Post: #1
బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయి, దగ్గరగా ఉన్న అబ్జెక్ట్ క్లియర్ గా ఉండేటట్లు DSLR కెమేరాస్ తో తీసిన ఫోటోస్ లో మీరు గమనించే ఉంటారు. ఇలాంటి ఎఫెక్ట్స్ ఆ కెమేరాలకు ఫిల్టర్ లెన్స్ లనుపయోగించడం ద్వారా పొందగలుగుతారు. అయితే ఆల్రెడీ ఇలాంటి ఎఫెక్ట్ కెమేరాలో సెట్ చేయకుండా తీసిన ఫోటోలకు ఫోటోషాప్ లో ఇటువంటి ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలో మరియు స్మార్ట్ బ్లర్ ఫిల్టర్ నుపయోగించి అబ్జెక్ట్ బ్యాక్ గ్రౌండ్ కు ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడం. ఇంకా జూమ్ బ్లర్, మోషన్ బ్లర్ ల గురించి ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ఇక ఇమేజిలో అబ్జెక్ట్ యొక్క బ్యాక్ గ్రౌండ్ కి ఏదైనా ఫిల్టర్ అప్లై చేయాలంటే ముందుగా అబ్జెక్ట్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ను సెలెక్ట్ చేయాలి. అబ్జెక్ట్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ను ఎలా సెలెక్ట్ చేయాలో ముందుగా తెలుసుకుందామా?

(అబ్జెక్ట్ బ్యాక్ గ్రౌండ్ సెలెక్షన్)

1. పెన్ టూల్ ను పయోగించి ఈ క్రింది విధంగా అబ్జెక్ట్ చుట్టూ పాత్ క్రియేట్ చేయండి.

[Image: j6svm9.jpg]

2. మీరు క్రియేట్ చేసిన పాత్ ను Ctrl+Enter ప్రెస్ చేయడం ద్వారా సెలెక్షన్ గా మార్చండి.

[Image: 2882yad.jpg]

3. సెలెక్షన్ మీద రైట్ క్లిక్ చేసి Feather ను సెలెక్ట్ చేసి ఈ క్రింది విధంగా సెట్ చేయండి.

[Image: 29eje38.jpg]

4. పై స్టెప్ వరకు సెలెక్షన్ అబ్జెక్ట్ చుట్టూ మాత్రమే ఉంది. మరి ఆ సెలక్షన్ అబ్జెక్ట్ ను వదిలి బ్యాక్ గ్రౌండ్ చుట్టూ ఏర్పడాలంటే Ctrl+Shif+I ని ప్రెస్ చేయండి.

[Image: 208d5iu.jpg]

5. ఇక బ్యాక్ గ్రౌండ్ సెలెక్షన్ అయిపోయింది. ఇపుడు బ్లర్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందామా?

మొదట గ్యాసియన్ బ్లర్ ను ఎలా అప్లై చేయాలో ఈ క్రింది స్క్రీన్ షాట్ ద్వారా తెలుసుకోండి. గ్యాసియన్ బ్లర్ ను అప్లై చేసిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో గమనించండి. ఇపుడు బ్యాక్ గ్రౌండ్ లో మాత్రమే మీరు అప్లై చేసే ఫిల్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఎందుకంటే సెలక్షన్ బ్యాక్ గ్రౌండ్ కు మాత్రమే ఉంది కాబట్టి.

[Image: seygbl.jpg]

6. ఇపుడు స్మార్ట్ బ్లర్ నుపయోగించి బ్యాక్ గ్రౌండ్ ను ఆర్టిస్టిక్ గా ఎలా మార్చాలో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం.

స్టెప్ 1. ఈ క్రింద చూపిన విధంగా స్మార్ట్ బ్లర్ ను అప్లై చేసి గ్రీన్ కలర్ లో హైలెట్ అయిన పారామీటర్స్ ను గమనించి సెట్టింగ్స్ చేయండి.
[Image: 2yns3v4.jpg]

స్టెప్ 2: తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Image >> Adjustments >> Invert ను క్లిక్ చేయండి.
[Image: 23ws274.jpg]

ఫైనల్ ఎఫెక్ట్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
[Image: nn00n8.jpg]

7. స్పీడ్ గా వెళ్లే ఏదైనా వెహికల్ ను స్నాప్ తీస్తే వచ్చే అవుట్ పుట్ మోషన్ బ్లర్. ఈ ఎఫెక్ట్ ను ఎలా అప్లై చేయాలో ఈ క్రింది ఇమేజిలో చూసి తెలుసుకోండి.
[Image: s5i989.jpg]
[Image: 24mz7gm.jpg]

8. తర్వాత రేడియల్ బ్లర్ ఫిల్టర్ నుపయోగించి జూమ్ బ్లర్ ను ఎలా అప్లై చేయాలో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ గమనించి తెలుసుకోండి.
[Image: 50gr4g.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Excellent....!!
Great done job.
Thank you very much for that post.
Quote this message in a replyReply

Post: #3
మహేష్ గారు

మీ కలం నుండి జాలువారిన మరొక మంచి పాఠం. ఫొటోషాప్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరమైనది, అవసరమైనది. మరిన్ని ఇలాంటి పాఠాలు అందించాల్సిందిగా కోరుచున్నాను.
చిన్న సందేహం సర్, ఇక్కడ పెన్ టూల్ ఉపయోగించి మరల ctrl+E ఉపయోగించటం కంటే మాగ్నెటిక్ లాసో ఉపయోగించి సెలెక్ట్ చేసుకోవటం నాకు తేలిక అనిపిస్తుంది. రెంటికీ ఉన్న వ్యత్యాసం, లాభ నష్టాలు తెలియచేయగలరు.

ధన్యవాదాలు సర్
Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు,

నమస్తే, పెన్ టూల్ తో పాత్ ను క్రియేట్ చేయడం వలన భవిష్యత్తులో ఆ పాత్ ను మనకు కావలసిన విధంగా షేప్ గా కానీ ఇంకా అనేక రకాలుగా కన్వర్ట్ చేయడానికి, మాస్కింగ్ కు సులువుగా ఉంటుంది. అంతే కాకుండా పెన్ టూల్ తో కర్వ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా సులభం. అందువలననే నేను దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. ఒక్కొక్కరూ సెలెక్షన్ కు ఒక్కొక్క టూల్ నుపయోగిస్తుంటారు. వారికి ఏది అనువుగా ఉంటుందో దాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే అన్నీ సెలెక్షన్ టూల్స్ కంటే పెన్ టూల్ తో పాత్ క్రియేట్ చేయడం వలన ముందు ముందు సులభంగా వర్క్ చేస్కొనే వీలుంటుంది. త్వరలోనే పెన్ టూల్ గురించి పూర్తి వివరాలతో పోస్ట్ చేస్తాను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
ఇమేజీనీ బ్లర్ చేయడం తర్వాతా ఇమేజీ బ్యాక్ గ్రవుండ్ ను బ్లర్ చేయడం తెల్సు. కానీ ఇన్ని వెరైటీలు చేయవచ్చని మీ పోస్టును చూసాకే తెలిసింది మహేష్ గారు. ధన్యవాదాలు మీకు!

ఫొటోషాప్ లో ఇలా ప్రతీ ఆప్షన్ గురించి కూలంకషంగా తెలీయజేయడం అభినందనీయం.

కృతజ్ణతలు సార్ ..

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)