Post: #1
ఒక స్వప్న మేఘం కరిగిపోతూ
అందరి హృదయాలలో
కన్నీటిని వర్షించింది!

స్వప్న పధికుడు మరెవరికీ
అందనంత దూరం
వడివడిగా
నడుచుకుంటూ పోయాడు!

శోధన నాళికలోంచి
స్వప్న లోకాల పయనమయ్యాడు!

శిరస్సు తెగిన దీపపు
స్తంభానికి తన జీవన నౌక లంగరువేయగా
పెద్ద పెద్ద అంగలు
వేసుకుంటూ పోయాడు!

కానీ...
పైకి చూడు నీ మనో నేత్రంతో
ఆయన వేలి చివరల నుండి రాలిన
వెన్నెలాకాశంలో
మంచుశిల్పాలు.....
Quote this message in a replyReply

Post: #2
Quote:కానీ...
పైకి చూడు నీ మనో నేత్రంతో
ఆయన వేలి చివరల నుండి రాలిన
వెన్నెలాకాశంలో
మంచుశిల్పాలు.....

చాలా బాగుందండీ.... ప్రస్తుత పరిస్థితికి సందర్భోచితంగా ఉంది. మీకు నా అభినందనలు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మీ కలం నుండి ఇంకో ఆణిముత్యం ఈ కవిత.. చాలా బాగుంది కుమార్ గారు..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)