Post: #1
బంగారు బాల్యం నుండి బయటకొచ్చి
సమాజపు రెపరెపల అనుభవాల గుంపులోకి
చొరబడే ఓ యువతా.... ఈ సమాజం నీది
ఇక నువ్ మాత్రమే దీనికి మార్గదర్శకుడవు
అలాంటిది ప్రేమ పిచ్చిలో, ఆకర్షణ ముసుగులొ
కొందరి జీవితాలను యాసిడ్ మయం చేస్తూ
నువ్ సాధిస్తున్నది ఏమిటి??
స్వేచ్చను అనుభవిస్తూ విర్రవీగుతున్న నీవు
దానికొరకు ఎన్నివేల ప్రాణాలు బలి అయి ఉంటాయో
ఒక్కసారి ఆలోచించు...
ఈ సమాజం మనం నిర్మించుకున్నది
ఈ సమాజంలో ఉన్న నియమాలు మనం కల్పించుకున్నవి
ఈ సమాజం లో ఉన్న కట్టు బాట్లు - బయాలు అన్నీ కూడా మనవే సుమా..
మరి అవన్ని ఎందుకోసం...?

నువ్వు-నిన్ను కన్న తల్లి - నీ కుటుంబం అలాగే నీ లాంటి ఈ సమాజం
అందరు హాయిగా ఉండాలనే కదా..
దానికొరకు ఎందరో నిరంతరం నిన్ను నన్ను ఈ సమాజాన్ని
రక్షించడానికి పలు విధాలుగ రేయింబగళ్ళు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక
ఎక్కడెక్కడో పహారా కాస్తున్నారు.
ఒక్క సారి బిచ్చగాడిని గమనించు అలాంటి జీవితం నీకు లేదు
ఒక్కసారి రోగ గ్రస్థులను గమనించు భయంకరమైన జబ్బులతో ఎలా బ్రతుకుతున్నారో
అలాంటి స్థితి నీకు లేదు..ఎందుకంటే ఈ సమాజం నీకు కల్పించిన వసతులు నిన్ను అలాంటి
స్థితిలోకి రాకుండా కాపాడుతున్నాయి.
ఇంతటి ఉన్నతమైన సమాజంలో ఉంటు దానినే కలుశితం చేస్తావా.....

ఓ యువతా ఒక్కసారి మళ్ళీ ఆలోచించు...

ఈ సమాజాన్ని పునర్నిర్మించవలసింది నువ్వే
ఈ సమాజాన్ని రక్షించాల్సింది నువ్వే
ఈ సమాజం నీదీ నాదీ మనందరిదీ

సమాజం బాగుండాలంటే
అది కేవలం నీ వలన్నే సాద్యం..

ఓ యువతా ఇది నా వేడుకోలు ...


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
బాగుంది సార్, మీ వేడుకోలు. కాని అవకాసం వచ్చిన యువత నేడు పబ్ లలో ఎంజాయ్ చేసేందుకు పరుగులిడుతున్నారు తప్ప ఒక్కమారు తమచుట్టు వున్న వారిగురించి ఆలోచించడం లేదు. కెరీరిస్టిక్ కల్చర్ పెరిగి తమ సంపాదన, తన వరకు బాగుండాలని కోరుకునే స్వార్ధం పెరిగిపోఎట్లు తయారవడం మన దౌర్భాగ్య౦. అట్టాంటి పరిస్థితుల్లోకి నెట్టివేసే మన పాలకుల కుత్సితాన్ని అర్ధం చేసుకునే సమయం ఇదే. మీకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #3
నిజమే కుమార్ గారు..

బాద్యతలనేవి కేవలం "నా"వి కావూ "మన"వి అనే భావన నేటి యువతలో రావాలి. తాత్కాలికమైన సంతోశాలకోసం తమ విలువైన సమయాన్ని వ్యర్థంగా గడిపే వారిలో మార్పు రావాలి. అందుకే ఇలా నా ఆక్రోశాన్ని కక్కుతున్నాను కనీసం ఒక్కరైనా మారుతారని.

ఇక ఇలాంటి భ్రమల్లోకి బలవంతంగా యువతను తోయాలని వెస్ట్రన్ కల్చరంటు పిచ్చి భావనలను మన స్వచ్చమైన యువత మెదడుల్లోకి రకరకాలుగ తోస్తున్న అన్ని రకాల దారులకు తివాచీలు పరుస్తూ ఏదో సాధిస్తున్నమంటు విర్రవీగే పాలకులు కళ్ళు తెరిచి ఒక్కసారి గమనిస్తే ఎంతటి ఘోరం జరుగుతుందో తెలుస్తుంది. అలాంటి రోజులు వస్తాయని ఆశాభావం నాకుంది .

ధన్యవాదాలు కుమార్ గారు నాలోని ఆవేదనను అర్థం చేసుకున్నందుకు .

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4

చాలాబాగా రాశారు మీ ప్రయత్నంనెరవేరాలని ఆశిస్తూ

                                                                                   మీ

                                                                              బ్రహ్మారెడ్డి

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)