Post: #1
కొంచెం ఉపోద్ఘాతం :

విజయవిలాసం అనే కావ్యంలోని కధానుగుణంగా తెలియజేస్తున్నాను.
అర్జునుడు స్నానం చేసి వస్తూండగా ఉలూచి అనే నాగకన్య అర్జునుడి అందాన్ని చూసి, అతడి శరీరపు ఇంద్రనీలమణి కాంతికి అబ్బురపడి, ‘‘ఆహా..ఓహో..ఓహోహో...’’ అని తలూపుతుంది.

ఈ సందర్భాన్ని వర్ణిస్తూ చేమకూర వేంకట కవి...ఇలా అంటారు :

‘‘సవ్యసాచి....ఇంద్రోపలరాలోచి జూచి తలయూచి, యులూచి రసోచితంబుగన్’’


ఇప్పుడు మేధాశక్తి పోటీలోకి వద్దాం.
ఇప్పుడు అడగబోయే ప్రశ్నఏమటంటే...ఇందులోని మర్మం ఏమన్నా ఉన్నదా....(అన్ని కోణాల్లోనూ ఆలోచించండి...)

కరెక్ట్ గా చెప్పిన వారికి వీరతాళ్ళు బహూకరించబడును. మాయాబజార్ లో యస్వీరంగారావుగారు, రమణా రెడ్డి చేతుల మీదుగా.....Tongue

చిన్న హింట్ : ఆల్ రెడీ సమాధానం కూడా ఇందులోనే ఉంది.
Quote this message in a replyReply

Post: #2
మిత్రులారా...!!
చెప్పేస్తున్నాను. మర్మం విప్పేస్తున్నాను.
సవ్య సాచి అన్నప్పుడు కనుబొమ్మలు పైకి లేస్తాయి...
ఇంద్రోపలరాలోచి....తల ఊగుతుంది పై నుండి కిందకు.
జూచి...తల ఊగుతుంది.
తలయూచి...తల ఊగుతుంది.
యులూచి...తల కింద నుండి పైకి లేస్తుంది.
రసోచితంబుగన్....తల ఆసాంతం అటూ ఇటూ ఊగుతుంది.

............అంటే చేమకూర వేంకట కవి గారూ చేసిన చమత్కృతి ఇది....
హీరోయిన్ ఉలూచితో పాటు మనల్ని కూడా భాగస్వామిని చేశారన్నమాట. తల ఊపటంలో.....!!
(ఇది కొంత గాఢమైన భావాభినివేశం కలిగి ఉన్న విషయం కనుక మేథా శక్తిలో ప్రస్తావించటం జరిగింది.)
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)