Post: #1


You are not allowed to view links. Register or Login to view. అనే పోస్ట్ కు అనుబంధంగా ఈ పోస్ట్ చేయబడినది.


ముందుగా మీరు పాస్ వర్డ్ తో ప్రోటెక్ట్ చేయాలనుకున్న MS Word 2007 file ను ఓపెన్ చేయండి.

ఈ ట్యుటోరియల్ కోసం నేను క్రింది విధంగా MS Word 2007 file ను ఓపెన్ చేశాను

తర్వాత దాని లొ క్రింది విధంగా Save As ఆప్షన్ ను ఎంచుకోండి

తర్వాత సేవ్ పాత్ ను సెలెక్ట్ చేయమని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిలో క్రింది విధంగా Tools లోని General Options ఎంచుకోండి. ఆ General Options డైలాగ్ బాక్స్ లో Password to Open మరియు Password to modify అనే చోట్ల మీ అవసరాన్ని బట్టి పాస్ వర్డ్ ఇవ్వండి (ఇది మీరు తప్పక గుర్తుంచుకోవాలి, లేనిచో మీ ఫైల్ మీరు కూడా ఓపెన్ చేయలేరు). ఆ తర్వాత OK బటన్ క్లిక్ చేయండి. అనంతరం మరల మీరు పాస్ వర్డ్ ను కన్ఫర్మ్ చేసే నిమిత్తం బాక్స్ లు వస్తాయి. వాటిలో కూడా మీరు ఇంతకెు ముందు ఇచ్చిన పాస్ వర్డ్ ను  టైప్ చేసి కన్ఫర్మ్ చేయాలి. దానితొ మీ వర్డ్ 2007 డాక్యుమెంట్ పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ అవుతుంది.

తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తే మరల Password to Open మరియు Password to modify కోసం మీరు పాస్ వర్డ్ ఎంటర్ చేయమని క్రింది విధంగా డైలాగ్ బాక్స్ లు వస్తాయి, వాటిలో మీరు సరైన పాస్ వర్డ్ టైప్ చేసి OK  చేస్తేనే మీ వర్డ్ 2007 డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది.

ఇదే విథంగా మీరు MS Excel 2007  లో కూడా చేసుకోవచ్చు, చేసి చూడండి.


పై విధంగానే  కాక మనం వర్డ్ 2007 లొను, MS Excel 2007  లో కూడా మనం Word 2007 Document >Review > Protect Document (MS Word 2007) మరియూ Excel 2007 Workbook > Protect Worksheet, Protect Workbook (MS Excel 2007)  ల ద్వారా కూడా మనం మన వర్డ్ 2007 డాక్యుమెంట్ లను కాని, ఎక్సెల్ 2007 వర్క్ షీట్ లు, లేదా వర్క్ బుక్ లను కూడా పాస్ వర్డ్ తొ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి, మీరు తేలికగా నేర్చుకోగలరు. మీకు గైడెన్స్ కోసం క్రింది తెరపట్టులను చూడండి.

MS Word 2007

MS Excel 2007

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)