Post: #1
[Image: snag0007vs1.png]


మనలో చాలామంది ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసే సమయంలో వివిధ సైట్లలో కన్పించే వెబ్ సైట్ లింకులను వెనుకా ముందూ ఆలోచించక క్లిక్ చేస్తుంటారు. దీనివల్ల ఒక్కోసారి కొన్ని వైరస్
scriptsలు కలిగిన సైట్లలోకి వెళ్లి తంటాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి Firefox బ్రౌజర్ ని ఉపయోగించే వారికి Interclue అనే addon లభిస్తోంది. ఇది ఏదైనా లింకు పైకి మౌస్ ని తీసుకువెళ్లగానే ఆ సైట్ లోపల ఏముందో ప్రివ్యూ చూపించడంతో పాటు ఈ క్రింద తెలుపబడిన ఇతర వివరాలూ తెలియజేస్తుంది.

ప్రత్యేకతలు:

* లింకులోని text రూపంలో ఉన్న సమాచారం చూపిస్తుంది.
* ఆ పేజీ యొక్క చిన్న snapshot చూపించబడుతుంది.
* ఆ పేజీలో ఏవైనా ఫైళ్లకు లింకులు ఇవ్వబడి ఉంటే ఆయా ఫైళ్ల పరిమాణం, సర్వర్ లోకి అప్ లోడ్ చెయ్యబడిన తేదీ చూపిస్తుంది.
* ఆ పేజీకి సంబంధించిన గణాంకాలు, meta dataని చూపిస్తుంది.

ఈ addonని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత వెబ్ పేజీల్లో ఏవైనా లింకుల వద్ద మౌస్ ని కొన్ని క్షణాలు ఉంచితే ఒక బ్లూ కలర్ ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే చిన్న inline విండోలో పై వివరాలన్నీ అందుబాటులోకి వస్తాయి.

గమనిక: ఇదే పేజీలో ఉండగా ఆ addonని ఇన్ స్టాల్ చేసుకోవాలంటే ఈ క్రింది లింకుని క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
శ్రీధర్ గారు,

చాలా మంచి ఫైర్ ఫాక్స్ addon ను పరిచయం చేశారు. ఇంటర్నెట్ లో ఎక్కువగా బ్రౌజింగ్ చేసేవారికి ఈ addon ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
శ్రీధర్ గారు....

మంచి విషయం చెప్పారండీ.....నేను వెంటనే... డౌన్ లోడ్ చేసుకున్నాను. ధాంక్స్.
Quote this message in a replyReply

Post: #4
sridher garu,

good post......keepitup


thanQ......
Quote this message in a replyReply

Post: #5
edi firefox 3.5 ki pani cheyadu.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)