Post: #1
ఈనాడు దినపత్రిక నుండి :

Quote:[info]
'టెక్‌సేతు'లో తెలుగు వెలుగు!
'కంప్యూటర్‌ నేర్చుకోవడం కష్టమే.. ఎందుకంటే నాకు ఇంగ్లీషు రాదు..' అంటూ నిరుత్సాహ పడేవారికి.. వెన్నుతట్టే ప్రయత్నమే 'టెక్‌సేతు'! ఇది కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని.. తెలుగులో అందిస్తోంది! హైదరాబాద్‌ యువకుల రూపకల్పనలో.. తెలుగు వెలుగులు పంచుతోంది!
కంప్యూటర్‌ను ఇంగ్లీషులోనే వాడాలనుకునే రోజులు పోయాయి. చైనా, జర్మనీ, జపాన్‌ లాంటి దేశాలే ఇందుకు ఉదాహరణ. ఆయా దేశాలు కంప్యూటింగ్‌ టెక్నాలజీలను మాతృభాషల్లోనే మార్చుకుని సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారనేది చూస్తూనే ఉన్నాం. మన దేశంలో కూడా వివిధ ప్రాంతీయ భాషాల్లోనూ ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు గోపాల్‌కృష్ణ, గవేష్‌ 'టెక్‌సేతు' సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. వికాస్‌, శ్రీనివాసరావు అనే మరో ఇద్దరు యువకులు సాంకేతికంగా సహకారాన్ని అందిస్తున్నారు.

చదువు, ఉద్యోగాల్లో బిజీగా ఉంటూనే ఈ నలుగురు యువకులు అమ్మ భాషలోనే కమ్మని కంప్యూటర్‌ విజ్ఞానాన్ని అందిస్తామంటున్నారు. టెక్నాలజీ ఫలాలు అట్టడుగుస్థాయి వరకూ చేరాలంటే మాధ్యమం మాతృభాషలోనే ఉండాలనే ఉద్దేశంతో వీరు రూపకల్పన చేస్తున్న 'టెక్‌సేతు' వివరాల్ని తెలుసుకుందాం!

కంప్యూటర్‌కి సంబంధించిన ప్రాథమిక అంశాల దగ్గర్నుంచి, కొరుకుడు పడని సాంకేతిక విషయాల వరకూ అన్నింటినీ తెలుగులో అందించాలనే ప్రయత్నం 'టెక్‌సేతు'లో కనిపిస్తుంది. పెద్దగా చదువుకోని వారికైనా, ఆంగ్లంతో అంతగా పరిచయం లేనివారికైనా కంప్యూటర్‌ వాడకం, ఇంటర్నెట్‌ విహారాల గురించి అవగాహన కలిగించేలా ఇందులో విభాగాలను చేర్చారు. కంప్యూటర్‌ వాడకంలో తలెత్తే సందేహాలకు ఇక్కడ తెలుగులోనే సమాధానాలు దొరుకుతాయి. వివిధ అంశాలకు సంబంధించి పాఠ్యాంశాల రూపంలో సమచారాన్ని పొందుపరిచారు.

పేజీకి పై భాగంలో ప్రాథమికాంశాలు, అంతర్జాలం (ఇంటర్నెట్‌), లినక్స్‌, విండోస్‌, మా సంకల్పం, సంప్రదించండి మెనూలతో సమాచారాన్ని విభజించారు. పేజీకి ఎడమ వైపు ఇటీవలి పాఠ్యాంశాలు, ఇటీవలి వార్తలు, మార్గదర్శి, పుస్తక మార్గదర్శి, పాత సంచికలు పేర్లతో మెనూలను ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాల ద్వారా కంప్యూటర్‌ వాడకానికి సంబంధించిన వివిధ అంశాల్ని వ్యాసాల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు. లినక్స్‌, విండోస్‌ల్లో తెలుగును ఎలా వాడచ్చో కూడా సవివరంగా తెలియజేస్తున్నారు.

సమస్యల్ని పంపండి
కంప్యూటర్‌ వాడకంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాలకు ఇంటరాక్టివ్‌ పద్ధతిలో జవాబులు లభించేలా ఏర్పాటు చేయడం విశేషం. పేజీకి పైన ఏర్పాటు చేసిన మెనూబార్‌లోని 'సంప్రదించండి'ని క్లిక్‌ చేసి మీ సందేహాల్ని టెక్‌సేతు నిర్వాహకులకు పంపొచ్చు. అందుకోసం మెనూలోకి పేరు, ఈ-మెయిల్‌, విషయం, సందేశాన్ని టైప్‌ చేసి 'ఈమెయిల్‌ పంపించు'పైన క్లిక్‌ చేస్తే సరిపోతుంది. అలా పోస్ట్‌ చేసిన సందేహాలకు సైట్‌ నిర్వాహకులే జవాబు ఇవ్వాలనేం లేదు. ఆ అంశాలను చూసే ఏ నెటిజన్‌ అయినా స్పందించే అవకాశం ఉంది. నెటిజన్లు పంపిన సమాధానాలను నిర్వాహకులు పరిశీలించి సరైనదైతే, ప్రత్యేక పుటగా పోస్ట్‌ చేస్తారు. ఆయా సమాధానాలు ఎప్పటికీ భద్రంగా ఉంటాయి కూడా. ఇందులోని సమాచారాన్ని ఇంగ్లిషు, హిందీ భాషల్లో కూడా వీక్షించే అవకాశం ఉంది. ఈమధ్యనే ప్రారంభమైన ఈ వెబ్‌సైటును ఎప్పటికప్పుడు సమగ్రంగా తీర్చిదిద్దే పట్టుదలతో నిర్వాహకులు ఉన్నారు. ఈ ప్రయత్నానికి ఎవరైనా సహకారం అందించవచ్చు కూడా. అందుకోసం 'సంప్రదించండి'లోని కాంటాక్ట్‌ వివరాల ద్వారా మెయిల్‌, ఉత్తరాల రూపంలో కాంటాక్ట్‌ అవవచ్చు. మరిన్ని వివరాలకు You are not allowed to view links. Register or Login to view. ను చూడవచ్చు.[/info]

Quote:[alert]
మరి కొన్ని ప్రయత్నాలు

కంప్యూటింగ్‌లో మాతృభాషని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఐఐఐటీ హైదరాబాద్‌ కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రూపుదిద్దుకుంటున్న టెక్నాలజీలు...

* Machine Translation
తెలుగు, హిందీ 'మెషీన్‌ టాన్స్‌లేషన్‌ సిస్టం'ను తయారు చేస్తున్నారు. ఈ సిస్టంకి ఒక భాషలో ఇన్‌పుట్‌ ఇస్తే దాన్ని అటోమేటిక్‌గా తర్జుమా చేసి మరో భాషలో అవుట్‌పుట్‌ ఇస్తుంది. ఈ సిస్టంని రూపకల్పన చేసే బృందం మరింత కచ్చితత్వాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని భాషలకు ఈ సాంకేతికతను అన్వయించవచ్చు.

* Telugu OCR
సీవీఐటీ (Center for Visual Information Technology) బృందం 'ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నేషన్‌' సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా శిథిలమైపోతున్న పాత గ్రంథాల్ని డిజిటలైజ్‌ చేయవచ్చు. Handwriting Recognition, Speech analysis సిస్టంలను కూడా రూపొందిస్తున్నారు.

* Web Search
ఎస్‌ఐఈఎల్‌ (Search and information Extraction Lab) అంతర్జాలంలోని భాషల కోసం ప్రత్యేక యంత్రాన్ని తయారు చేస్తున్నారు. దీని ద్వారా మోనోలింగ్వల్‌ సెర్చ్‌, క్రాస్‌ లాంగ్వేజీ సెర్చ్‌లను క్షేత్రస్థాయిలో నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.[/alert]

Source : Eenaadu 27 August 2009

[iframe]http://techsetu.com[/iframe]
Quote this message in a replyReply

Post: #2
మీ రందించిన విలువైన సమాచారానికి ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #3
^ 000 మహాశయా....!!
మీరు అందించిన విలువైన సమాచారానికి ధన్యవాదాలు.
చాలా ఉపయోగకరంగా ఉంది. ఆశాజనకంగానూ ఉంది.
తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని డెవలప్ మెంట్స్ సాధించాలని ఆశిద్దాం.
Quote this message in a replyReply

Post: #4
namaskaram


manchi information nu share chesinanduku dhanyavadamulu
Quote this message in a replyReply

Post: #5
good post andi. thank u.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)