Post: #1

మిత్రులారా...!!

సరదాకు ఒక విషయం  చెపుతాను.

నేడు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్నది కదా....!!

అయితే తెలీని కోణాలు కూడా పెరుగుతున్నాయి.

వీటిని మనం ఆమోదించవలసినదేనా...?

ఉదాహరణకు : నూతనత్వం కోసం....

పేదరాశి పెద్దమ్మ ఫాక్స్ పంపొచ్చు

విక్రమార్కుడు వీడియో ఛాట్ చేయొచ్చు

యువరాజు యూ ట్యూబ్ వీడియో చూడొచ్చు

మాంత్రికుడు మొబైల్ ఫోన్ వాడొచ్చు

అయితే.....

నేడు ఆధునికి యుగంలో...

ముఖ్యంగా ఆడియో రంగంలో ...

ఇలా చేయొచ్చా...

ఉదాహరణకు చూడండి : ఎలై...ఎలై....అన్న పాట విన్నారా...ఎవరైనా...వింటే గనుక మీకు ఈ పాటికి అర్థమైపోతుంది కూడానూ.

ఎలై...ఎలై... (జస్ట్ గణేష్ అనుకుంటా...)  అస్సలీ పాటలో గళం ఉందా...?  మెషిన్ ఉందా...?

అలాగే మల్లన్న సినిమాలో నాపేరూ ....కన్యాకుమారి...అంటూ సాగే పాటలో గొంతు ఉందా, యాంత్రీకరణ ఉందా...?  (మధ్య మధ్యలో అన్యాపదేశంగా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్...అని మిక్సింగ్)

నాకర్థం కానిది ఏమిటంటే....పాట అంటే ఏమిటి ..?

భావాలు పోయాయి.  అభావాలు మిగిలాయి.

ఇప్పుడు లభ్యమయ్యే సాంకేతికతను (ముఖ్యంగా ఆడియో పరంగా) మంచి గళాలను, మంచి స్వరబద్ధం చేసిన యాంత్రీకరణ విధానాల ద్వారా ఇంకా వినసొంపుగా చేయకుండా...ఇదేమి పద్ధతండీ బాబోయ్....

ఇది పురోగమనమా.....తిరోగమనమా...!!

చర్చకు ఆహ్వానం


కొసమెరుపు : You are not allowed to view links. Register or Login to view.
మిత్రులు యం.శ్రీనివాస్ గుప్తా గారి పిలుపు మేరకు వాడి వేడి చర్చకు ఆహ్వానం.
Quote this message in a replyReply

Post: #2

మంచి విశయాన్నే చర్చకు పెట్టారు. మనం పుట్టక ముందునాటి ౧౯౫౪ (1954) నాటి పాటలు ఇప్పుడు విన్నా మనసుతో పాటు చెవికి కూడా హాయిగా వుండి ఏదో తెలియని దూర తీరాలకు తీసుకుపోతుంటాయి. కానీ నేటి సంగీతం (?) ఆషాఢభూతిలా వచ్చిన పది దినాలకే మరిచిపోతున్నాం. హోరు, జోరు తప్ప  శ్రుతి-లయ లేక, సాహిత్యం కూడా దరువుల మద్య  ఖూనీ చేయబడి ఎందుకు కొన్నాంరా బాబు అని కొంటే గింటే, ఎందుకు విన్నాంరా అని వింటే అనిపిస్తున్నాయి.

సాంకేతికాంశాల దుర్వినియోగంపై మరొక అంశం కూడా వుంది. సెల్ ఫోన్ లు వచ్చాక అరచేతిలో బూతుస్వర్గం ప్రత్యక్షమయి యువత చెడుమార్గంలో పోతోంది. చవకగా దొరుకుతున్న చైనా సెల్ ల ప్రభావం మరింతగా వుంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటి వలన పెడమార్గం పట్టిపోతున్నారు. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం ఈ విధంగా జరగడం వినియోగింపబడే పధ్ధతిలోనే వుంటుంది. కానీ దానికి సరైన నియంత్రణకూడా అవసరమేననిపిస్తోంది. ఏమంటారు.<!-- edit : removed unnecessary quoting -->
Quote this message in a replyReply

Post: #3

ఇది కేవలం సాంకేతిక దుర్వినియోగం మాత్రమే కాదు. భావదౌర్భాగ్యం.

విచ్చలవిడితనానికి, వెర్రిచేష్టలకి ఆలవాలం.

మీ భావాలకి నా ఆలోచనలను ఇక్కడ జోడిస్తున్నాను.

మిత్రులందరూ ఈ లింకు కు వెళ్ళి మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా వెలిబుచ్చగలరని ఆశిస్తాను....

తెలుగుకళ - పద్మకళ

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)