Post: #1
You are not allowed to view links. Register or Login to view. ఈ పోస్ట్ లొ nicky గారి సందేహానికి అనుగుణంగా ఈ పోస్ట్ చేయబడింది. Torrent విధానం లొ డౌన్ లోడ్ చేసుకుంటూ ఇలాంటి సందేహం ఉన్న అందరికీ ఉపయోగపడే విషయం గా తలచి వేరే థ్రెడ్ ఓపెన్ చేసి ఇలా  వివరించటం జరిగింది.


ఈ పోస్ట్ అర్ధం చేసుకోవాలంటే కొత్త వారు టోరెంట్ డౌన్ లోడ్ విధానం పై క్రింది లింక్ ఓపెన్ చేసి నా మొదటి పోస్ట్ తప్పక పూర్తిగా చదవండి, చూడండి.
You are not allowed to view links. Register or Login to view.


వివిధ ట్రాకర్స్ ద్వారా వచ్చే ఒకే ఫైల్ ను కనిపెట్టి ఒకేచోట పొందుపరచి మనకు అందించే సైట్ You are not allowed to view links. Register or Login to view.. ఉదాహరణకు నేనుThe.Wild.Stallion.2009.DVDRip.XviD అనే మూవీ ని డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకున్నాను. దానిని You are not allowed to view links. Register or Login to view. సైట్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేశాను. చూడండి ఎన్ని డౌన్ లోడ్ లోకేషన్స్ మనకు ఆ సైట్ అందిస్తుందొ.
ఒక సైట్ లోని సీడర్స్ ను మాత్రమే తీసుకుంటే మనం మిగతా సైట్ల లో ఉండే సీడర్స్ ద్వారా డౌన్ లోడ్ పొందే అవకాశం కోల్పోతాం. అందుకని మనం ఎక్కువ సైట్స్ నుండి టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆయా సైట్ల లోని సీడర్స్, వేరే ట్రాకర్స్ ఉంటే వాటిని కూడా మన డౌన్ లోడ్ పరిధి లోకి తెచ్చుకోవాలి. టోరెంట్ డౌన్ లోడ్ ప్రక్రియ లొ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఎంత ఎక్కువ మంది (సీడర్స్, లీచర్స్, పీర్స్) ఈ ఫైల్ తో ఇంటరాక్ట్ అవుతున్నారనేదే.అదే మన లోడ్ సమర్ధతకు కొలమానం అవుతుందినేను అలా ముందుగా ఒక సైట్ నుండి The.Wild.Stallion.2009.DVDRip.XviD కు సంబంధించిన టోరెంట్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని utorrent అనే కంపారటివ్ గా వేగవంతమైన బిట్ టోరెంట్ క్లయింట్ ద్వారా ఆ మూవీ డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభించాను. అపుడు క్రింది విధంగా మనకు అది కనపడుతుంది. ఆతర్వాత నేను మరో టోరెంట్ సైట్ నుండి అదే మూవీకి చెందిన టోరెంట్ పాయింటర్ ఫైల్ ను మరల utorrent లో ఓపెన్ చేశాను అపుడు క్రింది విధంగా మెసేజ్ వస్తుంది. దానిలొ Yes అనేది క్లిక్ చేస్తే ఆ ట్రాకర్ తో పాటు ఆ సైట్ లో ఉన్న సీడర్స్ నుండి కూడా మన డౌన్ లోడ్ మరింత సమర్ధవంతంగా జరుగుతుంది. అలా నేను మొదటి ఇమేజ్ లో ఉన్న అన్ని సైట్ల నుండి ఆ టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను Utorrent లో ఓపెన్ చేసి నా డౌన్ లోడ్ ప్రక్రియకు మరింత సామార్ధ్యాన్ని ఇవ్వగలిగాను.


అన్ని సైట్ల నుండి డౌన్ లోడ్ ప్రారంభించాక క్రింది ఇమేజ్ లొ చూడండి నాకు ఎన్ని ట్రాకర్స్ అందుబాటులొకి వచ్చాయో.

ఇక్కడ మీరు గమనించవలసింది మరొకటి ఉంది. అది File Hash లేదా Hash లేదా Info Hash అని ఉండి దాని ఎదురుగా ఒక కోడెడ్ లైన్ ఉంటుంది. దీని ద్వారానే ఇవన్నీ ఒకే టోరెంట్ కు సంబంధించిన లింక్ లా కాదా అనేది నిర్ణయించబడుతుంది. ఆ విధంగా చెక్ చేసుకుని అన్ని లింక్ లను ఒక చోట చేర్చి You are not allowed to view links. Register or Login to view.  వంటి సైట్లు మనకు అందిస్తాయి. ఈ మూవీ టోరెంట్ యొక్క File Hash, Trackers list, Files List  క్రింద చూడండి.ఇక మనం డౌన్ లోడ్ చేసుకునే టోరెంట్ కొత్తగా జోడించబడుతున్న టోరెంట్ ఒకటి కాకపోతే Utorrent  దానిని వేరే ఫైల్ క్రింద గుర్తించి మరల పాత్ ఇవ్వమని కోరుతుంది. చూడండి.
Quote this message in a replyReply

Post: #2
Thankyou Prasad,

Good information about mTorrent downloads. It will be very useful for all users.

-
VENUGOPAL RAO BODDAPADU
Graphic Designer | Website Designer | Website Developer | SEO
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
Bangalore | Hyderabad | Srisailam | India
[Image: 124754051645376662.gif]
Quote this message in a replyReply

Post: #3
Thank you very much prasad garu.
Quote this message in a replyReply

Post: #4
Prasad garu the download speed of some torrents after completion of some 50 or 70% is drastically reduced sir. they are proceeding very slowly like 5% for one hour. what may be the problem with them ? but download speed is shown as atleast 15 or 20% . please suggest some solution regarding the completion of remaining percent. And also suggest some criteria while downloading torrents.
Quote this message in a replyReply

Post: #5

కిరణ్ గారు


ప్రపంచవ్యాప్తంగా మీతో పాటు ఫైల్ ను షేర్ చేసుకుంటున్న లేదా షేర్ చేస్తున్న పీర్స్ (కంప్యూటర్లు) ను బట్టి అనేకానేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు మీరు డౌన్ లోడ్ చేసుకునే ఫైల్ చాలా పాతదైనచో ఎక్కువమంది పీర్స్ ఉండరు, ఉన్న ఒకరిద్దరూ కూడా ఎపుడూ ఉండకపోవచ్చు. ముఖ్యంగా లిమిటెడ్ కనెక్షన్లు, ఆఫీస్ ల లో ఉండే పీర్స్ అయతే కొన్ని టైమింగ్స్ ప్రకారమే ఉంటారు, మనం మొదలు పెట్టినపుడు సీడ్ చేస్తున్నా అది టైమ్ ప్రకారం జరుగుతుంటుంది. ఉదాహరణకు క్రింది ఎక్జాంపుల్ చూడండి. నేను డౌన్ లోడ్ మొదలు పెట్టే సమయాని కి ఉన్నఒకే ఒక్క  సీడర్ ఇండియాలో BSNL వారి లిమిటెడ్ కనెక్షన్ పై ఉన్నారు, వారు రాత్రి 2.00 గంటల నుండి ఉదయం 8.00 గంటల సమయం వరకే సీడ్ చేస్తుంటారు. అందువలన నాకు ఆ ఫైల్ డౌన్ లోడ్ మిగతా సమయాల లో జరుగదు. ఏదైనా డౌన్ లోడ్ జరుగుతుంది అంటే అది పూర్తి ఫైల్ లేని మిగిలిన పీర్స్ నుండి మనకు డౌన్ లోడ్ కాని భాగాలేమైనా ఉంటే అవి మాత్రం జరుగుతూ ఉంటాయి. అపుడు అలా అలా తగ్గిపోవచ్చు కూడా.

ఇక రెండవ ఉదాహరణ. ఇది రీసెంట్ ఫైల్. దీనిలో చాలా చాలా మంది సీడర్స్ , అలాగే ఎన్నో రెట్లు మంది పీర్స్ ఈ ఫైల్ షేరింగ్ లో ఉన్నారు. ఇక్కడ దాదాపుగా బలవంతులదే రాజ్యం . అంటే 256 kbps స్సీడ్ తో మనం బలహీనులం, అలాగే 2 MB/ps స్పీడ్ తొ అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల పీర్స్ బలవంతులు. కాబట్టి బలవంతుల తర్వాతే మనకు షేరింగ్ ప్రయారిటీ లభించి తగిన విధంగానే షేరింగ్ జరుగుతున్నది, ఇలాంటి అనేకానేక పరిస్థితులు మన షేరింగ్ ను ప్రభావితం చేస్తుంటాయి.

మీరు ఒక పని చేసి చూడండి. మీరు డౌన్ లోడ్ చేస్తున్న ఫైల్ కు సంబంధించి మరింత మంది సీడర్స్ ఉన్న సైట్లను కనిపెట్టి (బ్రౌజింగ్ ద్వారా) అక్కడి నుండి మీఫైల్ కు సీడర్స్ ను పెంచుకోండి, అలాగే కొత్త కొత్త ట్రాకర్స్ నుండి కూడా ఫైల్ షేరింగ్ జరుగుతుంటే ఈ ట్రాకర్స్ ను దాని ద్వారా ఉండే మరింతమంది సీడర్స్ ను కూడా మీ డౌన్ లోడ్ ప్రక్రియకు జోడించండి. అపుడు ఏమైనా మార్పు ఉండవచ్చు. అలా జరుగకపోతే స్లో స్పీడ్ లోనే డౌన్ లోడ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. టోరెంట్ డౌన్ లోడ్ ప్రక్రియలో మనం లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫైల్స్ అయితే పూర్తి సామర్ధ్యం తో డౌన్ లోడ్ ప్రక్రియ జరిగి ఫైల్ డౌన్ లోడ్ త్వరగా పూర్తవుతుంది. కాకపోతే పైన చెప్పిన 2 వ ఉదాహరణ మినహాయింపు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)