Post: #1
mana blog visitors ni penchukuneduku tips telupagalaru
Quote this message in a replyReply

Post: #2
Dear Suresh ...
మీరు ఫోరమ్ లో ఉన్న పోస్టులు అన్నీ చదివారా...లేకపోయినా కనీసం కొన్నయినా చదివారా.....అందులో నిపుణులు ఇచ్చిన అనేక సూచనలు, మార్గదర్శకాలు ఉన్నాయి.
ఉదాహరణకు : mn48 గారు చెప్పినట్లు....బ్లాగ్ లో విషయ వివరణ ఉంటే...సత్తా ఉంటే....మీ బ్లాగ్ విజిట్ చేసే వారు ఆటోమేటిక్ గా వస్తారు. కాకపోతే మీ బ్లాగ్ ను మీరు
ప్రమోట్ చేసుకునే విధానంపై మీ బ్లాగ్ ఎందరికి చేరుతుంది...ఎలా చేరుతుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి సునిశితమైన, సరళమైన సమాధానాలు మీ దృష్టికి
వచ్చి ఉండాలి. ఏదేమైనా మీరు ఒకసారి సెర్చ్ ఆప్షన్ ద్వారా ముందు జాగ్రత్త చర్యగా పరిశీలించండి. ఇది మా సూచన మాత్రమే. మీరు తప్పకుండా ఇవన్నీ పాటిస్తారని....
ఆశిస్తాము. Any how good question. go a head.
Quote this message in a replyReply

Post: #3
sumani venkat gaaru,
ee forum lo evarayina "thanks" "avunu" laanti reply ichina kuda post kinda lekka pedutunnaru..
alaa kakundaa, real gaa useful post ichinapudu matrame post krinda vachettu chudagalaru..
idhi naa request maatrame.
Quote this message in a replyReply

Post: #4
(23-Aug-2009 10:08 AM)nagul Wrote: You are not allowed to view links. Register or Login to view.sumani venkat gaaru,
ee forum lo evarayina "thanks" "avunu" laanti reply ichina kuda post kinda lekka pedutunnaru..
alaa kakundaa, real gaa useful post ichinapudu matrame post krinda vachettu chudagalaru..
idhi naa request maatrame.

nagul గారు

మీరన్నది నిజమే. మీతో ఏకీభవిస్తూ మినిమమ్ పోస్ట్ లెంగ్త్ ను 10 మాటలు లేదా 100 అక్షరాలకు సరిపడేవిధంగా సెట్ చేయవలసిందిగా ఫోరం అడ్మిన్ లను కోరుతున్నాను. అపుడు ఇలాంటి పొడి పొడి మాటలు, అర్ధవంతంగా లేకుండా కేవలం పోస్ట్ ల సంఖ్యను పెంచుకోవటానికే పోస్ట్ లు చేసేవారి ప్రవర్తనకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు.
Quote this message in a replyReply

Post: #5
సురేశ్ , మీరు ఎలా అయితే మీ బ్లాగుకి ప్రాచుర్యం కలిగించాలని అనుకుంటారో అలాగే అందరు
బ్లాగర్లూ , సైటు నిర్వాహకులూ అనుకుంటారు . విషయ వివరణ గురించి మన సుమణి వెంకట్
చెప్పారు కదా . అలాగే ప్రాచుర్యం పొందిన తెలుగుబ్లాగులని అప్పుడప్పుడూ You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view.
వంటి బ్లాగు అగ్రిగేటరులలో గమనిస్తూ ఉండండి . మీరు బ్లాగరుగా లాగిను అయి మీకు నచ్చిన
బ్లాగులలో తరుచూ తగిన వ్యాఖ్యలు చేస్తూ ఉండండి (కేవలం ధన్యవాదాలు వంటివి రాయవద్దు) .

మీ తెలుగు బ్లాగులలో తగినంత విషయ వివరణ ఉన్నట్లయితే మీ బ్లాగులని కూడా బ్లాగు
అగ్రిగేటరులకి జోడించండి { గమనిక : ఇతర సైటుల లింకులు ఎక్కువగా ఉన్న బ్లాగులని ,
అలాగే చట్ట విరుద్ధ విషయాలు , అశ్లీల లంకెలు ఉన్న వాటిని నిర్వాహకులు తొలగిస్తారు }

బ్లాగు / సైటు డిజైను చూడటానికి ఇంపుగా ఉండాలి . అందరూ ఉపయోగించే టెంప్లేటుని
కాకుండా వీలుంటే ఒక కొత్త నమూనా కోసం ప్రయత్నించాలి . అయితే ఎక్కువ హంగులు
ఉండకుండా పేజి లోడింగుకి ఎక్కువ సమయం పట్టకుండా ఉండాలి . ఫ్లాష్ ఏనిమేషనులు
& ఇతర బొమ్మలు వీలైనంత తక్కువ మెమరీ సైజులో ఉండాలి . బ్లాగు / సైటు నేవిగేషను
సులువుగా ఉండాలి . వాణిజ్య ప్రకటనలు వీలైనంత తక్కువ ఉండాలి . అలాగే బ్లాగు లో
మెదటి పేజీ మరీ ఎక్కువ పొడవైనదిగా ఉండరాదు . మెయిను పేజీలలో సంక్షిప్త టపాలు
(సుమారు 5 ) వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి ( with "Read More ..." Links )

... ఇలా పాటించవలసిన సూచనలు చాలా ఉంటాయండీ Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)