Post: #1

మిత్రులారా.....!!

అనుభవపూర్వకంగా  తెలుసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

CD గీతలు పడి ఓపెన్ కాకపోతుంటే తెలుసుకున్న విషయాన్ని తర్వాత సక్సెస్ అయిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.  చిత్తగించండి.

ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది.

సైట్ లింక్ : You are not allowed to view links. Register or Login to view.

ఇందులో సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోండి.  అప్పుడు .exe పైల్ గా వచ్చిన దానిని మీరు సిస్టంలో రన్ చేసి తదుపరి స్టెప్ ల ద్వారా మీరు సిడీ లేదా డివిడి డ్రయివ్ లో ఇన్ సర్ట్ చేసి తెలుసుకోవచ్చు.

ఫైనల్ గా ఏమని చెప్పొచ్చంటే....ISO Buster అనేది CD, DVD, BD/HD DVD Data Recovery Software.  మీకిలాంటి ప్రాబ్లమ్ ఉంటే ప్రయత్నించి చూడండి.

Quote this message in a replyReply

Post: #2

[Image: j7ujch.jpg]

ముందుగా మంచి సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసినందుకు శ్రీ సుమణివెంకట్ గారికి ధన్యవాదములు.

ఈ సాఫ్ట్ వేర్ తొ నాకు తెలిసి ముఖ్యంగా 3 రకాల ఉపయోగాలున్నాయి. అవి

1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని దానిలోని కాంటెంట్ ను సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.


ముందుగా మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.

[Image: 9kw6r4.jpg]

బూటబుల్ గా లేని విండోస్ సిడి లాంటివి కాని, లేదా కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొత్తగా విండొస్ సిడి ని బూటబుల్ గా మార్చుకోవాలనుకున్నా మనకు ఒరిజినల్ బూట్ ఇమేజ్ అవసరమౌతుంది. దానిని మనం విండోస్ సిడి నుండి తీసుకోవచ్చు. అది క్రింది ఇమేజ్ లో చూడండి.

[Image: audz04.jpg]

Quote this message in a replyReply

Post: #3
good explanation prasad garu.
Quote this message in a replyReply

Post: #4

సుమణీ వెంకట్ గారికి మరియు ప్రసాద్ సర్ కి ధన్యవాదములు..ఈ పోస్ట్ నాకు చాలా ఉపయోగపడింది.నిరుపయోగంగా ఉన్న నా పాత DVD నుండి డాటా రికవరీ చేయగలిగాను..

Quote this message in a replyReply

Post: #5

use ful tip, thanq so much.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)