Post: #1

 వాస్తు పురుష పూజ మరియు వివరములుః

క్రింది యంత్ర మధ్యమున విరాజిల్లుచున్న మహా మహిమాన్వితుడే శ్రీ వాస్తుపురుషుడు. ఈయన ఎల్లకాలమునందు పూర్ణ తపోనిష్టయందుండుటచే, ఆయన భక్తులు మరియు శిష్యగణము, ఆయన పూజ మరియు ఆశీస్సులకు సమయమడుగగా కరుణా సముద్రుడై, సంవత్సరము మొత్తములో 8 వేరు వేరు రోజులలో రోజుకి 90 నిమిషముల చొప్పున తన ధ్యాన తపములనుండి వైదొలగి ప్రజల కోరికలు నెరవేర్చుచుండెను.

కనుక మిత్రమా...

ప్రతి రోజు ఈ వాస్తు పురుషుని స్తుతించుట ఉత్తమము, అలా చేయలేకపోయిన యెడల కనీసము పైన చెప్పిన విధముగా ఎనిమిది రోజులయినా ఆయా నిర్ణయించబడిన సమయమందైనా పూజించిన యెడల వారికి వారి వారి గృహమునందు వాస్తుపరమైన ఏ దోషములున్నను తొలగిపోయి సుఖ సంతోషములు వర్ధిల్లును అనుటలో సందేహము లేదు.

కనుక మిత్రమా మార్గము తెలిసి కూడా కేవలము అలసత్వము వలన ఇబ్బందులు పడక మీకు మేలు కలుగ చేయు ఇలాంటి స్తోత్రములను చదివి సుఖసంతోషములతో వుండవలసినది అని నా మనవి.

 8 శుభ సమయములు

1. చైత్ర మాసము 10వ రోజు సూర్యోదయము అయిన తరువాత 1:30 నిమిషముల నుండి  90 నిముషములవరకు

2. వైశాఖ మాసము 21వ రోజు సూర్యోదయము అయిన తరువాత 6:24 నిమిషముల నుండి  90 నిముషములవరకు

3. ఆషాఢ మాసము 11వ రోజు సూర్యోదయము అయిన తరువాత 48  నిమిషముల నుండి  90 నిముషములవరకు

4. శ్రావణ మాసము 6వ రోజు సూర్యోదయము అయిన తరువాత 8:24  నిమిషముల నుండి  90 నిముషములవరకు

5. ఆశ్వయుజ మాసము 11వ రోజు సూర్యోదయము అయిన తరువాత 48 నిమిషముల నుండి  90 నిముషములవరకు

6.  కార్తీక మాసము 8వ రోజు సూర్యోదయము అయిన తరువాత 4  గంటలనుండి  90 నిముషములవరకు

7.  పుష్యమాసము 12వ రోజు సూర్యోదయము అయిన తరువాత 3:12  నిమిషముల నుండి 90 నిముషములవరకు

8.  మాఘమాసము 23వ రోజు సూర్యోదయము అయిన తరువాత 3:12  నిమిషముల నుండి 90 నిముషములవరకు

 

 వాస్తు పూజ పుస్తకము డౌన్లోడు కొరకు క్రింద లింకును క్లిక్ చేయగలరుః

You are not allowed to view links. Register or Login to view.

గృహప్రవేశ సమయందు కావలసిన వాస్తు సామాగ్రి లిస్టు కొరకు క్రింద లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

చంద్రమౌళి పసుమర్తి


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)