Post: #1
బ్రౌజరు లో బుక్ మార్కులెట్ ల ఉపయోగం గురించి You are not allowed to view links. Register or Login to view.

తెలుగు బ్లాగులతో పరిచయం ఉన్నవారికి You are not allowed to view links. Register or Login to view.
గురించి తెలిసే ఉంటుంది. ఈ ప్లగిను ఉన్న బ్లాగు / సైటు లో
ఏదైనా ఒక తెలుగు పదానికి అర్ధం లేదా వివరణల కోసం -
తెలుగు విక, తెలుగు విక్షనరీ, బ్రౌను నిఘంటువు,
గూగులు ని సంప్రదించడం సులువుగా ఉంటుంది.

శ్రీ శోధన ప్లగినుకి సంబంధించిన కోడుని బ్లాగు/సైటు లో
ముందుగా అమర్చి ఉంటేనే ఆ సదుపాయం లభిస్తుంది.

అలా కాకుండా ఏ తెలుగు సైటు/బ్లాగులో అయినా మనం
శ్రీ శోధన సాధనాన్ని ఉపయోగించుకునేలా చేసే పద్ధతి ఇది.

దీనికోసం బ్రౌజరులో ఒక బుక్మార్కుని ఏర్పాటు చేసుకోవాలి.
ఈ బుక్మార్క్ కి శ్రీశోధన అని పేరు పెట్టుకుందాం. దీనికి
కింది కోడుని చేర్చి save చేసుకోవలిసి ఉంటుంద.

Code:
You can not see this content.

[Image: srisodhana01.gif]

ఉపయోగించే పద్ధతి:
ముందుగా మీరు ఏ వెబ్ పేజీలో అయితే ఒక పదం గురించి శోధన చేయదలుచుకున్నారో
ఆ పేజీలో పైన ఇచ్చిన స్క్రిప్టుని బుక్మార్క్.లెట్ ద్వారా లోడ్ చేయాలి. ఆ తర్వాత పదం
పై రెండుసార్లు క్లిక్ చేస్తే ఆ పదం ఎన్నుకోబడి సంబంధిత పాప్అప్ వస్తుంది. అక్కడ మనం
కావలిసిన రిసోర్సుని మరియు పదవిభాగాన్ని ఎన్నుకుంటే కొత్త విండోలో వివరణ వస్తుంది.

ఆసక్తి ఉన్నవారు దీనిని ప్రయత్నం చేసి చూడండి Smile
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)