Post: #1
మిత్రులారా...!!
ఒక మంచి మాట...

‘‘అసలు ఈ ప్రపంచంలో ఇంత ఉన్నదా...!! అని అనిపిస్తుంటుంది....అప్పుడప్పుడూ...
అనుభవించని ఆస్తి ఇంత ఉన్నదా....!! అనిపిస్తూంటూంది...ఎప్పుడెప్పుడైనా
....ప్రకృతిని గమనిస్తూంటే...
వివరణ లోకి వెళదామా...!!

అందరికీ అర్థం కావటం కోసం ఉదాహరణతో ప్రారంభిస్తున్నాను....
ఒక అడవిలో మీరు ప్రయాణం చేస్తున్నట్లు ఊహించుకోండి.
అబ్బ...ఎన్ని చెట్లు...
ఎన్ని లతలు...
ఎన్ని జలపాతాలు...
ఎన్ని జల, తరుణ, నిధి, నిక్షేపాలు,
ఎవరికీ సొంతంగాని అడవి పూలనీ,
నీటినీ, ఖాళీ స్థలాల్ని చూస్తుంటే...
మీకేమనిపిస్తుంది..?

సరీగ్గా ఉపయోగించుకోగలిగితే....
ఇక్కడ ఇంత సంపద ఉన్నదా అనిపించదూ....!!

ఇప్పుడు వ్యావహారికంలోకి వద్దాం...!!
‘‘అసలీ ప్రపంచంలో ఇంత ఉన్నది’’ అన్న ఆలోచనే...నమ్మకమే...దీని పేరే...స్పృహ.’’
ఈ ప్రపంచంలో ‘సంపద’ చాలా ఉంది.
బిల్ గేట్స్ చూపు పడేవరకూ ఎలక్ట్రానిక్స్ రంగంలో అంత సంపద ఉన్నదనీ...
ఎవరికీ తెలీదు కదా....!
దీనినే ఆర్థిక స్పృహ...అంటారు.

ఇప్పుడు మరింతగా సాంఘిక సంబంధాల విషయానికొద్దాం...!!

ఒక వ్యక్తి తన కుమారుని పుట్టిన రోజుకు ముందు రాత్రి కొన్ని (ఇక్కడ లెక్క చెప్పలేదు...ఇన్ని అని) బహుమతుల్ని ఇంట్లో, వేర్వేరు ప్రదేశాల్లో దాచి పెడతాడు. పుట్టిన రోజునాడు కొడుకు లేవగానే ఆ విషయం చెపుతాడు. కొడుకు అమితమైన ఉత్సాహంతో ఇల్లంతా వెతికి...ఉదాహరణకు : మూడు బహుమతులు సంపాదించుకుని తండ్రికి చూపిస్తాడు....(అచ్చంగా...ఇప్పడు టీవీ ఛానెల్స్ వాళ్ళు పెడుతున్న ట్రెజర్ హంట్ (నిధి ఎక్కడుందో కనుక్కోండి..) లాంటి ప్రోగ్రామ్స్ లాంటివన్న మాటSmile)
అయితే తండ్రి ‘కేవలం మూడు బహుమతులే కనుగొన్నావా...నేను ఇంకా చాలా దాచాను. కనుక్కో’’ అని ఇంకా ఉత్సాహ పరుస్తాడు. కొడుకు ఇంకా కష్టపడి మరో రెండు బహుమతులు సంపాదిస్తాడు.
యధావిధిగా తండ్రి కొడుకుతో...‘‘నీకోసం మొత్తం పది బహుమతులు నీకోసం దాచాను’’ అని చెప్పగానే...కొడుకు అమితమైన...ఆనందాశ్చర్యాలతో...అత్యంత ఉల్లాసంగా...ఉత్సాహంగా...వెతికి..వెతికి...మరీ మొత్తం పది బహుమతులూ సంపాదిస్తాడు.

ఇక్కడ గమనించండి : మానవ మనస్తత్వం : తండ్రిగానీ...కొడుకుతో తను మొత్తం పది బహుమతులు తెచ్చినట్లుగా చెప్పకపోతే....కొడుకు కేవలం మూడు బహుతులకో...లేక మరో రెండు బహుమతులు కలిపి మొత్తం ఐదు బహుమతులతోనో....సంతృస్తి పడి ఉండేవాడు.
గమనించండి...
ఇక్కడితో ఆగిపోవటం...సంతృప్తి నిస్తుంది.
కానీ...నిరంతరం శోధన ‘‘ఆనందాన్నిస్తుంది’’.
తండ్రి కొడుకుతో ఇక్కడ పది ఉన్నాయని చెప్పిన తరువాత కొడుకు వాటిని వెతికి పట్టుకున్నాడు.
ఈ ప్రపంచంలో కేవలం పదే కాదు..ఎన్నో అవకాశాలున్నాయి.
ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
అయితే...కావలసింది...కూసంత స్పృహ.
‘‘వేదంలా ఘోషించే గోదావరి’’ అన్నాడో...కవి
‘‘తరలిరాద..తనే వసంతం...’’ అన్నాడో..కవి
మన చుట్టూ ఉన్న మామూలు విషయాల్లో కూడా...
ఈ విధంగా ఆశావాదాన్ని ఊహించటం..మానవీయ స్పృహ.

ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం...:

పైన చెప్పిన విషయాలను కళ్ళతో కాదు....మనసుతో చదవండి...!!
మనం బ్రతికేది మనకోసమే కాదు పరులకోసం..పరుల హితం కోసం తెలియటం లేదూ...
ప్రకృతిలో గానీ...దైనందిన జీవితంలో గానీ..అనుభవించబడని ఆస్తి చాలా ఉందని తెలియడం లేదూ...
ముఖ్యంగా ఈ ఫోరమ్ లో ఎన్నో వనరులు ఉన్నాయని తెలియడం లేదూ...

అయితే ప్రతి అంశాన్ని శోధించి...కనుగొనే క్రమంలో ఎంత అలసిపోని ఆనందాన్ని పొందవచ్చో..
మనం ఏమీ చేయనక్కరలేదు...కేవలం..ఉదాహరణలో తండ్రి లాగే...మనమూ...మన వీలైనంతగా
మన బంధువులకు, మిత్రులకు, మన సహచరులకు, విజ్ఞానాభిలాషులకు, సాంకేతిక పరమైన అవగాహనకోసం ప్రయత్నించే నూతన వ్యక్తులకు.....మరియు సలహాలకు, సందేహ నివృత్తి కోసం..
ఇక్కడ...మన ‘‘మహిగ్రాఫిక్స్ ఫోరమ్స్’’ అనేది ఒక వనరుగా ..(ఒక ట్రెజర్ హంట్ గా) ఉందని అందరికీ...తెలియజేయడం మనకు అంత కష్టమైన పని కాదనుకుంటా....!!

ఇచ్చట ఉన్న ప్రతి అంశం ఏదో ఒక రూపంలో మనల్ని స్పృశించి వెళుతున్నదే...మనల్ని ఆస్వాదించమని చెపుతూ వెళుతున్నదే...సందేహాలను తీర్చుకోమంటుంది....సందేహాలను అడగమంటుంది...అలాగే..ఇతరులకూ తెలియజేయమంటుందీ....అదీ...సామాజిక స్పృహ.

మనందరం కలసికట్టుగా ఒక మంచి పని చేద్దాం...
ఈ ఫోరమ్ గురించి మరింత విస్తరణ కోసం...
మన పరిధిలో కృషి చేద్దాం...!!

ఎన్నో అద్భుతమైన అంశాలు పొందుపరచబడి ఉన్న ఫోరమ్ లోకి అడుగిడమని చెప్పండి. అప్పుడు వారికే తెలుస్తుంది. ఇక్కడ ఇంత సంపద ఉన్నదా...అని....!!

బిల్ గేట్స్ ఒక వాణిజ్య సదస్సు లో ఇలా అన్నారు : ‘‘నేను ఈ శతాబ్ధంలో, ముఖ్యంగా ఈ దశాబ్ధంలో జీవిస్తూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఎంతో అదృష్టవంతుడిగా కూడా భావిష్తున్నాను. ఎందుకంటే...ఇప్పుడున్నన్ని అవకాశాలు, గతకాలపు వ్యక్తులకి ఉండేవి కావని నాకు నిశ్చయంగా తెలుసు. ఉదా : కోతి నుంచి మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలయింది. నిలువుగా నిలబడటం..చేత్తో ఆయుధం పట్టుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచీ...ప్రస్తుతం వరకూ మనిషిలో జ్ఞానం ఎలా పెరిగిందో గమనించండి. మొదట్లో...ఎంతో స్లో...............గా ఉన్న జ్ఞానం, ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో గమనించండి. ‘చక్రం’ ద్వారా బండి తయారు చేయవచ్చని తెలుసుకోవటానికి మనిషికి 19,88,000 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత కేవలం 14 వేల ఏళ్ళలో రైలు తయారు చేశారు. ఆ పైన కే.....వ.....లం......అరవై ఏళ్ళకి - గంటకు 18000 మైళ్ళ వేగంతో ప్రయాణించే రాకెట్ ని కనుక్కున్నాడు మనిషి. సైన్సు, తెలివితేటలూ, ఎంత వేగంగా అభివృద్ధి చెందాయో గమనించండి. రాకెట్ కన్నా వేగంగా మనిషి జ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఇంత కన్నా బాగా జీవించటం ఎలా...? అని మనిషి నిరంతరం శోధిస్తూనే ఉన్నాడు. ఎక్కడా సంతృప్తి పడి ఆగిపోలేదు. తాను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కదా అని మనిషి అప్పట్లో...గుర్రాన్ని కనుక్కోగానే అనుకుని వుంటే....మానవజాతి చరిత్ర అక్కడే ఆగిపోయేది...ఇంత వేగంగా ప్రపంచంతో పాటూ మనమూ పరుగెడితేనే మనుగడ...!! అప్పుడే సుఖంగా బ్రతకగలం’’ ........

మిత్రులారా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే...మాటలకందని అందమైన భావం కనపడుతుంది...కదా...!!

మిత్రులారా...స్పూర్తి చెందటంతో ఆగిపోకుండా....
అందరూ తమ తమ వంతు కృషిగా ఈ ఫోరంలో ఉన్న వనరులను...అందరికీ తెలియజేయండి...
విజ్ఞాన ఫలాలను అందరికీ పంచుదాం..రండి...తరలిరండి.
మల్టీ మీడియా రంగంలో ఉన్న సంపదనంతా పంచుకుందాం...రండి.
ఈ ఫోరం మీది. మనందరిది.
Quote this message in a replyReply

Post: #2
yes yes Venkat Garu, it is heart touching
than Q
Quote this message in a replyReply

Post: #3

chala chala baga rasaru sir,

heart ki touch ayyindhi sir

it's a very good post sir.

Quote this message in a replyReply

Post: #4

Sumani Venkat garu mee aasayaaniki yellappudu naa sahaya sahakaaralandistaanani maatistu mee ........ K I R A N .

Quote this message in a replyReply

Post: #5
u r great sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)