Post: #1

కంప్యూటర్ లో ప్లే అవుతున్న వీడియో నుంచి స్టిల్ ఇమేజిని పొందడం ఎలా.

వీడియో కట్టర్ అనే సాఫ్ట్ వేర్ చూసాను.  వీడియోను కట్ చేసినప్పుడు బాగానే పనిచేస్తోంది. కానీ ఇమేజిని సేవ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు విసిడి కట్టర్ ఎన్ కంవుంటర్డ్ ఎర్రర్... అని సాప్ట్ వేర్ క్లోజ్ అయిపోతోంది. ఇలా ఎర్రర్ మెసేజి రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి.

ఇదివరకు ఈ సాప్ట్ వేర్ ఉపయోగించినప్పుడు ఇమేజిలను సేవ్ చెయ్యగలిగాను. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ రావడానికి కారణం ఏమయి ఉంటుంది...

Quote this message in a replyReply

Post: #2

sudharani65 గారు

మీరు కట్ చేసిన తర్వాత ఇవ్వవలసిన సేవ్ పాత్ ను మార్చి చూడండి

Quote this message in a replyReply

Post: #3
sudharani65 గారు KM player లో వీడియో ప్లే చేసి ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి అందులో capture కు సంబందించిన ఒక option వస్తుంది దాని నుండి ట్రై చేయండి నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ KM player చాలా బాగా పని చేస్తుంది KM player లో సెకనుకు 1 నుండి 10 కన్నా ఎక్కువగానే ఇమేజ్ లు సేవ్ చేసుకోవచ్చు రిజల్యూషన్ కూడా మర్చుకోవచ్చు ఇది background లో ఇమేజ్నా లను సేవ్ చేస్తుంది ప్రస్తుతం నా సి స్టం పని చేయకపోవడం వల్ల పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నాను సిస్టం ok అయ్యాక screen shot లతో పూర్తి వివరాలు మరియు download link ఇస్తాను

ఒకసారి
google లో KMPLAYER DOWNLOAD కీవర్డ్ తో సెర్చ్ చేయండి
Quote this message in a replyReply

Post: #4
మీరు చెప్పిన కె.ఎమ్.ప్లేయర్ దొరికింది. దానిలో వీడియో ఫైల్స్ ని చూడడం కూడా కొత్త అనుభూతి. నిజంగా చాలా బాగుంది. కానీ రైట్ క్లిక్ చేస్తే మీరు చెప్పిన ఇమేజ్ కాప్చర్ కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రం లేవు. వేరే చాలా ఉన్నాయి...సబ్ టైటిల్స్,వీడియో సైజ్ లాంటివి. వి.ఎల్.సి ప్లేయర్ కన్నా ఈ ప్లేయర్ చాలా బాగుంది.(ఇమేజ్ కాప్చర్ విషయం కొంచెం నిరాశ పరిచినా).మీ సిస్టం త్వరగా బాగుపడి నాకు మంచి సూచనలిస్తారని చూస్తున్నాను.
Quote this message in a replyReply

Post: #5

(25-Oct-2009 12:11 AM)sudharani65 Wrote: You are not allowed to view links. Register or Login to view.మీరు చెప్పిన కె.ఎమ్.ప్లేయర్ దొరికింది. దానిలో వీడియో ఫైల్స్ ని చూడడం కూడా కొత్త అనుభూతి. నిజంగా చాలా బాగుంది. కానీ రైట్ క్లిక్ చేస్తే మీరు చెప్పిన ఇమేజ్ కాప్చర్ కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రం లేవు. వేరే చాలా ఉన్నాయి...సబ్ టైటిల్స్,వీడియో సైజ్ లాంటివి. వి.ఎల్.సి ప్లేయర్ కన్నా ఈ ప్లేయర్ చాలా బాగుంది.(ఇమేజ్ కాప్చర్ విషయం కొంచెం నిరాశ పరిచినా).మీ సిస్టం త్వరగా బాగుపడి నాకు మంచి సూచనలిస్తారని చూస్తున్నాను.

సుధారాణి గారు,

మీరు KM palyer గురించి మరిన్ని విషయాలు తెలుసుకోడానికి ఈ ఫోరం చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

నేను చూసినంతలో ఈ ప్లేయర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది.సౌండ్ క్లారిటీ మరియు వీడియో క్లారిటీ సూపర్బ్ .

మీకు క్యాప్చర్ ఆప్షన్స్ కనపడాలంటే ..ఈ క్రింది విధంగా చేయండి.

1.స్క్రీన్ పై రైట్ క్లిక్ చేసి options ను క్లిక్ చేసి అందులో Advanced Menu ను సెలెక్ట్ చేయండి.

ఇప్పుడు స్క్రీన్ పై రైట్ క్లిక్ చేసి చూడండి,మీకు capture option కనపడుతుంది ఈ క్రింది విధంగా..

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)