Post: #1
నిటారుగా నిలబడి గుండెలనిండుగా
ఊపిరి పీల్చుకొని
కాళ్ళు రెండూ నేలపై బలంగా అదిమి
మీ కళ్ళలో కళ్ళుపెట్టి చూడాలన్న
నా కోరిక ఈ తరానికి సాధ్యమా?

తరతరాలుగా నా భూమిని
నా సర్వాన్ని నీ హక్కుభుక్తం చేసుకొని
కోటిపడగల నాగుబామువై
భూమండలాన్ని చుట్టేసుకున్నావు..

అనాదిగా బానిసత్వపు సంకెళ్ళను
నా మెడలో వేసి నన్ను పాతాళంలోకి
నెట్టివేసి అధికారాన్ని అనుభవిస్తున్నావు..

కానీ..
అణచబడ్డ నా తరం అంతరంగ సునామీలోంచి
ఉద్భవించే పెనుతుఫాను తాకిడికి
నీ అధికార పీఠం తలకిందులవుతుంది...

అవమానాల ఊబిలోంచి
ఎర్రకలువ పూస్తుంది!
Quote this message in a replyReply

Post: #2
వాహ్ మిత్రమా !!

మీలోని అలోచనాత్మక ఆవేశం నన్ను కదిలించింది. మీకు లాల్ సలాం..

ఇలాంటి మరిన్ని కవితలు మీనుండి ఆశిస్తున్నాము..

ధన్యవాదాలు..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Thanks for your kind కాంప్లిమెంట్. మీ కవితాభిమానానికి ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)