Post: #1
ఈ ప్రశ్న అడగడానికి కావలసిన విభాగం కోసం అరగంట ప్రయత్నించినా దొరకలేదు. ఇక్కడ దొరికిన ఖాళీలో రాస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు.
ఇంతకీ ప్రశ్నలేదా సందేహం ఏమిటంటే...
మన దగ్గర ఈ డిజిటల్ కి పూర్వం వచ్చిన (మహా అయితే ఐదేళ్ళక్రితం-పూర్వం అంటే)అనలాగ్ వీడియో కెమేరా ఉందనుకోండి. అందులో విహెచ్ఎస్ కాసెట్ లోకి మన జీవితంలో ముఖ్యమైన ఎన్నో సందర్భాలలో వీడియో ని తీసి దాచుకున్నాం కదా.పెళ్ళిళ్ళు,పిల్లల మొదటి్ పుట్టినరోజు పార్టీలు ఇలా.మరి వీటిని డివిడి లోకి మార్చి ఆ కాసెట్ లోని అంశాలకి జీవితాన్ని పొడిగించడం ఎలా.
అలా పాత కాసెట్ లోని సమాచారం డివిడిలోకి మార్చడానికి కావలసిన హార్డ్ వేర్ అంటే వైర్లు గట్రా ఏమిటి,ఎలాఉంటాయి.
సాఫ్ట్ వేర్ అంటే డ్రైవర్లు గట్రా లాంటి విషయాలను ఎవరేనా తెలిసిన మహానుభావులు మాలాంటి వారికి తెలిపి మమ్మల్ని ధన్యులను చేయగలరని ఆశిస్తున్నా.
ప్రతి కాసెట్ ని ఆ కన్వర్ట్ చేసే షాప్ లో కూర్చుని చేయించుకొనే ఓపిక,తీరిక రెండు లేని వాళ్లకి ఆ సాఫ్ట్ వేర్ ఎక్కడ దొరుకుతుందో,ఎంత ఖరీదుంటుందో సుమారుగా చెప్పగలిగితే మరీ మంచివాళ్లు.

Post: #2
ఒక సులువైన పద్ధతిని ముందుగా తెలియచేస్తాను Smile

మీవద్ద మంచి నాణ్యత కలిగిన వీడియో కేసెట్ ప్లేయరు & చక్కగా పని చేస్తూ ఉన్న కంప్యూటరు
[> 1GB RAM తో] , ఇంకా కంప్యూటరులో వీడియో రికార్డింగు సౌకర్యమున్న ఒక టివి
ట్యూనరు కార్డు
ఉంటే చాలు - సాధారణ వీడియో & ఆడియో కనెక్టింగు వైర్లతో మీ కేసెట్లలోని
వీడియోని మీరే స్వయంగా డిజిటలైజ్ చేసుకోవచ్చును . ఇలా కంప్యూటరులో రికార్డు చేసుకునే
వీడియో నాణ్యత మీ వీడియో కేసెట్ ప్లేయరు & టివి ట్యూనరుకార్డు , కంప్యూటరుల పనితనం
పై ఆధారపడి ఉంటుంది .

You are not allowed to view links. Register or Login to view. Smile

Post: #3
VHS (Video Home System) క్యాసెట్ ను డిజిటల్ వీడియో రూపంలోకి మార్చుకోవడానికి కావలసిన హార్డ్ వేర్ డివైజెస్:

1. VHS క్యాసెట్ ను ప్లే చేయటానికి VCP లేదా VCR

[Image: 4hyt07.jpg]

2. VCP లో ప్లే అవుతున్న క్యాసెట్ యొక్క వీడియోను మరియు ఆడియో OUTPUTను కంప్యూటర్ లోకి INPUT గా తీస్కొని రికార్డ్ చేయడానికి DV/AV క్యాప్చర్ కార్డ్ లేదా TV TUNER CARD. (ఈ కార్డ్ ను మీ కంప్యూటర్లోని pci slot కు బిగించాలి)

[Image: fuxhy.jpg]


3. VCP OUTPUT SIGNAL ను CAPTURE CARD INPUT కు చేర్చడానికి AV CABLE

[Image: 2unwr2w.jpg]

ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే క్యాప్చర్ కార్డ్ కొనుగోలు చేసినపుడు కార్డ్ తో పాటు ఇచ్చే సీడీలో ఉన్న డివైజ్ డ్రైవర్స్ మరియు రికార్డింగ్ కోసం అందులో ఉన్న సాఫ్ట్వేర్ సరిపోతుంది. లేదా కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి.

క్యాప్చర్ చేసే విధానం:

1. ఏ క్యాసెట్ నైతే కంప్యూటర్లోకి రికార్డ్ చేస్కోవాలనుకుంటున్నారో, ఆ క్యాసెట్ ను vcp లో ఉంచి రివర్స్ బటన్ ను ప్రెస్ చేసి క్యాసెట్ మొదటి వరకు రివర్స్ చేయండి.

2. vcp లో ఉన్న వీడియో మరియు ఆడియో output లకు av cable కు ఒక వైపు ఉన్న 3 పిన్నులను కనెక్ట్ చేయండి.
స్టాండర్డ్ కలర్ కోడింగ్ ప్రకారం 3 పిన్నులలో పసుపు రంగు పిన్నును vcp లో video out కు, red మరియు white పిన్నులను vcp లో left audio out మరియు, right audio out లకు కనెక్ట్ చేయండి.

[Image: 2807f50.jpg]

3. ఇక av cable రెండవ వైపున ఉన్న 3 పిన్నులను capturing card లో video input కు పసుపు రంగు పిన్నును మిగిలిన red మరియు white pins ను capturing card లో audio input లక కనెక్ట్ చేయండి.

[Image: 25ap5di.jpg]

4. కంప్యూటర్లో capturing card కోసం ఇన్స్టాల్ చేసిన రికార్డింగ్ సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేయండి. ఆ సాఫ్ట్వేర్లో settings లో డీవీడీ కోసమైతే dv లేదా m2v లను సెలెక్ట్ చేయండి. (హార్డ్ డిస్క్ లో ప్లేస్ ఎక్కువగా ఉంటేనే dv ఫార్మాట్ ను సెలెక్ట్ చేయండి.) vcd కోసమైతే mpeg-1 ను సెలెక్ట్ చేయండి.

5. vcp లో ప్లే బటన్ ను ప్రెస్ చేసి, రికార్డింగ్ సాఫ్ట్వేర్ లో రికార్డింగ్ బటన్ ను ప్రెస్ చేయండి.

క్యాప్చర్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అయిన వీడియో ఫైల్ ను You are not allowed to view links. Register or Login to view. ద్వారా కానీ, You are not allowed to view links. Register or Login to view. ద్వారా కానీ డీవీడీ లోకి రికార్డ్ చేయండి.

[Image: mahi_sig.jpg]

Post: #4
మహి గారు

నేను కూడా ఈ ప్రాసెస్ గురించి చాలా కాలం నుంచి తెలియక సతమతమౌతున్నాను. చాలా తేలికగా విడమర్చి చెప్పారు, ధన్యవాదములు సర్!

అయితే DV/AV క్యాప్చర్ కార్డ్ మరియు TV TUNER CARD ఎక్కువ నాణ్యత కలిగినవి మీరు సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ స్పెసిఫికేషన్స్ ను మనం పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది?

Post: #5
చాలా బాగా వివరంగా అందరికీ అర్థం అయేలా చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది.
ప్రసాద్ గారు చెప్పినట్టు-DV/AV క్యాప్చర్ కార్డ్ మరియు TV TUNER CARD ఎక్కువ నాణ్యత కలిగినవి,టివి ట్యూనర్ కార్డు కొనేటప్పుడు చూసుకోవలసిన స్పెసిఫికేషన్స్ కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ...అన్నట్టు ఈ టివిట్యూనర్ కార్డు వీడియో కెమేరాలో అనలాగ్ రికార్డర్లకి కూడా వర్తిస్తుంది కదూ..

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)