Post: #1
ఎంతొ బాధ కలిగించే అనేకమంది ఆర్తనాదాలు, హృదయవిదారక గాధలు, వినకూడని వార్తలు, చూడటానికే భయం గొలిపే దృశ్యాలు - వారినెవరు ఆదుకుంటారు, వారినెవరు ఓదారుస్తారు, వారినెవరు ఆదరిస్తారు? మనమెందుకు కాకూడదు?

ఇదంతా మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లా లొ వరదలు చేస్తున్న ప్రళయం లొ బాధితులైన వారి గురించి వారి బాధల గురించి ఎంత విన్నా ఇంకా మిగిలే ఉంటుంది. అందంగా, ఆహ్లాదంగా కొనసాగిపోతున్న ఎన్నో జీవితాలలొ చెప్పరాని భయం, బాధ, ఆదుర్దా, నిరాశ, నిస్పృహ - ఇళ్ళు, ఆస్తులు కోల్పోయి బజారున పడిపోయిన బ్రతుకులెన్నో, అయిన వారిని కోల్పోయిన బ్రతుకులెన్నో, అనాధలైన బ్రతుకులెన్నో . . . . .



మన ఫోరం తరఫున వరద బాధితులందరికి సంఘీభావం ప్రకటిస్తూ, మన వంతు సహాయం, ఇదేదో గొప్పకార్యం కావాలని లేదు - ఒక బాధిత కుటుంబాన్ని ఒక పూట భొజనం పెట్టి ఆదరించినా అదే వారికి పదివేలు. ఈ మాత్రం సాయమైనా మనం చేయలేమా, ఆ విధమైన కనీస సంఘీభావం మానవత్వంతో చూపలేమా, మన శక్తిమేర మనం ప్రతి ఒక్కరం సహయపడదాం.

మిత్రులారా! ఆలోచించి చూడండి. మీరున్న ప్రదేశం నుండే వివిధ రకాలుగా సహాయం చేయవచ్చు, వారిని ఆదుకునే అదృష్టాన్ని మనం పొందవచ్చు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)