Post: #1
ఎక్సెల్ లో మీరు తయారు చేసిన వర్క్ షీట్స్ లోని సెల్స్ లో కానీ, కాలమ్స్ లో కానీ ఇతరులెవరూ వాల్యూస్ మార్చకుండా మీ పాస్వర్డ్ తో ప్రొటెక్షన్ ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందామా?

1. డీఫాల్ట్ గా అన్నీ సెల్స్ లాక్ అయివుంటాయి కాబట్టి, ముందుగా వర్క్ షీట్ మొత్తాన్ని Ctrl+A ద్వారా సెలెక్ట్ చేయండి. తర్వాత వర్క్ షీట్ మధ్యలో రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో Format cells ను క్లిక్ చేయండి. Format cells విండోలో protection విభాగంలో Locked కు ముందు ఉన్న చెక్ మార్క్ ను తొలగించి ok ప్రెస్ చేయండి.

[Image: 8vwz9u.jpg]

2. మీరు ఏ సెల్స్ నైతే మీ పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్స్ ను సెలెక్ట్ చేసి, రైట్ క్లిక్ చేసి పాపప్ మెనూలో Format cells ను క్లిక్ చేయండి. Format cells విండోలో protection విభాగంలో Locked కు ముందు చెక్ మార్క్ ను అప్లై చేసి ok ప్రెస్ చేయండి.

[Image: 2q1dh1i.jpg]

3. ఇపుడు Tools >> Protection >> Protect Sheet ను క్లిక్ చేసి Protect Sheet విండోలో ఈ క్రింది విధంగా పాస్వర్డ్ ట్యాబ్ లో మీ పాస్వర్డ్ టైప్ చేసి ok బటన్ ను ప్రెస్ చేయండి.

[Image: 141aok.jpg]

4. మీరు సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నీ మీ పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ అయివుంటాయి. ఒకవేళ ఆ సెల్స్ లో ఎవరైనా వాల్యూస్ మోడిఫై చేయాలని ట్రై చేసినా ఈ క్రింది విధంగా unprotect చేయమని మెసేజి వస్తుంది. ఇదే విధంగా కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసి కాలమ్ ను కూడా లాక్ చేయవచ్చు.

[Image: 2dba4w0.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
word lo unna docement ni ela protect cheyali?
Quote this message in a replyReply

Post: #3
Mahi garu chala manchi post

goud
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)