Post: #1
మిత్రులారా...!!

ఇప్పటిలా ఒకప్పుడు ఆధునిక ప్రయాణ సాధనాలు లేనందున కాలినడకన కొందరు బ్రాహ్మణులు అడవి మార్గముగా శ్రీశైలంలోని మహేష్ యస్సస్సార్ గారి ఇంటికి వెళ్ళడానికి ప్రయాణిస్తూన్నారు. అయితే నడిదారిలో దొంగల సమూహం ఒకటి అడ్డగించి....అందులో పెద్ద విలన్...అదేనండీ...దొంగల నాయకుడు ‘‘వీళ్ళందరినీ బంధించండి’’....బంధించి తీసుకొని మన గుహ లోనికి తీసుకురండి....’’ అని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణులు ఎంత బతిమాలినా కూడా దొంగల హృదయాలు కరుగలేదు. (కరిగితే వారు దొంగలెందుకవుతారు ?) దొంగలు వారిని దగ్గరలో ఉన్న గుహలోనికి తీసుకెళ్ళారు. అయితే అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది. అక్కడకు బ్రాహ్మణులను లాక్కుపోయి...బాధిస్తూ ఉన్నారు. ఇంతలో....
ఫెళ...ఫెళ....మెరుపులు...ఉరుముల శబ్ధం...హోరున గాలి....గుహలోని అమ్మవారు ప్రత్యక్షమై, ‘‘మీలో సగము మంది నాకు బలి అయిపోండి. లేకపోతే మిమ్మల్ని అందరినీ తినేస్తాను.....నేనొదలా......!! ఒర్రేయ్...ఆ...హు.....హ్హ..హ్హ...’’ అని అనేసరికి....

దొంగలు ఉన్నది 15 మంది. బ్రాహ్మణులు కూడా 15 మంది. కరెక్ట్ గా ఉన్నారు. మరి బలి కావలసింది ఎవరు...????
ఇంతలో.....దొంగలందరినీ బలి ఇచ్చి....బ్రాహ్మణులందరినీ బ్రతికించాలని ఒక బ్రాహ్మణుని ఎత్తు. ఆయన పేరు సువర్ణ ఘంటాభిషేక బిరుదాంకిత శ్రీను గారు. అందుకే....అమ్మవారితో ఇలా అన్నాడు. ‘‘తల్లీ నీవు అచ్చంగా బ్రాహ్మణులనుగాని, అచ్చంగా దొంగలను గాని బలిగొనుట ధర్మము కాదు. మీకిది న్యాయము కాదు. మేమందరం వరుసగా నిలుచొని ఉంటాము. నీవు లెక్క వరుసను ప్రతివరుసలోను తొమ్మిదవ వానిని బలి తీసికో...’’ అని అన్నాడు.
చివరికి ఈ విధముగా అందరినీ లైన్ లో నిలబెట్టి...బ్రాహ్మణులందరి ప్రాణములు నిలిపినాడు. దొంగలందరి ప్రాణములు తీసినాడు. (అద్గదీ తెలివంటే....!)
ఏ వరుస ప్రకారము అందరను నిలబెట్టినాడు....?
Quote this message in a replyReply

Post: #2
మిత్రులారా....!!
చెప్పేస్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్....
బ్రాహ్మణులు X గుర్తుగా అనుకుందాం
దొంగలు O గుర్తుగా అనుకుందాం.....

వారిని ఈ విధంగా వరుసలో నిలబెట్టి....
అందరి బ్రాహ్మణుల ప్రాణాలు నిలబెట్టి....
రక్షకుడు అయ్యాడు....

X X X X O O O O O X X O X X X O X O O X X O O O X O O X X O
Quote this message in a replyReply

Post: #3
mee ans baagundi kaani indulo logic chepte inkaa baaguntundi . nenu tappakundaa maa pillalaku cheptaanu first naaku teliyaali kadaa
Quote this message in a replyReply

Post: #4

బావుంది పరిష్కరం ...


అలాగే ఆ బ్రహ్మలందరు అసలు ఎందుకు శ్రీశైలం వెళ్ళాలనుకున్నారో  అది కూడా చెపితే మొత్తం క్లియర్ గా - ఇంకా గమ్మత్తుగా ఉండేది కదా సుమణీ వెంకట్ గారూ....

ఆల్లంతా తర్వతెక్కడికెళ్ళారో  చెప్పండి సుమణి వెంకట్ గారూ....


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)