Post: #1
బ్యాక్ గ్రౌండ్ సింగిల్ కలర్ లో ఉన్నపుడు హెయిర్ ను extract చేయడం పెద్దకష్టమేమీ కాదు. అయితే background ఒక సీనరీ అయినపుడు మల్టిపుల్ కలర్స్ తో నిండి ఉంటుంది. అలాంటపుడు మనిషి యొక్క హెయిర్ ను perfect గా (Knockout లాంటి ఏ ప్లగ్గిన్ ఉపయోగించకుండా కేవలం ఫోటోషాప్ లోని టూల్స్ నుపయోగించి) ఎలా extract చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ఉదా:కు క్రింది ఇమేజిని గమనించండి. హెయిర్ bacground లో పూర్తిగా మిక్స్ అయి ఉంది. మరి ఈ ఇమేజ్ లో హెయిర్ ను బయటికి ఎలా తీయాలో చూద్దామా?

[Image: nfi29.jpg]

1. ఏదైనా సెలెక్షన్ టూల్ (Lasso, polygonal lasso, Magnetic lasso) నుపయోగించి, ఈ క్రింది విధంగా సెలెక్ట్ చేయండి.

[Image: bfjgh3.jpg]

2. క్రింద చూపిన విధంగా సెలక్షన్ మీద రైట్ క్లిక్ చేసి Layer via copy ని క్లిక్ చేయండి. దీనిద్వారా సెలక్షన్ చేయబడిన భాగం వరకు ఒక కొత్త లేయర్ ఏర్పడుతుంది.
[Image: 2mgwkeu.jpg]

3. ఇపుడు బ్యాక్ గ్రౌండ్ లేయర్ ను సెలక్ట్ చేస్కొని ఈ క్రింది విధంగా హెయిర్ డిటైల్స్ లైట్ గా కనిపించేటట్లుగా opacity తగ్గించండి.
[Image: t5j0o2.jpg]

4. ఇంతకుముందు సెలెక్షన్ ద్వారా కాపీ చేయబడిన కొత్త లేయర్ ను సెలెక్ట్ చేయండి. తర్వాత Smudge టూల్ ను సెలెక్ట్ చేసి బ్రష్ సైజ్ 4 గా సెట్ చేయండి. ఇక క్రింద చూపిన విధంగా హెయిర్ డిటైల్స్ ను గమనిస్తూ స్మడ్జ్ టూల్ తో బ్రష్ చేయండి. హెయిర్ మరీ సన్నగా ఉంటే సైజ్ 2 గా సెట్ చేయండి.
[Image: 2m29729.jpg]

ఫైనల్ అవుట్ పుట్ ఈ విధంగా ఉంటుంది.
[Image: fz8na.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)