Post: #1

క్రింది ఇమేజ్ చూడండి. దానిలొ బాక్ గ్రౌండ్ లొ ఉన్న జెనీలియా ఇమేజ్ పై మరొక ఇమేజ్ జెనీలియాదే ట్రాన్సపరెంట్ గా ఉంది. దీనిని అడోబ్ ఫొటోషాప్ ఉపయోగించి ఎలా తయారుచేయాలొ ఇపుడు చూద్దాం.



ముందుగా మీరు కావాలనుకున్న బాక్ గ్రౌండ్ మరియు ఫోర్ గ్రౌండ్ ఇమేజ్ లను రెడి చేసి పెట్టుకోండి. ముందుగా బాక్ గ్రౌండ్ ఇమేజ్ ని ఫొటోషాప్ లో ఓపెన్ చేయండి.




ఇపుడు మీరు కావాలనుకున్నఫోర్ గ్రౌండ్  ఇమేజ్ ని ఫొటోషాప్ లో ఓపెన్ చేయండి.



ఇపుడు ఫోర్ గ్రౌండ్ ఇమేజ్ యొక్క లేయర్ ను సెలెక్ట్ చేసుకుని దానిపై రైట్ క్లిక్ ఇచ్చి Duplicate Layer అనేది ఎంచుకుని దాని Destination గా బాక్ గ్రైండ్ లేయర్ ఇమేజ్ ని ఉంచండి



ఇపుడు బాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్న లేయర్ కు వెళ్ళండి. అపుడు ఇలా కనిపిస్తుంది. దానిలొని ఇమేజ్ ని మీ కు కావలసిన ప్రదేశానికి డ్రాగ్ చేయండి. అవసరమైతే ఎడిట్ మెనూ లొని Free Transform (Ctrl+T) ఉపయోగించి ఆ ఇమేజ్ సైజ్ ను తగినంతగా పెంచటం కాని తగ్గించుకోవటం కాని చేయండి. తర్వాత నేను దానిని బాక్ గ్రౌండ్ ఇమేజ్ యొక్క కుడివైపు క్రింది కార్నర్ కు డ్రాగ్ చేశాను. తర్వాత Magic Wand Tool ఉపయోగించి అక్కడి తెల్లని బాక్ గ్రౌండ్ ను తీసివేశాను. ఇపుడు క్రింది విధంగా ఉంటుంది



ఇపుడు లేయర్స్ పానెల్ కు వెళ్ళి లేయర్ యొక్క Opacity ని అవసరమైనంతమేర తగ్గించండి. నేను ఇక్కడ దానిని 60 శాతానికి తగ్గించాను. ఆ తర్వాత దీనిని నేను Save As ఉపయోగించి .jpeg గా సేవ్ చేశాను.




సేవ్ చేసిన తర్వాత మనం పైన చూసిన మొదటి ఇమేజ్ లో ఉన్నట్లుగా వస్తుంది.

Quote this message in a replyReply

Post: #2
thanks ....
very useful...........
Quote this message in a replyReply

Post: #3
chaalaa chaala thanXz.............



You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
sir chala baga ardham aindhi meku naa dhanyavadhamulu
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)