Post: #1
మిత్రులారా...!!

వాస్తవంగా మా చిన్నతనంలో జరిగిన విషయం జ్ఞప్తిలోనికి వస్తే...పోస్ట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో తెలుగు మాస్టారూ....మా ‘‘స్టారూ’’ ఆశీర్వచనం కోసం వెళ్ళినప్పుడు...ఇలా ఆశీర్వదించారు. (ఎందుకంటే...కాలేజీ ఫస్ట్ వచ్చాను కాబట్టి.)

ఆలినొల్లకయున్న వానమ్మ మగని
నందు లోపల నున్న వానక్క మగని
నమ్మి నాతని జెరుచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణ తోడ....


ఇలా ఆశీర్వదించారు. నాకు అర్థం తెలీకపోయినా డైరీ లో నోట్ చేసుకున్నాను. (ఒకరకంగా ఏమిటీ...ఈయన ఇలా తిడుతున్నారు అనుకున్నా ఒకానొక దశలో...అర్ధం తెలియకున్నప్పుడు)
అర్థం తెలిసినప్పుడు....వాహ్....పదాలతో ఇలా ఆడుకోవచ్చా...అని అనిపించింది. (అంతే కదా కత్తికి రెండు ప్రక్కలా పదును ఉంటే...అంతే.)

ఇంతకీ అర్థం ఏమిటో.....!!
:huh::huh::huh::huh:
Quote this message in a replyReply

Post: #2
ఆలినొల్లకయున్న వానమ్మ మగని
నందు లోపల నున్న వానక్క మగని
నమ్మి నాతని జెరుచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణ తోడ....

ఆలిని ఒల్లకుండా ఉన్నవాడు భీష్ముడు...అతని తల్లి గంగాదేవి. గంగాదేవి భర్త సముద్రుడు. సముద్ర గర్భంలో ఉన్నవాడు పర్వతుడు మైనాకుడు. అతని అక్క పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క భర్త శివుడు. శివుడిని నమ్మి కొలిచేవాడు రావణాసురుడు. అతను చెరపట్టినది సీతమ్మదేవిని. సీతమ్మ దేవి యొక్క తల్లి భూదేవి. భూదేవి యొక్క సవతి లక్ష్మీ దేవి.

.........అంటే....లక్ష్మీ దేవి ఎల్లప్పుడు వరిస్తూ...కరుణతో సిరులు ఇస్తూ...విజయవంతులుగా చేస్తుంది అని ఆశీర్వచనం ఇచ్చారన్నమాట. ఇదన్నమాట సంగతీ...!!
Quote this message in a replyReply

Post: #3
namaskaram sumanivenkat gaaru

naa dagara anta knowledge ledu gaani but nenu naa life lo ilanti savallanu edurukoledu so chaala badhaga anipistundi naaku
Quote this message in a replyReply

Post: #4
Sumani Venkat Garu,

Modata College first vachinanduku meeku belated congratulations.

poem chaala baagundandi.

aa poem inkonchem easy gaa vunte vachi vundedi. ( ICET class lo Blood Relations Problems Solve chesinatlu anipinchindi naakite )

kaani meeru solution cheppaka aa poem inka nachindi.

Thank u very much to share this wonderful informatic logical poem with us and belated congrats also to got college first.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)