Post: #1
మిత్రులారా...!!
భోజరాజు దగ్గరకు శనీశ్వరుడు, ఆది శక్తి వచ్చారట.
మా ఇద్దరిలో ఎవరు అందగాళ్ళో చెప్పమన్నారట.
విడవమంటే...పాముకు కోపం.
కరవమంటే...కప్పకు కోపం.
మరేమిటి పాపం...
ఏమీ తోచని భోజరాజు...
కాళిదాసుని ఆశ్రయించాడు....
అప్పడు ఆయన ఏం చేశారయ్యా ...అంటే...
అందాల పోటీ పెట్టినట్టుగా కాళిదాసు...
ఒకరి తరువాత ఒకర్ని లోపలికి రమ్మన్నాడట.
శని వచ్చి వెళ్తూంటే, శక్తి ప్రవేశించిందిట.
ఆ తర్వాత కాళిదాసు తన న్యాయ నిర్ణయం చెప్తూ...
‘‘వెనుకనుంచి శని, ముందు నుంచి శక్తి బావున్నారు’’ అన్నాడట.
కరతాళ ధ్వనులతో సభ మార్మోగిపోయిందట.
‘‘వెళ్తున్నప్పుడు శని బావుంటాడు’’
‘‘వస్తున్నప్పుడు ధైర్య లక్ష్మి బావుంటుంది’’
సమస్య అనే శనిని పారద్రోలాలంటే....
ధైర్యం కావాలి.
ధైర్యం రావాలంటే...
మన మీద మనకు నమ్మకం ఉండాలి.
మన మీద మనకు నమ్మకం రావాలంటే...
మనకు శక్తి ఉండాలి.
శక్తి అంటే...శారీరక శక్తి గానీ...మానసిక శక్తి గానీ....
శారీరక శక్తి ఎంత ఉన్నా...
మానసిక శక్తి లేకున్నా...
బ్రతుకంతా సున్నా...
రెండు శక్తులూ ఉండాలన్నా...
మనస్సు పెట్టి ఆలోచించాలన్నా...
మనల్ని మనం గెలుచుకోవాలి.
అప్పుడే ఎదుటి వారిని గెలువగలుగుతాము.
మనం గెలవాలంటే...
ఎదుటి వారు ఓడిపోవాలి....
వారిని ఓడించి...
గెలిచే గెలుపు....
మన జీవితానికి మలుపు...
విజయానికి పిలుపు...
అపజయానికి అలుపు...
అయితే....
ఎదుటి వారిని గెలిపిస్తూ...
మనమూ గెలుస్తూ....
నిరంతరం సాగుతూ....
ఉంటే ఆ జీవితం ఎంత మధురమో ఆలోచించండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)