Post: #1
‘‘ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా
పాగిపోతే చాలు’’ అన్న మామూలు స్థాయి నుంచి
‘‘నాక్కావలసిందేదో నేను సాధించి
తీరతాను’’ అన్న ఆలోచనా స్థాయికి వెళ్ళడం - ఆరోహణ

పర్వతారోహణ చేసేవాళ్ళను చూడు
నీలి నీలి మేఘాల అవరోహణ చూడు
(అంటే పర్వతం ఆరోహణ చేసేటప్పుడు మేఘాలు కూడా అందుతాయి. కిందకు వెళ్ళిపోతాయి అవరోహణ చేస్తాయి కదా.)
బ్రతుకులోని ముళ్ళను చూడు..
నిజాన్ని నిర్భయంగా చూసే కళ్ళను చూడు....
ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని,
ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం...
పనిచేస్తూ...
ఆ పనిలో ఆనందం పొందేవాడు..చూడు
తన సమస్యను పరిష్కరించుకోవడంలో...
నిష్పాక్షికంగా, నిస్సంకోచంగా...
తన పట్ల...తానే నిర్ధాక్షిణ్యంగా కూడా ఆలోచించి
నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి కలిగి ఉన్నవాడు...చూడు...!!

కళ్ళుండి చూడలేని వాళ్ళను చూడు...
కళ్ళు లేకున్నా లోకాన్ని అద్భుతంగా చూసే వాళ్ళను చూడు...

తన గురించి మనస్సుతో ఆలోచించి...
పరుల గురించి హృదయంతో ఆలోచించే వాడే...
మానవతా మూర్తి.
ఇస్తుంది స్పూర్తి.
నిలుస్తుంది కీర్తి.
నవ్య భవితవ్యానికి నీవే చక్రవర్తి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)