Post: #1
^ గౌరవ సభ్యులారా...
^^^^ (నమస్కార బాణాలు)

ఇక్కడే ఇంకో అద్భుత ప్రపంచం ఉందని గమనించ గలరు.

You are not allowed to view links. Register or Login to view.

ఏదన్నా అత్యవసరమైన సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాలంటే... లేదా సభ్యులను కలుపుకొని తగిన సాంకేతిక విషయాలను తెలుసుకోవాలంటే....ఇక్కడకు రండి.


కొన్ని సూచనలు (ఒక క్రమపద్ధతి కోసమే తప్ప ఇబ్బంది పెట్టటానికి గాదు అని గమనించండి)

1. మీరు సంభాషణలోకి ప్రవేశించే ముందు మర్యాద పూర్వకమైన పలకరింపుతో ఛాట్ లో ప్రవేశించాలి. 'Hello Everybody' అనిగానీ లేదా "Good Day to you All" అని గానీ ఈ విధమైనటువంటి పొలైట్ అభివందనంతో ఛాట్ రూమ్ లోకి ప్రవేశించండి. (సభ్యులు మన్నించాలి. వారి వారి శైలిలో ఎంటర్ అవుతారు. మనల్ని విష్ చేస్తారు. అయితే ఇక్కడ సూచించిన పదాలు కేవలం ఈ తరహా....అని సూచించటం కోసం మాత్రమే ఉదాహరణగా చెప్పటం జరిగింది. ఏమైనా మర్యాద పూర్వక రాక...మిగతా సభ్యులకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనేది మాటల్లో అనుభవిస్తేగానీ తెలియదు)
2. ఛాట్ రూమ్ వదలి వెళ్ళేటప్పుడు కూడా ‘గుడ్ బై...అయామ్ రిలీవింగ్ నౌ’ లేదా ‘థాంక్స్. ఐయామ్ లీవింగ్ నౌ’ అనో చెప్పి వెళ్ళటం ద్వారా బై చెప్పే వ్యక్తి ఛాట్ రూమ్ లో ఉన్న మిగతా వ్యక్తుల హృదయాలను గెలుచుకొని వెళ్ళుతున్నట్లు లెక్క.)
3. వ్యక్తిగతమైన దూషణలు, వెక్కిరింతలు, హేళనలు చేయకూడదు. (ఛాట్ మర్యాదలను అతిక్రమించ కుండా కేవలం కొంత పరిథిలో హాస్య గుళికలు విసరొచ్చు సుమీ. అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.)
4. మీ సంభాషణలు టైప్ చేసేటప్పుడు ఎప్పుడూ అక్షరాలు ఇంగ్లీష్ లో అయితే Lower Letters మాత్రమే ఉండేలా జాగ్రత్త వహించండి. UPPER CASE LETTERS ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగించకండి. ఒకవేళ ఎవరన్నా తెలియక వాడితే మిగతా సభ్యులు సున్నితంగా తెలియజేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి ఏ ఒక్కరూ ఏ ఒక్క సబ్జెక్టులో నిష్ణాతులు కారు కదా. ప్రతి మనిషి నిత్య విద్యార్థి. Upper Case Letters వాడితే అటువంటి ప్రయోగాన్ని ‘‘కేకలు’’ గానో లేక ‘‘అరుపులు’’ గానో భావిస్తారు. ఇది అమర్యాదకరమైన పద్ధతి కాబట్టి ఇట్టి ప్రయోగం చేయరాదని సభ్యులకు సూచన.
5. ఎవరైనా మీరు సమాధానం చెప్పడానికి ఇష్టపడని ప్రశ్న వేసినప్పుడు సున్నితంగా ‘సారీ కాంట్ టెల్’ అని గానీ...‘నాట్ నౌ’ అనిగానీ సమాధానం ఇవ్వడం గానీ లేదా....తెలుసుకునైనా సరే చెప్పడంగానీ చెప్పడం ఉత్తమమైన పద్ధతి. (లేదా కొంత విరామం తరువాత చెప్పడం జరుగుతుంది అని గానీ లేదా నిపుణులైన వారు తెలియజేస్తారు అని గానీ చెప్పడం వలన ఎదుటి వ్యక్తిలో ఎటువంటి ప్రతికూల భావనలు కలగవు. పైగా ఇలా తెలియజేసిన సదరు సభ్యునిపై గౌరవం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.)
6. మీ సంభాషణలు ఆసక్తికరంగా ఉండేందుకు....చాట్ లలో వాడే కొన్ని ప్రత్యేకమైన సింబల్స్ ను సంభాషణల్లో ఉపయోగించండి. తప్పేం లేదు. (అన్నీ చాట్ రూంలో ఉన్నాయి) అయితే అదే పనిగా ఎక్కువ సార్లు విసుగు కలిగించే విధంగా ఎమోటికాన్స్ ను ఉపయోగించడం చేయకండి.
ఈ విషయం తెలుసుకున్నందుకు మీకు మహి గ్రాఫిక్స్ టీమ్ నుండి మీకు ధన్యవాదాలు. మనం స్వార్థపరులుగా నిలిచిపోకూడదు. మనం కొంత మేర అయినా సరే నిస్వార్థంగా సమాజానికి లేదా పదుగురికి పనికి వచ్చే మంచి విషయాన్నయినా తెలియజేద్దాం..రండి...ఈ ఫోరమ్ లో భాగస్వాములు కండి. నిశ్శబ్ధంగా శబ్ధం లేకుండా పోస్ట్ లు చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే....ఉన్నంతలో...తెలిసినంతలో పోస్ట్ లు చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #2
forum లోని ప్రతి సభ్యుడు సుమని వెంకట్ గారు పైన చెప్పిన విధంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు వెంకట్ గారు.
Quote this message in a replyReply

Post: #3
సుమణీ గారు,
అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలను చెప్పారు.
Quote this message in a replyReply

Post: #4
Thanks sunmanivenkat garu for your advise.

Regards
Shekar Reddy
Quote this message in a replyReply

Post: #5
sumanivenkat garu u'r absolutely correct.
we try our level best to post good posts.
bye bye
urs,
R
A
M
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)