Post: #1
నేను నాకు ఎంతో ఇష్టం అయిన ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా లో ని ఒక పాటని పాడను. మీరు విని ఎలా వుందో నాకు చెప్పాలి... కొంత మంది నా గొంతు విని బాగా వుందని చెప్తే మీ మీద కూడా ప్రయోగిద్దాం అని ఇక్కడ లింక్ ఇస్తున్నా.. వినడమే కాకుండా కచ్చితం గా ఎలా వుందో చెప్పాలి ..

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
గొంతు బాగుంది. ప్రాక్టిస్ చేస్తే మరింత బాగా వస్తుంది. సినిమాల లో అయితే మాడ్యులేటర్స్ తొ మరింత బాగా మారుతుంది.

"నీ కదలకి కదలాడే" కరెక్టా? లేక "నీ కధలకి కదలాడే" కరెక్టా?
Quote this message in a replyReply

Post: #3
[అతడు]నా మనసుకి ప్రాణం పోసే నీ మనసుని కానుక చేసే
నిలిచావే ప్రేమను పంచి ఓ...||2||
[ఆమె]నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి
మదిగది తెరిచి పక్కేపరచి
ఉన్నావు లొకం మరచి ||నా మనసుకి||

చరణం 1

[అతడు]నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయే మాయే
నీ అడుగుకి ఆకులు పువ్వులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కధలకి కధలాడే హాయే హాయే
[ఆమె] అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక
సరస్సున అలజడులే సృష్టించావే ||నా మనసుకి||


చరణం 2

[అతడు]ఒక మాట ప్రేమగా పలకాలి
ఒక అడుగు జతపడి నడవాలి
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒకసారి ఒడిలో ఒదగాలె యెదపైన నిదరే పోవాలె
తియ్య తియ్యని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం
[ఆమె ]నీ ఆశలు గమనించానే నీ ఆతృత గుర్తించాలే
లెక్కతేలకా బదులియ్యకా మౌనంగా చూస్తూన్నాలే||నా మనసుకి||


Quote this message in a replyReply

Post: #4
మీ Voice బాగుంది. ఇంకా Tempo కరెక్ట్ గా లేదు, ఫరవాలేదు. ఇంకా ప్రాక్టీస్ చేయండి.
Quote this message in a replyReply

Post: #5
[అతడు]నా మనసుకి........................ప్రాణం పోసే నీ మనసుని కానుక చేసే (ఇక్కడ గమకం...తేడా పడింది....మరియు ట్రెంబుల్ వాయస్...అయినా ఫీలింగ్ తో వ్యక్తపరచాలి. ఇక్కడ భావ గమకం రావాలి. శృతి మధ్యమ నుంచి షడ్జమంలోకి రావాలి.)
నిలిచావే ప్రేమను పంచి ఓ.........................|2||
[ఆమె]నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మదిగది తెరిచి క్కేపరచి
ఉన్నా
వు లొకం మరచి ||నా మనసుకి|| (జతులు, స్వరగతి....జతిగతి ఆరోహణ...అవరోహణ తేడా గమనించాలి)

చరణం 1

[అతడు]నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయే (శృతి మారింది) మాయే
నీ అడుగుకి ఆకులు పువ్వులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కధలకి కధలాడే హాయే హాయే (వొత్తులు ఎగరగొట్టావు)
[ఆమె] అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక
సరస్సున (ఇక్కడ హలజడి అనే శబ్ధం ఉచ్ఛరించావు...అంటే అలజడి సృష్టించాలనుకొని నిఝంగా నువ్వు అలా పాడావా....Tongue) అలజడులే సృష్టించావే ||నా మనసుకి||

చరణం 2

[అతడు]ఒక మాట ప్రేమగా పలకాలి (వాయస్ మధ్యమ శృతి నుండి కిందకు దిగిపోయింది)
ఒక అడుగు జతపడి నడవాలి
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒకసారి ఒడిలో ఒదగాలె యెదపైన నిదరే పోవాలె
తియ్య తియ్యని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం
[ఆమె ]నీ ఆశలు గమనించానే నీ ఆతృత గుర్తించాలే
లెక్కతేలకా బదులియ్యకా మౌనంగా చూస్తూన్నాలే.......................

లా....లలలలలా.......................||నా మనసుకి||(తమ్ముడు మనవాడే అయినా ధర్మం చెప్పమన్నాడు మహా భారతంలో ధర్మరాజు) - ఈ సూక్తి స్ఫూర్తిగా...

ఉత్సాహవంతమైన నీయొక్క భావ ప్రకటన చాలా బాగుంది. పాట బాగుంది. అయితే పాట అనేది సమాజంలో అన్ని వర్గాలను అలరించాలి....అంటే పండిత, పామర జనాలను అన్నమాట.
అయితే...
మనం కేవలం....సాధారణ వ్యక్తులం. (అయితే కొందరిలో అంతర్లీనంగా దాగున్న....నిబిడీ కృతమైన తృష్ణను, కళను, సమాజ హితను ఎవరూ ఆపలేరు.)
అయితే మట్టిలో ఉండే మాణిక్యానికయినా....ముడిసరుకుగా దొరికే బంగారు రజనుకైనా మరింత మెరుగు పెడితే ఉజ్జ్వలంగా, జగజ్జేగీయమానంగా వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తుందనేది నిత్య సత్యం.

సాయి కృష్ణ గారూ మీరు పాడిన పాట మనసుకు హత్తుకున్నది.
అయితే....నేను మొదట ఒకసారి విన్నాను. బాగుంది అనిపించింది.
రెండవ సారి విన్నాను...బాగుంది అనిపించింది
(అలా రెండు సార్లు వినగానే బాగుందనిపించింది...అయితే అది సోదర ప్రేమతో అనిపించింది.)

కానీ పైన చెప్పాను కదా......ధర్మం ప్రకారం...నిజాయితీ చెప్పుతున్నాను
లైట్లు అన్నీ తీసేశాను. సౌండ్ కార్డ్ ను ఒకసారి చెక్ చేసుకున్నాను. నా ఇన్ స్ట్రుమెంట్స్ ను బాగా చెక్ చేసుకున్నాను. ఆ తరువాత మళ్ళీ ప్లే చేశాను
ఏదో మూల నేనూ కాలేజీ రోజుల్లో నేర్చుకున్నా...అతికష్టం మీద అబ్బిన సంగీత జ్ఞానంతో....చెపుతున్నాను.

ఎత్తుగడలో శృతి ......తర్వాత క్రమంగా తగ్గుతూ..హెచ్చుతూ...మద్యమం నుంచి షడ్జమంలోకి జారుతూ...మరలా ఆరోహణ నుంచి అవరోహణతో ముగించి...మరలా రివర్స్ ఆర్డర్ లో గమకం ఎత్తుకుంది.
కొన్ని భావ ప్రకటనాత్మకమైన జతి, శృతి కొంచెం తగ్గినా....వాచకం బాగుంది.
కొంచెం ఉచ్ఛారణ సరిచేసుకోవాలి. పాటగాడికి భాషా దోషాలు ఉండకూడదు. నిర్థుష్టంగా నేర్చుకొని పలకాలి. ఇక్కడ మనం పక్కాగా పెద్ద ప్లేయర్ కాకపోయినా...ఇవి దృష్టిలో పెట్టుకొని పాడితే....

నీ గొంతు ఇప్పటి తరం యువహీరోలకు సరిపోతుంది. లేదా డబ్బింగ్ ఫీల్డ్ లో నయినా సరిపోతావు. ఇది నా కరెక్ట్ జడ్డిమెంట్. అంతే. (Tongue మేము ఇలా విమర్ళించామని ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. బాగున్న పాటను మరింతగా ఎలా పాడాలో....సంగీత పద్ధతిని తెలియజేస్తున్నాము)

-----------------------------------------------------------------
శ్రీయుతులు ప్రసాద్ గారు చెప్పినట్లు...కొంచెం గాత్ర ధర్మాన్ని స్టూడియోలలో రికార్డింగ్ దశలో సరిచేయు అవకాశం ఉన్నా...సహజ సిద్ధమైన సంగీతమే సూర్యచంద్రులు ఉన్నంతకాలం వెలుగొందుతుంది. దీనికి ఉదాహరణ : శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, మహ్మద్ రఫీ గారూ. చిత్తూరు నాగయ్య గారు, వేమూరి గగ్గయ్య గారు, గోవిందరాజు వరద రాజుల సుబ్బారావు గారు. మంగళం పల్లి బాలమురళీ కృష్ణగారు. (మొదటి తరం)
వీరి తదనంతరం వచ్చిన గాన గాంధర్వుడు శ్రీ పతి పండితారాద్యుల బాల సుబ్రహ్మణియన్ గారు. (రెండవ తరం)
అంతే......సంగీత సీమలో....ఈ రెండు తరాలే....తరువాత పరిణామం అందరూ గమనిస్తూనే ఉన్నాము.
------------------------------------------------------------------

కొసమెరుపు : ఈ కధనంతో ఎవరికన్నా కొంచెం బుర్ర హీటెక్కితే....మరలా సాయికృష్ణ గారు పాడిన పాటను వినండి. మనసు ఉల్లాసవంతమవుతుంది.TongueSmile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)