ఈ భావన వాడుకలోకి వచ్చింది.)
3. మెసేజ్ కంపోజ్ చేసిన తరువాత చాలా మంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేయరు. (గుర్తుంచుకోండి. మీ భాష, శైలి చక్కగా ఉంటే...మంచి అనుబంధాలకు ఫెవికాల్ లాంటి బంధం ఏర్పడుతుంది.)
4. స్పామ్ (Spam) మెసేజ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపవద్దు. అసలింతకీ స్పామ్ అంటే...అవతలి వ్యక్తి కోరని, ఎవరికీ పనికిరాని చెత్త మెసేజ్ అని అర్థంలో చెప్పుకోవచ్చు. వాటి వల్ల మీ సమయం, అవతలి వ్యక్తి సమయం వృధా కావడమే కాక, తిరుగు జవాబుగా మిమ్మల్ని తిట్లు, శాపనార్ధాలు పెట్టే మెసేజ్ లు రావచ్చు.Smile
5. వ్యంగ్యం, హేళన, ముదురు హాస్యం ధ్వనించే విధంగా మీ సందేశాలు కంపోజ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే...అవతలి వ్యక్తికి మీ ముఖ కవళికలు పరిశీలించే అవకాశం లేదు కనుక, మీ పదాల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
6. వీలయినంత వరకు మెసేజ్ క్లుప్తంగా, సరళంగా, సూటిగా ఉండేట్లు వ్రాయడం సరైన పద్ధతి. అవతలి వ్యక్తి యొక్క సమయం విలువను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
7. క్రొత్తవారికి మెసేజ్ పంపుతున్నప్పుడు ముందు మీరెవరో క్లుప్తంగా పరిచయం చేసుకోండి. ఫెవికాల్ అనుబంధాలను పెంచుకోండి.Tongue
8. కొంత మంది ఆఫీసులలో రకరకాల విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఫైల్స్ మీద మనం అర్జంట్ అనీ, కాన్పిడెంట్ అని....ఇలా రకరకాల నోట్స్ పెడుతుంటాం గదా. అలాగే...ఈ మెయిల్ లో కూడా ఇటువంటి మీ విచక్షణను ఉపయోగించి వాడండి....హెడ్డింగ్ లో.
9. మీకు పోస్ట్ ద్వారా అందే ఉత్తరాలను మీ పోస్ట్ మేన్ ఇంటికే తెచ్చి ఇస్తారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనమే రిసీవ్ చేసుకుంటాం. లేదా...మన తరపున మన ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అలాగే...సిస్టమ్ ఆన్ లైన్ లో ఉన్నా ...లేకున్నా...ఆఫ్ లైన్ లో ఉన్నా...అవతలి వాళ్ళు మెయిల్స్ పంపగానే...ఆటోమేటిక్ గా చేరాల్సిన గమ్యానికి చేరుతాయి. అందులో హైరానా పడాల్సిన అవసరం లేదు.
10. రెగ్యులర్ గా వీలయినప్పుడల్లా చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే...మామూలు ఉత్తరాల వలే...ఈ మెయిల్ మెసేజ్ మీ చేతికి అందదు గనుక. కనీసం రోజుకు ఒకసారయినా లాగిన్ అయి మీ మెయిల్స్ ను చెక్ చేసుకోండి. (సందర్భాన్ని బట్టి అన్వయించుకోండి.)

(కొసమెరుపు : కేవలం అనుభవపూర్వకంగా చెప్పిన సున్నితమైన అంశాలే కనుక ఇప్పుడు చాలా మంది చాలా ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి....బాగా తెలిసిన వ్యక్తులకు ఈ హితోక్తులు వర్తించవు అని గమనించండి.TongueTongueTongueTongue)
Quote this message in a replyReply

Post: #2
Good info...sir
Quote this message in a replyReply

Post: #3
చాలా బాగా చెప్పారండీ!!!

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)