Post: #1
మిత్రులారా...
సిస్టం యూనిట్ లో ప్రధానంగా మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్, సిడీ రామ్ డ్రైవ్, పవర్ సప్లయ్ యూనిట్ ఉంటాయి. మదర్ బోర్డ్ పైన ముఖ్యమైన ప్రాసెసర్ అమర్చబడి ఉంటుంది. సిస్టం యూనిట్ కు వెనుక వైపు వివిధ రకాల పెరిఫెరల్స్ డివైజెస్ లు కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ మరియు కనెక్టర్స్ ఉంటాయి.
అవి ఏమేమిటో తెలుసుకుందాం.
1. DIN : పాత రకం కీ బోర్డ్ లను కనెక్ట్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ ఉపయోగపడుతుంది.
2. PS/2 : మౌస్ ను కనెక్టు చేసుకోవటానికి అదే విధంగా కొత్త రకం కీ-బోర్డ్ లను కనెక్టు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
3. Serial : దీనినే కామ్ పోర్డ్ అని కూడా పిలుస్తారు. మోడెమ్స్ ను కనెక్టు చేసుకోవటానికి ఈ పోర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. Parallel : ప్రింటర్లు, స్కానర్లు మరియు కొన్ని సమయాలలో మోడెమ్స్ ను కనెక్టు చేసుకోవటానికి ప్యారలల్ పోర్ట్ లు ఉపయోగపడతాయి.
5. VGS (Video Graphics Adapter) : మానిటర్ ను ఈ కనెక్టర్ కు కనెక్ట్ చేస్తారు.
6. Line in : ఆడియో ఎక్విప్ మెంట్ ను కనెక్టు చేసుకొని, పిసిలో ఆడియో రికార్డింగ్ చేయటానికి ఈ కనెక్టర్ ఉపయోగపడుతుంది.
7. Line out/Head Phone : ఆడియో అవుట్ ఫుట్ ను పొందటానికి ఈ కనెక్టర్ కు స్పీకర్స్, హెడ్ ఫోన్స్ వగైరా వాటిని కనెక్టు చేస్తారు.
8. MIDI/Joystick : జాయిస్టిక్, మ్యాజిక్ Instruments కనెక్టు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

(కొసమెరుపు : భవిష్యత్ లో సాంకేతిక అవసరాలు పెరిగి నూతన అన్వేషణలు ఫలించి మరింత మేలైన మరిన్ని పద్ధతులు రావచ్చును)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)