Post: #1
చూస్తూనే ఉన్నా..
చూస్తూనే ఉన్నా..
చూస్తూనే ఉన్నా..
చూస్తూనే ఉన్నా..

రోజూ చూస్తూనే ఉన్నా...
కానీ ఎన్నడూ లేనిదీ....
ఈ రోజేంటీ....
ఈ తడి ఏంటీ....
ఈ మడి ఎంటీ....
భూమికి వచ్చిన పచ్చ చీర ఏమిటి...?
వచ్చిందో ఆలోచన
మనసులలోచన..
మన ‘సు’ కావ్యాలోచన

అర్థమయ్యింది
పుడమి తల్లిని దుక్కి దున్ని
చదును చేసి, మళ్ళు కట్టి
ఒళ్ళు వొంచి, బళ్ళు కట్టి
నీరు పారించి....చెమట చిందించి
కష్టించి చేసిన శ్రమతో.....
సాధించిన...
రైతన్న నేసిన చీర
పుడమి తల్లికోసం...
ఆరుగాలం శ్రమించిన రైతన్న నేసిన చీర
సిలక పచ్చ చీర...
అదే పచ్చని సిరులొలికే మాగాణి
అందాల అలివేణి
పసిడి కంకుల ధాన్యవేణి
ఇప్పడు నవ యవ్వనంగా ఉంది కదూ
అందుకే రైతన్న నేసిన
పచ్చచీర ఎంత బాగుందో...!!
భూమికి పచ్చ చీర కప్పుతాను...
అని రైతన్న ఎంత శ్రమించాడో....!!
రైతన్న మీకు జేజేలు....!!
Quote this message in a replyReply

Post: #2
namaskaram sumani venkat garu

woh kya kavitvam andi hatss offf
Quote this message in a replyReply

Post: #3
sumanivenkat garu

chala chakkani kavitanu post chesaru

Thanks

Raju Goud
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)