Post: #1
మన ఫోరం ఆడపడుచు శ్రీథరాల జాహ్నవిగారికి నా హృదయపూర్వక శుభాశీస్సులు
చాలా బాగా పార్టిసిపేట్ చేసి ఇలా విజేత అయి రావటం మన ఫోరం లోని సభ్యులందరికీ గర్వకారణం....!!
స్పూర్తిదాయకం.
వ్యక్తిగతం గానూ నేను చాలా ఆనందిస్తున్నాను. తనను అభినందిస్తున్నాను.
ఇదే విధంగా మరింత మెరుగైన విధానంతో మరింతగా ఉల్లాసంగా, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఎవర్ గ్రీన్ గా నిలుస్తారని ఆశిస్తూ....
మరొక్కమారు మహిళా శక్తి జేజేలు పలుకుతూ.....

నమస్కారం

[Image: jt2g54.png]
Quote this message in a replyReply

Post: #2

వ్యక్తిగతంగా అభినందనలు తెలియచేసినప్పటికీ ఫోరం ద్వారా అభినందనలు తెలియచేయటం లో ఉన్న సంతృప్తి వేరు. అందుకే ఫోరం ద్వారా కూడా జాహ్నవి గారికి అభినందనలు తెలియచేస్తున్నాను.

జీవి (గోపాల్ వీరనాల) మాస్టారు గారి వద్ద శిష్యరికంలో నేను, జాహ్నవి గారు సహాధ్యాయులం. ఆమెలొ ఎపుడూ తనకు నచ్చిన ప్రతి దానిని నేర్చుకుని దానిలో మాస్టర్ కావాలనే కోరిక,  అది నేర్చుకోవటం పూర్తయ్యేవరకు కూడా ఎంతో శ్రమ పడుతూ పట్టుదలతో నేర్చుకుంటారు. నిజంగా ఆమెకు కొన్ని కొన్ని విషయాలు నేర్పటం కూడా ఆమె నేర్చుకునే పద్ధతి చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది.

నా కుమార్తె సమానురాలు గా నేను భావించే జాహ్నవి తన జీవితం లో మరిన్ని మెట్లు ఎక్కుతూ కీర్తి ప్రతిష్టల శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిస్తూ మరొక్కసారి అభినందనలు తెలియచేస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #3

Thank U very Much for u r support.

mee sodara premaku, pitru vaatsalyaaniki dhanyavaadamulu.

No words to say with excitement

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)