Post: #1
[Image: w859o6.png]

సభ్యులారా....మిత్రులారా....తెలుసుకోండి...

ఆమ్యామ్యాలు ఇస్తేనే పని అవుతుందని అంటున్నారా....

అయితే మీరు సమాచార చట్టం గురించి తెలుసుకోండి....

సమాచార హక్కు చట్టం 2005 కింద దరఖాస్తు చేయడం ఎలా?

* మారేషన్ డీలరుకు నెలకు ఏయే వస్తువులు, ఎంత పరిమాణంలో వస్తున్నాయి? అతని పరిధిలోని కార్డులెన్ని? అవి ఎవరెవరి పేరుతో ఉన్నాయి?

* మాఊరికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి? వాటిని ఎవరెవరికి కేటాయించారు? వారి అర్హతలేమిటి?

* మా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఏడాదికి ఏమేరకు నిధులు మంజూరవుతున్నాయి.? వాటిని ఏం చేస్తున్నారు? ఎన్ని మందులు వస్తున్నాయి? ఎవరెవరికి ఇచ్చారు?

* ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎవరెవరికి, ఎంతెంత సహాయం అందజేశారు?

* మా జిల్లా ప్రజాప్రతినిధులు (ఎంపీ, ఎమ్మెల్యే) ఫలానా సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఏయే పనులు చేశారు?

* వివిధ ప్రభుత్వ శాఖల వాహనాలకు అధికారులు ఏయే పనులకు వినియోగిస్తున్నారు? అందుకు అవుతున్న ఖర్చెంత? లాగ్ బుక్ వివరాలేమిటి?...

ఒకటేమిటి ఎన్నో... ఎన్నెన్నో... ఒకప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే సాధారణ పౌరులకి సాధ్యమయ్యేది కాదు. అసలు నువ్వెవరివి ? వాటితో నీకేం పని? అని అధికారులు, ప్రజాప్రతినిధులు గద్దించేవారు. ఇప్పుడు ఏ సమాచారాన్నైనా అడిగే అధికారాన్ని మనకు దఖలు పరిచింది సమాచార హక్కు చట్టం. ఆ చట్టం ఏం నిర్దేశిస్తోందో తెలుసుకుందాం...

ప్రజలకు సంబంధించిన పాలన వ్యవహారాలు వారికి తెలియాలంటూ అన్నాహజారే, అరుణారాయ్, తదితర స్వచ్ఛంద సేవకులు, మానవ హక్కు ల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పొరాటాలు జరిగాయి. వారి కృషి ఫలితంగా సమాచార హక్కు చట్టం-2005 అమల్లోకి వచ్చింది. అంతకు మునుపు కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఆ కోవలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రయోజనకరంగా లేదని సమాచార హక్కు ఉధ్యమకారులు వ్యతిరేకించారు. దాంతో ఆ చట్టం ఎలా ఉండాలో రూపొందించమని ప్రభుత్వం అన్నాహజారేను కోరింది. అలా ఆయన రూపొందించిన పత్రం జాతీయ స్థాయిలో చట్టంగా రూపుదిద్దుకుంది. ప్రజలు తమ కోసం తామే రూపొందించుకున్న తొలి శాసనం ఇదే. అక్టోబర్ 12, 2005 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ రోజు ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ. ప్రభుత్వ కార్యాలయాల్లో రూపొందే సమాచారం ప్రజలది. ఆ సమాచారాన్ని ప్రజలకు చెప్పడం అధికారుల భాధ్యత.
ఇదీ హక్కు అంటే...

1. ప్రభుత్వం నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు.
2. పౌరులందరికీ(సెక్షన్ 3) సమాచారం అడిగే హక్కు ఉంది. ఇవాల్సిన భాధ్యత ప్రభుత్వానిది.
3. ప్రభుత్వ అధికారులు జనం అడిగితే ఇవ్వడం సంగతి సరే. అడగకపోయినా వారంతట వారే (సెక్షను 4 ప్రకారం) విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి.

సమాచారం అంటే...

రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో భద్రపరిచిన సమాచారం.

ప్రభుత్వ విభాగం/శాఖ ఆధీనంలో ఉన్న లేదా నియంత్రణలో ఉన్న లేదా ఈ చట్టం ద్వారా స్వీకరించగల సమాచారం అని మరో నిర్వచనం. పనిని, పత్రాలను, రికార్డులను తనిఖీచేయడం, నోట్స్ తీసుకోవడం, కొన్ని భాగాల ధ్రువీకృత ప్రతులు తీసుకోవడం, ప్రింట్ తీసుకోడం, తదితరాలు.
ఎవరిని అడగాలి?

ప్రతి కార్యాలయం ప్రజా సమాచార, సహాయ ప్రజా సమాచార అధికారులను నియమించాలి. సమాచారం కావల్సిన వారు ఈ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ విభాగం అంటే...

ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. శాసనసభలో శాసనసభ్యుడు అడగగలిగే ప్రతి సమాచారాన్నీ ప్రజలూ అడగవచ్చు. ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు కూడా దీని కిందకు వస్తాయి. జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు... సమాచారం ఇవ్వాలి.
నువ్వెవరు? నీకెందుకు?

ఈ చట్టంతో ఇలాంటి ప్రశ్నలకు తావు లేదు. సమాచారం అడిగే వారు కారణాలు చెప్పాల్సిన పని లేదు. ఏ సమాచారం కావాలి? దాన్ని ఎలా ఇవ్వాలి? వివరిస్తూ, ఎక్కడ ఇవ్వాలో చిరునామా రాస్తే చాలు. సమాచార అధికారి దరఖాస్తు తీసుకుని స్వీకరించినట్టు రసీదివ్వాలి. తరువాత 30 రోజులలోగా (సెక్షన్ 5) సమాచారాన్ని అందజేయాలి. లేకపోతే తిరస్కరణకు కారణాలు వివరిస్తూ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి.
మినహాయింపులు

సెక్షను 8 ప్రకారం కొన్ని సంస్థలకు మినహాయింపులున్నాయి. కేంద్ర ప్రభుత్వం రెండో షెడ్యూల్ లో పేర్కొన్న 22 భద్రతా సంస్థలకు, గూఢచారి సంస్థలకు ఈ చట్టం వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రంలో ఏడు గూఢచారి, భద్రతా సంస్థలను ఈ చట్టం నుంచి మినహాయించింది. వీటిలోనూ ప్రజాప్రయోజనాలకు సంబందించిన సమాచారాన్ని కొన్ని పరిమితులకు లోబడి గరిష్ఠ వ్యవధి 45 రోజుల్లో ఇవ్వాలి.
రుసుము, ఖర్చు

తెల్లకార్డున్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ రుసుము ఉండదు. మండల స్థాయిలో రూ. అయిదు, జిల్లా స్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు. అడిగిన తరువాత నెలరోజులు దాటితే ఎంత ఆ సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలి.

పరిణామం

సమాచార హక్కు చట్టం – మైలురాళ్లు

1990............................................ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ఉద్యమం

1997 ............................................ తమిళనాడు, గోవా స.హ.చట్టం ఆమోదం

2000 .......................................... రాజస్థాన్, కర్ణాటక ఆమోదం

2001 ............................................ ఢిల్లీ

2002 ........................................... మహారాష్ట్ర, అస్సాం

2003 ........................................... మధ్యప్రదేశ్

2004 ........................................... జమ్మూ కాశ్మీర్

2004 ........................................... చట్టం ముసాయిదా రూపకల్పన

23.12.2004 ................................ లోక్ సభలో ప్రవేశపెట్టారు.

11.05.2005 ................................ లోక్ సభ ఆమోదం

12.05.2005 ................................ రాజ్యసభ ఆమోదం

15.06.2005 ................................ రాష్ట్రపతి ఆమోదం

21.06.2005 ................................ గెజిట్ లో ప్రచురణ

12.10.2005 ................................ దేశవ్యాప్తంగా స.హ.చట్టం అమల్లోకి..

సమాచార దరఖాస్తులకు....ఈ క్రింది లింక్స్ నుండి చూడండి.


You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
చాలా మంచి విషయం చెప్పారు. థాంక్స్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
చాలా ఉపయేగకరమైన విషయం తేలిపినందుకు ధన్యవాదాలు thanx సుమణి వెంకట్ గారు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)