Post: #1
మిత్రులారా...
మీరెప్పుడన్నా గమనించారా...!!

దేశం నలుమూలల నుంచి తిరుమల తిరుపతికి వచ్చే భక్తులు ఒకప్పుడు దర్శనం కోసం క్యూల్లో నిలబడి కంపార్టుమెంట్లలో మగ్గిపోతూంటారు. ఒక్కొక్క కంపార్టుమెంటు నిండగానే...ఆ కంపార్ట్ మెంట్ ను తాళాలతో క్లోజ్ చేసి అక్కడే టివి లలో మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ...మధ్య మధ్య లో సమయానుకూలంగా ప్రసాదాన్ని ఉచితంగా (పులిహోర ఎక్కువగా) పంపిణీ చేస్తూ....అక్కడ కంపార్టుమెంట్ లో నల్లని బ్లాక్ బోర్డు మీద దర్శనం సమయం మరియు తేదీ వ్రాస్తూ వచ్చేవాళ్ళు. (ఈ అనుభవం చాలా మందికి ఉంటుందని అనుకుంటున్నాను.)

కానీ....ఇప్పుడు పెరిగిన సాంకేతికత వలన ‘‘సుదర్శనం’’ అనే కంకణం భక్తులను రక్షించటానికి వచ్చింది. ప్రతి భక్తుడికీ ఓ నిర్ణీత సమయం కేటాయించి...ఆ సమయానికి క్యూలోకి వచ్చేలా చేస్తే.....వారికి ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు......అంటే... ఫిజికల్ క్యూ బదులు వర్చ్యువల్ క్యూ అన్నమాట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది....అలా భక్తుల చేతికి కట్టే సుదర్శనం కంకణానికి గాను ఏ మెటీరియల్ వాడతారో తెలుసా....?
‘‘టఫెటా’’ (షర్టు కాలర్ లలో వాడతారు. మరియు టైలరింగ్ షాప్ వాళ్ళు మెడమీద కరెక్ట్ గా పూసమీద వారి షాప్ ప్రచారంలా....ఫలానా షాప్ లో కుట్టినది అని తెలియజేసే ఒకానొక చిన్న క్లాత్ మెటీరియల్....ఆ మెటీరియల్ అన్నమాట.)

(మొదట్లో నేను అంత పరిశీలనగా చూడలేదు కానీ....ఒకసారి పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత అర్థమయ్యింది. చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్.)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)