Post: #1
మిత్రులారా...!
ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన, విజ్ఞానదాయకమైన విషయానికి స్వాగతం...సుస్వాగతం...!!

ఫోరమ్ అంటే ఒక వ్యక్తిత్త్వం ఉన్న చర్చా వేదిక. ఫోరమ్ అంటే ఒక అస్తిత్త్వం ఉన్న సభా వేదిక. ఫోరమ్ అంటే నిత్యం విజ్ఞాన వీచికలు వీచే విజ్ఞాన స్వేచ్ఛా ప్రపంచం.
ఫోరమ్ అంటే అనేక అభిప్రాయాల వేదిక. అనేక సబ్జెక్టుల సమాహారం.

ఒకప్పుడు ప్రతి ఊరిలోనూ, గ్రామంలోనూ, పట్టణంలోనూ నడిబొడ్డున లేదా ఒకానొక ప్రసిద్ధ స్థలంలో లేదా ప్రాముఖ్యత సంతరించుకున్న స్థలాలలో జరిగే సమావేశాలు....గ్రామ సభ అనో లేదా పంచాయతీ అనో మరోకటో...ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో వ్యవహరిచంటం జరుగుతుంది. అక్కడ జరిగే అన్ని రకాల కార్యకలాపాలు అభిప్రాయాలు పంచుకోవటం...తెలుసుకోవటం....న్యాయంగా వ్యవహరించటం....అనేక రకాల జీవిత విలువలను ఆపాదించటం...ఆస్వాదించటం...నేర్పడం...నేర్వడం...ఇలా....సాగటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ఫోరం గురించి సాంకేతికంగా చెప్పాలంటే...ఒకరి సమాచారాన్ని మరొకరు అందుకుంటూ....అభిప్రాయాల్ని పంచుకునేటటువంటివి ఈ ఆన్ లైన్ వేదికలు...మన భాషలో చెప్పాలంటే...ఫోరమ్స్.

ఆఫీసులలో....కార్యాలయాలలో....సమావేశ స్థలిలో రకరకాల మీటింగులు జరుగుతూంటాయి. ఎందుకు..? మీటింగులలో అజెండా ప్రకారం రకరకాల విషయాలపై లేదా ముందుగా అనుకున్న విషయాలపై చర్చ జరిగి....అందులోని లోటుపాట్లను తెలుసుకోవటం...సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవటం...వాటిని సరిదిద్దుకుంటూ...రిజల్ట్ ఓరియెంటెడ్ గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇది నిర్వహణా పరమైన అంశం.

ఆఫీసులలో...కాలేజీలలో...యూనివర్శిటీలలో....బోర్డ్ లను గమనించారా..? ఈ పబ్లిక్ నోటీస్ బోర్డులలో అందులో పేర్కొనబడేవి ఏమిటి....అభిప్రాయాలు. కదా...! అంటే ఒక క్రమపద్ధతిలో అనేక విషయాల సమాహారాన్ని గురించి బహిరంగంగా...అధికారికంగా తెలుసుకునే వీలు కల్పించే పద్ధతినే ‘పోస్ట్’ చేయడం అంటారు...ఇలా పోస్ట్ చేసిన సమాచారం పై ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవటం...ఆహ్వానించటం...వారి మెరుగైన సూచనలు పరిగణనలోకి తీసుకొని అనేక రకాలు మంచిగా తీర్చి దిద్దటం...ఒక సారి జరిగిన తప్పు మరలా జరగకుండా చూసుకోవడం...జరుగుతుంది.

ఇటువంటి తరహా విధానం ఉన్న ఆన్ లైన్ బోర్డులనే ‘‘డిస్కషన్ బోర్డు’’లని ‘కమ్యూనిటీ బోర్డు’ లు అని మొదట్లో పిలవటం జరిగింది. అయితే కాలక్రమేణా...వీటిని ‘‘ఫోరమ్స్’’ అని పిలవటం జరుగుతున్నది. ఇక ఇదే స్థిరమైన నామధేయంగా మిగిలింది.

మనకొక విషయం పై (ఎక్కువగా సాంకేతిక విషయాలపై) అవగాహన ఉంది...దానిని వ్యక్తీకరించాలి...తెలియని వారికి తెలియజేయాలి..? అటువంటప్పుడు మనదంటూ అభిప్రాయాన్ని, మనకు తోచిన సమాచారాన్ని, హైపర్ లింక్ లతో, రిఫరెన్సుల్నీ ‘పోస్ట్’ చేయటానికి అవకాశం కలిగించే వేదికే ‘‘ఫోరమ్’’

‘‘ఫోరమ్ అంటే అనేక అభిప్రాయాల వేదిక. అనేక సబ్జెక్టుల సమాహారం’’ అని తెలుసుకున్నాం కదా. ఒక్కొక్క సబ్జెక్టు కు ఉపయోగ పడే విదంగా అనేక సెక్షన్ లు గా విభజించటం జరుగుతుంది.
ఉదాహరణకు : ఈ మహి గ్రాఫిక్స్ ఫోరం లో మీరు ఆశించే అన్ని రకాల అంశాలను పొందుపరచటం జరిగింది. ఒకసారి చూడండి :

[Image: 14ictw1.png]

[Image: 2zyd9vq.png]

[Image: qxp3qo.png]

[Image: 212tikn.png]

[Image: i4irrt.png]

[Image: 9jdhsw.png]

వీటిని సెక్షన్ లు అంటారు. మీరు పోస్ట్ చేసే ప్రతి అంశం ఏ సెక్షన్ లలో ఉన్నదో గమనించి ఆయా సెక్షన్ లలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఒక వేళ దేనికీ సంబంధం లేని పోస్ట్ అనుకోండి.....వీటిని మామూలుగా ‘‘అన్నీ రకములు’’ అనే కేటగిరీ లోని సెక్షన్ లో పోస్ట్ చేయండి.
సాధారణంగా ఒక ఫోరమ్ లో ఈ విధమైన సెక్షన్ లు ఉంటాయి. సబ్జెక్టు మరీ విస్త్రృతంగా పెరిగేదయితే కొన్ని సబ్ సెక్షన్ లుగా కూడా విభజించి ఏర్పాటు చేసుకునే వీలుంది. ఎందుకంటే...సౌలభ్యత కోసం.

ప్రతి సెక్షన్ లోనూ కొన్ని ‘‘థ్రెడ్స్’’ ఉంటాయి. ‘‘థ్రెడ్’’ అంటే ఒక సబ్జెక్టు అనుకోండి. మీకు తెలిసిన విషయాన్ని ఏ సెక్షన్ లో ఆయా అంశం ఉన్నదో గమనించి సరైన సెక్షన్ లో పోస్ట్ రూపంలో తెలియజేసి ఇతరుల అభిప్రాయాలను కోరుతూ ప్రారంభించే ‘‘చర్చనీయాంశాన్ని’’ ‘‘థ్రెడ్స్’’ అంటారు.

ఒక సబ్జెక్టు తీసుకుని మీరే ఒక క్రొత్త ‘‘థ్రెడ్స్’’ ప్రారంభించవచ్చు. ప్రతి ‘‘థ్రెడ్’’ లోనూ సాధారణంగా రైట్ సైడ్ టాప్ లో "New Thread" అనే ఆప్షన్ క్లిక్ చేసి తగిన విధంగా మీరు పోస్ట్ చేయవచ్చు.

[Image: 23sg10o.png]

ఫోరమ్ అనేది చాలా విస్త్రతమైనది....ఆసక్తికరమైనది. ఫోరమ్ లో అభిప్రాయాల్ని పోస్ట్ చేసేవారిని ‘పోస్టర్స్’ అంటూంటారు.

ఫోరమ్ లో పోస్ట్ ఎలా చేయాలో చూద్దాం : ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయడం ద్వారా అసలు ఫోరంలో పోస్ట్ చేయడం ఎలా అనే విషయం తెలుస్తుంది. ఆ పోస్ట్ చదివన తరువాత మరలా విషయానికై వెనుకకు రండి. మరలా ఈ పోస్ట్ చదవండి.

You are not allowed to view links. Register or Login to view.

అలాగే పోస్ట్ లు చేసేటప్పుడు పోస్ట్ లలో అవసరమైన చోట వివిధ రకాల స్క్రీన్ షాట్ లను ఎలా ఉపయోగించాలో తెలియజేసే లింక్ : You are not allowed to view links. Register or Login to view.

అత్యంత ప్రభావవంతంగా స్ర్కీన్ షాట్ లకు ఉపయోగపడే సాఫ్ట్ వేర్ గురించి ...సమగ్ర సచిత్ర వివరణల కోసం : You are not allowed to view links. Register or Login to view.

అలాగే ఫోరంలో పోస్ట్ లను తెలుగులో ఎలా కంపోజ్ చేయాలి అనే విషయంపై లింక్ : You are not allowed to view links. Register or Login to view.
మన అభిప్రాయాల్ని పోస్ట్ చేయడం మాత్రమే కాదు...ఇతరుల అభిప్రాయాలను కూడా ‘‘కోట్’’ "Quote" చేయడం కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక విషయం గురించి ‘‘థ్రెడ్’’ ప్రారంభిస్తాడు. అతన్ని ‘‘థ్రెడ్ స్టార్టర్’’ అంటారు. మిగతా వాళ్ళు ఆ విషయం పై తమ మెసేజ్ లను పోస్ట్ చేస్తారు. అలా చేసేముందు అంతకు ముందు థ్రెడ్ స్టార్టర్ ఎవరయితే ఉటంకించిన వ్యాఖ్యను (comment) ను కోట్ చేసి సదరు మరొక వ్యక్తి తమ అభిప్రాయాన్ని పోస్ట్ రూపంలో వ్యక్తీకరించవచ్చు. ఈ కోటింగ్ అనేది పోస్టింగ్ లో అంతర్భాగమే.

పోస్టర్ల లో ఎవరో ఒక ఫలానా వ్యక్తి పోస్ట్ చేసిన విషయం మీకు నచ్చిందనుకోండి.....దానిని మీరు మెచ్చుకోవచ్చు. నచ్చలేదనుకోండి....బాగోలేదని చెప్పవచ్చు. కరెక్ట్ కాదని వాదించవచ్చు. లేదా మీరు తెలిసిన అదనపు సమాచారాన్ని తెలియజేయవచ్చు. గుర్తుంచుకోండి.....!!!! ఇక్కడ ఇలాంటప్పుడు మనం ఏ వ్యక్తి పోస్ట్ గురించి స్పందిస్తున్నామో, ఆ పోస్ట్ ని ‘‘కోట్’’ "Quote" చేసి, అప్పుడు మన ప్రతిస్పందనను పోస్ట్ చేయాలి. ఒక వ్యక్తి చేసిన పోస్ట్ ను కోట్ చేసి దాని మీద మీ అభిప్రాయం ఇదీ....అని సూచించవచ్చు. అంటే....నేను ఫలానా వ్యక్తికి సంబంధించిన ‘‘పోస్ట్’’ ను ఉద్ధేశించి మాట్లాడుతున్నాను’’ అని తెలియజేసేందుకు ఈ ‘‘కోటింగ్’’ ఉపయోగపడుతుంది.

ఫోరమ్ లో మీ కొక గుర్తింపు కోసం మీరు పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ తో బాటుగా కింద కనిపించే మన ‘‘ట్రేడ్ మార్క్’’. ఫోరమ్ లో ప్రతి సభ్యుడూ తనకంటూ ఓ సిగ్నేచర్ ను ఏర్పరచుకోవచ్చు. సిగ్నేచర్ ద్వారా మనం ఎలాంటి వాళ్ళమో చెప్పకుండానే చెప్పవచ్చు. ఇక్కడ మీకు ఉన్న నాలెడ్జ్ తో అందంగా మీ సిగ్నేచర్ ను తీర్చిదిద్దుకోండి. ఇంతకంటే పెద్దగా చెప్పటానికి ఏముంది...? అయితే సరయిన విధంగా సిగ్నేచర్ పెట్టడం ఓ కళ.....మేగ్జిమమ్ ఫోరమ్ లలో సభ్యులు చేసే ప్రయోగాలను చూస్తుంటే...చాలా విషయాలు తెలుస్తుంటాయి. మంచి విజ్ఞానదాయకంగా ఉండే సిగ్నేచర్ లను...ఆకర్షణీయంగా, అందంగా ఉండే సిగ్నేచర్ లకు స్వాగతం చెప్పండి. ఇక్కడ మీకున్న నాలెడ్జ్ తో text రూపంలో గానీ, gif animation రూపంలో గానీ ప్రదర్శించవచ్చు.

ఉదాహరణకు :

అందరికీ చిరపరితులైన విజ్ఞాన గని...ఖని....నవయువకులు గౌరవనీయులైన ప్రసాద్ గారి సిగ్నేచర్ :
[Image: Banner.gif]
. . . . . . [Image: txtxrem.gif]

నిరంతర జ్ఞానాన్వేషి గౌరవనీయులైన సుమణి వెంకట్ గారి సిగ్నేచర్ :


పోస్టింగ్ లతో తనదైన శైలి సృష్టించుకున్న గౌరవనీయులైన మహేష్ యస్సస్సార్ గారి సిగ్నేచర్ :
[Image: 9q9xkk.jpg]


పోస్టింగ్ లతో తనదైన శైలి సృష్టించుకున్న గౌరవనీయులైన శ్రీనాథ్ గారి సిగ్నేచర్ :
[Image: 6y1r2r.gif]
[Image: 125030819745079241.gif]


అత్యంత రసానుభూతి చెందించే కవి, ఆత్మీయ మిత్రుడు శ్రీ శ్రీను రాగి గారి సిగ్నేచర్ :
శ్రీనురాగి
[Image: 124753752578516284.gif]
స్నేహ మధురిమను ఆస్వాదిస్తూ,పంచండి. ప్రపంచం అంతొ ఇంతో బాగుందంటే ఈ స్నేహమే కదా కారణం


ఇక్కడ కేవలం కొంత పరిమితి లో సభ్యుల సిగ్నేచర్ లను ఉదాహరణగా చూపించటం జరిగింది...అంతే తప్ప అన్యధా భావించవద్దని మనవి. మరియు ఇక్కడ సిగ్నేచర్ లలో వ్యక్తిత్త్వ చిత్రణ ఎలా ఉంటుందో చూపటం జరిగింది. ఇవే సిగ్నేచర్ లు పర్మినెంట్ గా ఉంటాయని కూడా భావించ కూడదు. ఎందుకంటే సాంకేతికంగా మార్పులు, చేర్పులు జరిగేటప్పుడు వివిధ రకాలైన సిగ్నేచర్ లు ఎంటర్ అవుతూంటాయి.

ఫోరమ్ లో సమాచారాన్ని చదవటానికి వాటిలో మెంబరై ఉండనక్కరలేదు. కానీ మనం కూడా ఏదైనా అభిప్రాయాన్ని పోస్ట్ చేద్దామనుకుంటే మాత్రం....ఖచ్చితంగా రిజిష్టర్ చేసుకుని ఉండాలి. దీనికి గానూ రిజిష్టర్ అవ్వటం చాలా మంచిది.

[Image: 2wn7n7t.png]

[Image: 2rzcs39.png]

[Image: 315d2ew.png]

ఈ విధంగా రిజిష్టర్ చేసుకున్న తరువాత మీరు యాక్టివ్ గా ఫోరమ్ లో పోస్ట్ లు చేయవచ్చు. (క్రమశిక్షణకు లోబడి...మంచి క్వాలిటీ కంటెంట్ పోస్టింగ్ లతో....చిన్నదో...పెద్దదో...ఏదో ఒకటి)

ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే...మీరు ఇక్కడ సరైన వివరాలను తెలియజేయండి. ఈ-మెయిల్ అడ్రస్ కరెక్ట్ ది ఇవ్వండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్ నెంబరే ఇవ్వండి. ఇలా ఇవ్వడం మీ వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది అనుకున్నవాళ్ళు ఇవ్వకపోయినా ఫర్వాలేదు...అయితే ఇక్కడొక ప్రమాదం ఉంది. ఒక వేళ మనందరం సమిష్టిగా ఫోరంలో పోస్ట్ లు చేస్తున్నాం కదా...ఎప్పుడైనా...ఎక్కడైనా ఏదో రూపంలో మనందరం కమ్యూనికేట్ చేయటానికి వీలు పడదు.
మీకు ప్రైవసీ కావాలంటే....ఫోరం యొక్క అడ్మిన్ కు గానీ...మోడరేటర్స్ కు గానీ....మీరు మీ వివరాలను పేర్కొంటూ మీ వివరాలు ఇవ్వొచ్చు. వారు మీ ప్రైవసీని కాపాడతారు. అంతేగానీ ఎట్టి పరిస్థితులలోనూ మాట తప్పరు.

ఇక్కడ గమనించండి....కొందరు సభ్యులు ఆకతాయితనంగా రకరకాల పిచ్చి పిచ్చి ఫోన్ నంబర్లు ఇచ్చి తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. వారు వారి గురించి ఏ విదమైన విషయాలను తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఫోరంలలో పిచ్చి పిచ్చి పోస్ట్ ల ద్వారా స్పామ్ చేస్తూ...రకరకాల విచిత్ర ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా మంది గమనిస్తూనే ఉంటారు...ఉన్నారు వారికి తెలియదు పాపం. ఏది ఏమైనా ఒకటి రెండు సార్లు వారి ప్రవర్తనను గమనించి...తదుపరి అడ్మిన్ కు తెలియజేసి వారి అనుమతితో గానీ...అడ్మిన్ అనుమతి వీలుగానీ సందర్భంలో మోడరేటర్స్ వారి...వారి విచక్షణను ఉపయోగించి ఆ విధంగా ప్రవర్తించే సభ్యుని ప్రవర్తనను నియంత్రించవచ్చు. లేదా బ్యాన్ చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి.....దీనికి గానూ అడ్మిన్ లు, మోడరేటర్స్ సదా ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతూంటారు. (ఇది అంతయూ తెర వెనుక జరిగే కృషి...అయితే అందరికీ వాస్తవాలు తెలియాలనే ఉద్ధేశ్యంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది కనుక ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది.)

సభ్యులు వాస్తవమైన సమాచారాన్నే ఇవ్వండి. అలాంటప్పుడు అవసరమైనప్పుడు వారిని సంప్రదించటానికి మరియు అవసరమైన త్వరితగతిన సహాయాన్ని అందించటానికి...కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగపడుతుంది. - గుర్తుంచుకోండి.

కొంత మంది చాలా నిశ్శబ్ధంగా ఫోరమ్ లో జరిగే చర్యలను నిశితంగా గమనిస్తూంటారు. అవసరమైనప్పుడు మోనిటరింగ్ చేస్తూంటారు. జరుగుతున్న పర్యవసానాలను నిశితంగా గమనిస్తూ...కొండొకచో...తప్పులు చేసిన సభ్యులను సున్నితంగా వారిని మోటివేట్ చేస్తూ....అప్పటికీ మాట వినకపోతే అడ్మిన్ దృష్టికి తీసుకు వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ల రూపంలోనో...ఒక వ్యక్తి చేసిన పోస్ట్ లలో రిప్లయ్ ల రూపంలో ఇచ్చిన అభిప్రాయం నచ్చలేదనుకోండి....మనం రెచ్చిపోయి అవతలి వారిని ఇబ్బంది పెట్టకూడదు. విమర్శించారు .....అంటేనే...‘‘మన గురించి ఆలోచించారు’’ అని అర్ధం. కనుక తొందరపడకుండా ఆలోచించి సరిదిద్దుకోవాలే గానీ అర్థరహితమైన వాద, వివాదాలకు తావివ్వకూడదు. (ఇక్కడ ఎవ్వరూ అన్ని రంగాలలో నిష్ణాతులు కారు....కాలేదు. (కృషి ఉంటే తప్ప)...కనుక అందరూ ఈ విషయంలో తగు జాగరూకత వహించి ఉండాలని ఫోరమ్ యొక్క ప్రాదమిక రూలు.

‘‘మనమెవరో తెలియం కదా..? పోస్ట్ చేస్తే ఎవరు చూడొచ్చారు...?’’ అనుకుని మూర్ఖంగా ముందుకు వెళితే అసలుకే మోసం. పరువు, ప్రతిష్ట పోతుంది. తప్పుడు మెసేజ్ లు పోస్ట్ చేసే వ్యక్తి కంప్యూటర్ తాలూకు ఐ.పి. అడ్రస్ ని సైతం బ్యాన్ చేయడం జరుగుతుంది. ఐపి అడ్రస్ కనిపెట్టగా లేనిదీ....ఆ మెసేజ్ పంపేది ఎవరో కనిపెట్టడం కష్టమేం కాదు. కనుక ఇటువంటి విషయాలలో గౌరవ సభ్యులు తగు క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము.

పరస్పర సమాచార వినిమయానికి, వినియోగానికి ఉపయోగపడే ఫోరమ్ ను దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నిజం చెప్పాలంటే...ఫోరమ్ పరస్పర సహకారానికి అద్భుతమైన వేదికలు. మంచి విజ్ఞాన భాండాగారం.

గమనిక : ఇతరుల అభిప్రాయాలను విమర్శించేటప్పుడు....మీ అభిప్రాయం కరెక్ట్ కాదనిపిస్తోంది...అంటూ రీజన్స్ ఇచ్చి...అవతలి వ్యక్తిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి...అంతేగానీ...!! సభ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించకూడదు.

ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. మీకు నచ్చకపోయినా ‘‘లోకోభిన్న రుచి:’’ అని గుర్తించండి. మన చేతి వ్రేళ్ళు ఒక్కలా ఉన్నాయా...?? ఇదీ అంతే.

సద్విమర్శలు చేయండి. నొప్పించేలా తూలనాడవద్దు.

కలలోనైనా కులం పేర్లు ఎత్తవద్దు. (ఎవరైనా తెలిసిగానీ, తెలియకగానీ చేస్తే బ్యాన్ చేయడం జరుగుతుంది.)

సిగ్నేచర్ అందంగా, సౌమ్యంగా ఉండేలా చూసుకోండి. (వింత...వింతగా...విచిత్ర...విపరీత పోకడలు పోయే సిగ్నేచర్ లు వాడకూడదు.)

ఫోరంలో మీ అవతార్ లను ఎలా మార్చుకోవాలో తెలియజేసే లింక్ : You are not allowed to view links. Register or Login to view.

సభ్యులు చేసే పోస్ట్ లకు సైట్ నిర్వాహకులు గానీ, ఫోరమ్ ఎడ్మినిస్ట్రేటర్ గానీ బాధ్యత వహించరు.

ఎవరైనా అతిగా ప్రవర్తిస్తుంటే మోడరేటర్స్ కు గానీ, అడ్మిన్ కు గానీ రిపోర్ట్ చేయండి. ఫోరం రూల్స్ ను పాటించండి.

ఒక ఉదాహరణకు చూడండి : You are not allowed to view links. Register or Login to view. You are not allowed to view links. Register or Login to view.

మెసేజ్ లలో, ఫోరమ్స్ లలో గానీ వెబ్ సైట్లను, ప్రోడక్ట్స్ ను గానీ ప్రమోట్ చేసే పని పెట్టుకోకండి. ఫోరమ్ అంటే మీ ప్రకటనలను మోసే హోర్డింగ్స్ కావు.

ఒక ఉదాహరణకు : You are not allowed to view links. Register or Login to view..

అశ్లీల విషయాలకు లింక్ లు ఇవ్వకండి. అసభ్యతను పెంచి పోషించకండి.

మీకేదైనా ఓ థ్రెడ్ లో సమాచారం ఉపయోగపడితే, ఆ ‘పోస్టర్’ కు, ‘థ్రెడ్ స్టార్టర్’ కు థాంక్స్ చెప్పండి. అయితే కొంత మంది మొక్కుబడిగా రంగు, రుచి, వాసన లేని విధంగా క్లుప్తంగా thanks, good అని రిప్లయ్ ల రూపంలో చెపితే వారి పోస్టింగ్ ల రేట్ పెంచుకోవటం అవుతుంతే తప్ప అసలు ప్రయోజనం నెరవేరడం లేదు. నెరవేరదు కూడా. క్వాంటిటీ కన్నా...క్వాలిటీని మెయింటెన్ చేయగలరని సూచన. గమనించగలరు.

మీరు హైపర్ లింక్ లు ఇచ్చే ముందు ఒకసారి అవి వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకొని ఇవ్వండి. మెసేజ్ ను కూడా పోస్ట్ చేసే ముందు preview లో ఓ సారి సరి చూసుకోండి.

మీరు ఓ సబ్జెక్టు గురించి థ్రెడ్ మొదలు పెట్టాలనుకుంటే అదే సబ్జెక్టు మీద ముందుగానే ఎవరైనా థ్రెడ్ ప్రారంభించారేమో చూసుకోండి. ఒకే పోస్ట్ రిపీటెడ్ గా రాకూడదు. గమనించగలరు.

ఫోరంలో ఒక క్రొత్త పోస్ట్ చేసే ముందు ....ముందుగా సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా సెర్చ్ చేయండి. ఆ పైన పోస్ట్ కంపోజ్ చేసి తగిన సెక్షన్ లలో పోస్ట్ చేసే ముందు తప్పులు లేకుండగానూ...మరియు ప్రివ్యూనూ చూసి ఆ పైన నిర్ధారణ చేసుకొని పోస్ట్ చేయండి.

కొన్ని థ్రెడ్స్ డిస్కషన్ చాలినంతగా జరిగి, చాలా కాలం గడిచిపోయిన థ్రెడ్స్ ను అడ్మిన్ లు ‘లాక్’ చేసేస్తారు. వాటిని చదవవచ్చు. గానీ కొత్త పోస్ట్ లు చేయలేము. గమనించండి.

కొంత మంది సభ్యులు అటాచ్ మెంట్స్ ను దుర్వినియోగం చేస్తున్నారు. అస్సలు అటాచ్ మెంట్స్ అనేది ఫోరం యొక్క సర్వర్ లో డేటా బేస్ లో లోడ్ అవుతుంది. అందువలన పరిమితితో వాడటం జరుగుతుంది. మరియు అటాచ్ మెంట్ రూపంలో ముఖ్యమైన సమాచారాన్ని మరింత సమగ్రత కోసం, విపులంగా డాక్యమెంట్ రూపంలోనో. పిడిఎఫ్ రూపంలోనో, ప్రజెంటేషన్ రూపంలోనో అందించటం కోసమే అయితే కొందరు సభ్యులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నవాళ్ళు ఈ విషయాన్ని దుర్వినియోగం చేయరని ఆశిస్తాము.


ఇటీవల నూతనంగా ఫోరం సభ్యత్వం పుచ్చుకున్న సదరు కొందరు సభ్యులు ఈ ఆప్షన్ దుర్వినియోగం చేయటం జరుగుతుంది. కనుక తెలియజేయటమైనది. గమనించి సరిదిద్దుకోండి. సభ్యుల మధ్య సరైన స్నేహ వాతావరణం కలుగజేయటంలో సహకరించండి.

సభ్యులెవరైననూ ఒకానొక చోట నుండి ఒకానొక సాంకేతిక విషయాన్ని గానీ, స్పూర్తిదాయకంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనో...లేక మంచి విషయాన్ని అందరికీ తెలియజేయాలనే సత్సంకల్పంతోనో ప్రయత్నిస్తే తప్పులేదు. అయితే ఈ ఫోరమ్ లో కాపీ, పేస్ట్ కంటెంట్ ను నిషేధించటమైనది. అయితే సదరు పోస్టర్లు....వారు ఎక్కడ నుండైనా డేటాను కాపీ చేసి ఇక్కడ పోస్ట్ రూపంలో అందరికీ తెలియజేయాలనుకునేటట్లయితే మూలాధారాలను తెలియజేస్తే....అందరికీ క్షేమకరంగా ఉంటుంది. ఎటువంటి వివాదాలు తలెత్తవు.

ఫోరమ్ అనే విషయం గురించి తాత్కాలికంగా వ్యాసాన్ని ఆపేస్తున్నాము. కాలక్రమంలో మరొక్కసారి కలుద్దాం.

ఫోరంలో అడుగు పెట్టే ప్రతి సభ్యునికీ సాదర స్వాగతం పలుకుతోంది ఈ మహీగ్రాఫిక్స్ ఫోరం.

మోటివేటివ్ థాట్స్ కలిగి ఉన్న పోస్ట్ లను చూడండి :

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

[Image: 23h9gko.jpg]

[b][color=#FF0000]నిరంతర జ్ఞానాన్వేషణలో....మీ సుమణీ వెంకట్ (మీ శ్రేయోభిలాషి)
Quote this message in a replyReply

Post: #2
సుమణి వెంకట్ గారు

ఫోరం ల తీరు తెన్నులను చాలా బాగా అనలైజ్ చేసి వివరించారు. ఫోరం గురించి ప్రతి మెంబరు చదవవలసిన గైడెన్స్ పోస్ట్ ఇది. వీడియో పోస్టింగ్ లను కూడా ఉదహరిస్తే సంపూర్ణత వచ్చేదేమో గమనించండి.

ధన్యవాదాలు సర్
Quote this message in a replyReply

Post: #3
హ్యట్సాప్ వెంకట్‌గారు,
యస్వీ గారు ఎంతో శ్రమ కోర్చి మంచి విషయాన్ని విపులంగా వివరించారు. పొరమ్‌ అబివృద్దికి మీరు ఎంతగా పరితపిస్తున్నారొ ఈ ఒక్క పోస్టును గమనిస్తె చాలు.
పూర్తి అంకిత బావంతొ పరిశ్రమిస్తున్నందుకు మీరు ఎంతగానొ అబినందనీయులు. ఇక మీ సలహాలను అందరు పాటిస్తారని ఆశిస్తూ..

ఎన్నొ పొరమ్‌లలొ ఒక మెంబర్ గా నెను గమనించిన విషయాలు సలహాల రూపంలో

1. ఉత్సాహ పరచడం:
ఎప్పుడు చప్పగా సాగిపొయె థ్రెడ్‌లకు సమాంతరంగా అప్పుడప్పుడు అరొగ్య కరమైన వాడి
వేడి చర్చలు జరిగె థ్రెడ్‌లు కూడ పొరంను విజిట్ చేయాలని,
పోస్టులు చెయాలన్న ఉత్సుకతను మెంబర్లకు ఉత్ప్రెరకాలుగా పనిచేస్తాయి.

2. నియమాలు అమలు చేయటం:
ఎప్పుడు అడ్మిన్‌లు, మాడరేటర్లు " నొప్పించక తానొవ్వక " తరహాలొ ఉండటం కంటె అప్పుడప్పుడు సందర్బానికి
తగ్గట్టుగా కటువుగా వ్యవహరిస్తె బాగుంటుంది.అదేవిదంగా నియంతల వ్యవహరించడం కూడ బాగుండదు.
అందరికి ఒకె విదమైన నియమాలను అప్లై చెయటం మంచిది. ఒకటికి రెండు సార్లు అనుచితంగా ప్రవర్తించిన
మెంబర్లను హెచ్చరిస్తె ఎలాంటి కంటెంట్‌ను పొరంకు ఇవ్వాలి అన్న మెచ్యూరిటి తనంతట తానుగా గా అయా మెంబర్లకు వస్తుంది

3. ప్రజాస్వామ్యం:
ఇక మీరు చివరలొ ఉటంకించిన విషయం "కాపి పెస్టెడ్ మెటిరియల్‌కు స్వంత రచయితకు గాని తత్సంబందిత వెబ్‌సైట్‌కు గాని క్రెడిట్ ఇవ్వాలని..."
ఈ విషయాన్ని నెను ఒక నెలరొజుల క్రితమె మన టీమ్‌లొనె అత్యుత్తమ స్థానంలొ వున్న ఒక వ్యక్థికి సున్నితంగా సూచించాను
తను మూవి డివిడి ఎలా తయారు చేయాలొ ( రెండు థ్రెడ్డులుగా )ఒక వెబ్‌సైట్‌నుండి వారి ట్యూటొరియల్‌ను స్క్రిన్‌షాట్స్ తొ సహా ఉన్నది ఉన్నట్టుగా కాపి చెశారు.
కాపి చేయటం తప్పుకాదు కాని బ్రదర్, సబ్యులకు ఆ విషయాన్ని ఎక్కడ నుండి కాపి చేశారొ సూచించండి అన్న సలహాను ఏమాత్రం పాటించకుండా,
ఎలాంటి జస్టిపికేశన్ ఇవ్వకుండ తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగ పరస్తూ ఏకంగా ఆ థ్రెడ్డులను ( నా పొస్టుతొ సహా) ఒక రెండు గంటల తర్వాత డిలిట్ చేసెశారు.
నా లాంటి సాదరణ మెంబర్ తప్పు చెయటంలొ పెద్దగ ఆశ్చర్యం లేదు కాని "కంచె చేను మేస్తె ..... " అన్న సామెత చందాన ఒక స్థాయిలొ వున్న వ్యక్థి
ఈ సందర్బంలొ ఇలా ప్రవర్తించటం నన్ను విస్మయ పరిచింది."యదా రాజః తదా ప్రజాః" రాజులు(పాలకులు) ఏ విదం గా ప్రవర్తిస్తె ప్రజలు అదేవిదంగా ప్రవర్తిస్తారు.

అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..

భవదీయుడు,
M. శ్రీనివాస్ గుప్త.
Quote this message in a replyReply

Post: #4
Welcome Mr Srinivas Gupta garu....!

Meeru cheppina vishayalanu drustilo pettukuntam....

Thank you very much for that guidance to us....!!
Quote this message in a replyReply

Post: #5
[info]తోచినది క్లుప్తంగా Smile ఇక్కడ ఎక్కువ శాతంలో ఔత్సాహిక సభ్యులు ఉన్నారు . ఫోరంలో ఫలానా
పద్ధతిలలో పాల్గొనాలని , నియమాలని దాదాపు 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి . అయితే
వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని ఆచరిస్తున్న సభ్యులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పుకోవాలి[/info]

[alert]అలాగే నిర్వాహక బృందంలో కొందరు సభ్యులు కూడా ఫోరంల నిర్వహణ భాద్యతల గురించి
సరిగ్గా తెలుసుకుని ఆచరించవలసిన అవసరం ఉంది . కొత్త విషయాలకి (new topics)
సరైన టైటిలుని పెట్టడం ; సంబంధిత సెక్షనులకి తాత్కాలిక రీడైరెక్షనులతో తరలించడం ;
... ( You are not allowed to view links. Register or Login to view. )[/alert]

[warn]ఇక సభ్యులు అందరూ (స్టాఫ్ కూడా) పాటించవలసిన వాటిలో ఇవీ చెప్పుకోవాలి ::
సరిగ్గా ప్రతిస్పందించడం ; అవసరమున్న విషయాన్ని మాత్రమే ఉటంకించడం (quote) ;
ప్రారంభించిన విషయాన్ని ఫాలో చేయడం ( subscribe & follow to respond ) ;
ఇమేజిల సైజులని వీలున్నంత తక్కువగా ఉండేలా చేసి జత చేయడం ( for web ) ...[/warn]

[alert]ఎవరైనా ఒక ప్రశ్నని / సందేహాన్ని అడిగితే తప్పకుండా ఆ విషయాన్ని సబ్.స్క్రైబ్ చేసి
ఫాలో అవ్వాల్సి ఉంటుంది . మరల అదే విషయం కోసం కొత్త టాపిక్ ప్రారంభించకుండా
ఉండాలి . ఒకవేళ కొత్త విషయాన్ని ప్రారంభించిన తర్వాత 48 గంటలు గడిచినా సమాధానం
లభించకుంటే అప్పుడు అదే టాపిక్ లో - సమాధానం ఇవ్వమని కొత్త పోస్ట్ చేయవచ్చును
అలాగే సంబంధిత విషయ నిపుణులకి ఒక సందేశం (PM) పంపి సమాధానం కోరవచ్చును[/alert]

[warn]ఫోరంలలో పోస్ట్ చేయడమనేది ఒక ఐచ్చిక విషయము . కొత్త సభ్యులని ప్రోత్సహించడమనేది
నిర్వాహకుల బాధ్యత . ఈ విషయంలో తరతమ బేధాలు ఉండకూడదు . అలాగే మిత్రులు ఒకరు
ప్రస్తావించిన విషయం " మోడరేటింగు ప్రివిలెజెస్ దుర్వినియోగం " ... ఫోరంల మోడరేషనుని
ఒక బాధ్యతగా గుర్తు ఉంచుకోవాలి . తప్పనిసరి అయినప్పుడే ఒక ఆయుధంగా ఉపయోగించాలి[/warn]

ధన్యవాదములు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)