Post: #1
డియర్ Mahigrafix team,
ప్రస్తుతం PC Users కి ఏదో ఒక సమస్య వచ్చిపడుతూనే ఉంది. PC ని మనం వినియోగించే విధానం వలన ఈ సమస్యలు తలెత్తుతుండవచ్చు. అందువలన PC సాధ్యమైనంతవరకు Troubles (software & hardware) రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు....
మీ tips ద్వారా అనుకోకుండా వచ్చి పడే సమస్యలను ఎంతో కొంత నివారించడానికి వీలుపడుతుందని ఆశిస్తున్నాను............Thanks in advance.

Post: #2
మనం ఉపయోగించే వస్తువులలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు
తీసుకోవడం చాలా ముఖ్యమైనది . అయితే కంప్యూటరులో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా
ఉంటాయి - ఇవి ఏర్పడకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుందాం అని ఒక వరుసలో ముఖ్యమైన
జాబితాని ఇవ్వడం కాస్త కష్టమైన పనే . ఇది ముఖ్యమైనది అని తేల్చుకోవడం నిజంగా కష్టమే

నిజానికి మనం శోధిస్తే ఆంగ్ల సైటులలో , బ్లాగులలో సంబంధిత విషయాలు అనేకం ఉంటాయి .
అయితే అలా ఆ సైట్ల జాబితా / చిట్కాల చిట్టా ఇవ్వకుండా క్లుప్తంగా తోచినది మనవి చేస్తాను .
నిజానికి ఇలాంటివి మనం ఎక్కడో చదివి / విని ఉంటాము - పాటించడంలో శ్రద్ధ ఉండకపోవచ్చు Smile

1* మనకి ఎక్కువగా అవసరమున్న ప్రోగ్రాములని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి . హార్డుడిస్కు
లో కనీసం పాతికభాగం ఖాళీగా ఉంచుకోవాలి . సగభాగం ఖాళీ గా ఉంచగలిగితే మరీ మంచిది .

2* తరుచుగా ఉపయోగించని డేటా ఫైళ్లని (ముఖ్యంగా మ్యూజికు , వీడియో) వేరే హార్డు డిస్కు
లోకి మార్చుకోవాలి . ఆపరేటింగు సిస్టమ్ ఉన్న భాగంలో [ముఖ్యంగా desktop పైన] అనేక
డేటా ఫైళ్లు ఉండటం వల్ల కంప్యూటరు పనితనం మందగించే ప్రమాదం ఉంది .

3* కంప్యూటరు భాగాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి . పైకి మనకి కనిపించే
భాగాలని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు , లోపల ఏర్పడే దుమ్ముని కూడా తగిన జాగ్రత్తలతో
సుమారు ప్రతి మూడు/నాలుగు నెలలకి ఒకసారి శుభ్రం చేసుకోవాలి .

4* కంప్యూటరుకి UPS వాడటం తప్పనిసరి . UPS లోని బ్యాటరీ తో కంప్యూటరుని ఎక్కువ
సేపు పనిచేయించకుండా - అవసరమున్నంతమేరకే ఉపయోగిస్తే మన్నిక ఎక్కువగా ఉంటుంది

5* మన ఇంట్లోకి దొంగలు జొరపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో - అలాగే మన
కంప్యూటరులోకి ఇతరుల అనవసరమైన ప్రోగ్రాములు , వైరసులు , ట్రోజానులు ... మొ||
చేరకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది .

6* మన ఇంట్లో ఎలాగైతే వస్తువులని పొందికగా అమర్చుకునే ప్రయత్నం చేస్తామో అలాగే
కంప్యూటరులోని ఫైళ్లని , డేటాని చక్కగా అమర్చుకునే ప్రయత్నం చేయాలి . ఇందుకు
తగిన ఫోల్డర్లని ఏర్పాటు చేసుకోవడం , తరుచు డిఫ్రాగ్మెంటేషను చేయడం అవసరం .

... ఇలా ఇంకా ఎన్నో మనం పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి . వాటిని ఇక్కడ ఫోరం
నిపుణులు తెలియచేస్తారు . ఆసక్తి ఉన్నవారు You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)