Post: #1
ఒక బ్లాగులో లేదా సైటులో విడ్జెట్ ని చేరిస్తే అసలు ఏమి జరుగుతుంది - అసలు ఆ
విడ్జెట్ ఎలా కనిపిస్తుంది - అనేదానికి సాధారణంగా ఆ విడ్జెట్ ని అందించే సైటులోనే
తగిన వివరణ & ప్రివ్యూ ఉంటాయి . ఒకవేళ అలాంటి ఏర్పాటు లభించకుంటే మనం
విడ్జెట్ స్క్రిప్టుకి కేవలం html టాగ్ ని జోడించి ఆ విడ్జెట్ ని పరీక్షించవచ్చును .

సాధారణంగా విడ్జెట్ లు జావా స్క్రిప్టు కోడ్ రూపంలో ఉంటాయి . అందువల్ల ఆ కోడ్
ప్రారంభంలో html అని & కోడ్ చివరలో /html అని చేర్చి ఒక html ఫైలుగా సేవ్
చేయవచ్చును . ఆ ఫైలుని బ్రౌజరులో చూస్తే సంబంధిత విడ్జెట్ ఎలా కనిపిస్తుందో
తెలుస్తుంది . ఒకవేళ విడ్జెట్ లో వేరే సైటు నుండి జావా కోడ్ (js) జోడించబడి ఉంటే
ఇంటరునెట్ కి కనెక్టు అయి మనం ఆ html స్క్రిప్టు పరీక్షించుకోవాలి .

ఉదాహరణ సుమణి వెంకట్ గారు పోస్టు చేసిన You are not allowed to view links. Register or Login to view.
కోడ్ కి html file ఇలా ఉంటుంది :

Code:
You can not see this content.

పైన ఉన్న కోడ్ లో వేరే సైటు నుండి జావా స్క్రిప్టు జోడించబడింది కనుక
ఇంటరునెట్ కి కనెక్టు అయి ఆ విడ్జెట్ ని మనం పరీక్షించవలసి ఉంటుంది

[Image: findia01n.gif]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)