Post: #1
sir,

naaku computer operating chesetapudu konni sandehalu vunnayi

a. registry gurinchi akkadakkada choostuntanu. registry ante emiti?

b. internet dvara virus vastadanta kada? nenu upayoginche anti virus internet nunchi virus raakunda chestunda leda? telusukovadam ela?

c. blogulu dwara ememi cheyagalamu? asalu blogulu enduku?

d. firewall ante emiti? daanivalla edyna nashtam vunda?


e. personal ga manaku vache amount, karchu pette amount la nu feed cheyadaniki personal accounting sofware edyna vunda? nenu chala choosanu kani rupees lo ledu

f. photos sulabamga baground marchadaniki manchi software edi? alage photolaki frames ekkada dorukuthayi?

g. oka rojulo computer enta sepu vaadochu?

h. internet dwara choose sites ni connection lenapudu browse cheyalante emi cheyali?

i. everyna mail cheste vaallu evero telusukovadam ela?

j. ee madya twitter ani choostunnanu. twitter ante emiti?

please sir, ee doubts naaku clear cheyandi.
Quote this message in a replyReply

Post: #2
అనేక ప్రశ్నలని ఒకేసారి సంధించారు Smile
దాదాపు అన్నిటి సమాధానాలూ ఇక్కడ ఫోరంలలో ఉన్నాయి ! అయినా ఒక క్రమంలో ఇక్కడ
అన్ని సందేహాలకీ సమాధానమిస్తాము . ఈ విషయాన్ని You are not allowed to view links. Register or Login to view. Smile

[a]
విండోసు ఆపరేటింగు సిస్టమ్ సెట్టింగులన్నీ రిజిస్ట్రీలో పొందుపరచబడి ఉంటాయి . విండోసుకి రిజిస్ట్రీ
చాలా ముఖ్యమైనది . రిజిస్ట్రీ సెట్టింగులలో ఏవైనా ముఖ్యమైనవి తొలగించబడినా లేదా మార్పులు
ఏర్పడినా ఇక ఆ కంప్యూటరు సరిగ్గా పని చేయదు . కొన్ని వైరసుల సెట్టింగులు కూడా రిజిస్ట్రీలోకి
చేరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి .

[b]
ఇంటరునెట్ ద్వారా వైరస్లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి . అయితే మనం ఏంటీ వైరసుని వాడటం
ద్వారా వైరసులని రాకుండా నిరోధించవలసి ఉంటుంది . ఏంటీ వైరసు swకి వైరసుల డేటాబేస్ ని
తరుచూ అప్డేట్ చేయటం చాలా అవసరం . McAfee , Norton , KasperSky , Quick
Heal ... ఇలాంటి సమర్థమైన ఒక ఏంటీ వైరసుని ఉపయోగిస్తే మంచిది .

మన ఏంటీ వైరసు సమర్ధవంతంగా పనిచేస్తున్నదా లేదా అనేది మామూలుగా మన అనుభవంలోనే
తెలుస్తుంది . తరుచూ వైరస్లని అడ్డుకుంటున్నట్లు మీకు సిస్టమ్ ట్రే వద్ద నోటిఫికేషనులు కనిపిస్తూ
ఉంటే సరిగ్గా పనిచేస్తున్నట్లే అర్ధం చేసుకోవాలి . ఇక సింపుల్ పరీక్షని You are not allowed to view links. Register or Login to view. !

[c]
బ్లాగులలో మనకి నచ్చిన ఏ విషయాలనైనా పొందుపరుచుకోవచ్చును . ఒక్క మాటలో
చెప్పాలంటే ఎవరి బ్లాగువ్రాతలు వారి ఇష్టం . You are not allowed to view links. Register or Login to view.

[d]
ఫైరువాల్ అనేది ఏంటీ వైరసులాగే ఒక రక్షణ వలయం . ఇది కంప్యూటరులో కొన్నిరకాల
ప్రమాదకర ప్రోగ్రాములు చొరబడకుండా అడ్డుకుంటుంది . మామూలుగా ఇంటరునెట్ కి
మనం కనెక్టు కావాలన్నా ఫైరువాల్ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది . విండోసు
XP లో అంతర్గతంగా ఒక ఫైరువాల్ ఉంటుంది . ఇది సాధారణ వాడుకదార్లకి సరిపోతుంది .
ఎక్కువ సమర్థత కొరకు McAfee , ZoneAlarm వంటి ప్రసిద్ధ సంస్థల ఫైరువాల్ ని
ఉపయోగిస్తూ ఉంటారు .

[e] & [f] సమాధానాల కోసం వేచి చూడండి

[g]
మీరు ఉన్న ప్రాంతం వాతావరణ పరిస్థితిలని బట్టి , మీ కంప్యూటరు ఆరోగ్య స్థితిని బట్టి
& మీ అవసరాన్ని బట్టి మీరు కంప్యూటరుని వాడవలసి ఉంటుంది . విద్యుత్తు హెచ్చు
తగ్గుల క్రమాన్నీ పరిశీలించవలసి ఉంటుంది . సాధారణ పరిస్థితిలలో చక్కగా పని
చేస్తూ ఉన్న ఒక కంప్యూటరుని రోజుకి సుమారు 16 గంటల సేపు వాడుకోవచ్చును Smile

[h]
మీ బ్రౌజరు హిస్టరీని ఒక నెల వరకు ఉండేలా సెట్టింగులని పెట్టుకుని , ఇదివరకు
చూసిన సైటులని అవసరాన్ని బట్టి off-line విధానంలో మరల చూడవచ్చును .

[i]
మనకి మెయిలు పంపినది ఎవరనేది నేరుగా తెలుసుకోవడం కుదరదు . చాలా
వరకు మెయిలు సర్వీసులలో గోప్యత విధానం అమలులో ఉంటుంది . అయితే
యాహూ వంటి మెయిలు సర్వీసుల్లో మెయిలు "* headers" చూడటం
ద్వారా అందులోని ప్రధాన IP address ని గుర్తించి ఆ మెయిలు ఏ ప్రాంతం
నుండి వచ్చినది , ఏ ఇంటరునెట్ సర్వీసు ఉపయోగించబడినదీ గుర్తించవచ్చు

[j] ట్విట్టరు అనేది ఒక సూక్ష్మ బ్లాగింగు ఉపకరణం . బంధుమిత్రులతో తరుచూ
ఈ మెయిలు సందేశాలకి తగిన సమయం లభించకపోవడం వల్ల ఈ పద్ధతి బాగా
వ్యాప్తిలోకి వచ్చింది . ఏ సమయంలోనైనా " ఏమి చేస్తున్నది " ( what are
you doing right now ) సన్నిహితులకి తెలియచేయడానికై ఈ ట్విట్టరు
ఉద్దేశించబడింది . అయితే బ్లాగులు , వెబ్ సైటుల నుండి తాజా సమాచారం
తెలియచేయడానికి ఇటీవల దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు .
ఉదా|| You are not allowed to view links. Register or Login to view.

* ఇతర మిత్రులు మరికొన్ని వివరాలని తెలియచేయగలరు Smile
Quote this message in a replyReply

Post: #3
అనూష గారు

మీరడిగిన ప్రశ్న ల లొ 'e' కు సమాధానం గా క్రింది ఇమేజ్ ని క్లిక్ చేయండి. దానిలొ ని ఉచిత సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించండి, లేదా MS Excel లోనే మనం చక్కగా మన ఆదాయ వ్యయాలను, వాటి వివరాలను నిర్వహించుకోవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: 20f5a11.jpg]


మీరడిగిన ప్రశ్నల లొ 'f' కు సమాధానం గా క్రింది లింక్ లను చూడండి.


You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Dear Ausha madam Garu,
First of all U need to learn computer related magazines,
all of your questions are so simple.
stay tuned for some time.

[warn]Note by Moderator :
if answers to questions are so simple Smile , then we would have not
stayed here serving tips , suggestions and solutions to the needed[/warn]
Quote this message in a replyReply

Post: #5
wow really great mn sir

inta clearga samadanam vastundani nenu expect cheyaledu, meeru enta time teeskoni answer chepparo kani mee answer mathram naaku enno rojula nunchi vunna doubts clear chesindi. kani nene timeki mee answer chudalekapoyanu. ippude idi naa computerlo save cheskunnanu. thanks very much sir.

prasad sir :

meeru choopina personal ac soft baagundi kani ila kakunda kevalam balance, income and expenditure lanu enter cheyadaniki simplga edyna soft vunte cheppandi please sir.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)